నేనొక గ్రాడ్యుయేట్‌ని. డిగ్రీ చేతికంది రెండు సంవత్సరాలయినా, ఇంకా నా ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. అవకాశాలన్నీ ఎండమావుల్లా ఊరించి, నిరాశా స్వప్నాల్లా చెదిరిపోతున్నాయి.రోజూ పేపర్లు చూడడం, అర్హమైన ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టడం, ఇంటర్వ్యూ కాల్‌ లెటర్స్‌ రావడం వంటి కార్యక్రమాలన్నీ యధావిధిగా వరుస క్రమంలో జరిగిపోతున్నాయి. అపాయింట్‌ ఆర్డర్స్‌ మాత్రం ఎవరెవరికో వెళుతున్నాయి.ఈ రొటీన్‌ జీవితం నుంచి నన్ను వేరు చేసి, నాకు ఆత్మ సంతృప్తినిచ్చేది ఒకటుంది. అది చిత్రకళ.చిత్రలేఖనమంటే నాకు చిన్నప్పటి నుంచీ ఎంతో ఆసక్తి. మిగతా ఏ క్లాసులకు వెళ్లినా, వెళ్లకపోయినా డ్రాయింగ్‌ క్లాసులకు మాత్రం ఠంచనుగా హాజరయ్యేవాడిని. నాకింకా గుర్తు. మొదటిరోజు మా డ్రాయింగ్‌ మాస్టారు జండా బొమ్మ వేసి, అందరినీ నోట్సుల్లో వేయమన్నారు. 

అందరి కంటే నేను బాగా వేసానని మెచ్చుకున్నారు. ఆ తరువాత మామిడిపండ్లు, ఇల్లు... అలా అన్ని బొమ్మలకూ ఆయన మెపను పొందాను.ఆ కళలో నాకున్న ఆసక్తిని చూసి మా మాస్టారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. ఒకసారి ఆయన చిత్రానికి, ఏదో బహుమతి వస్తే ముఖ్యమంత్రి చేతులమీదుగా దానిని అందుకున్నారు. అందరూ ఆయనను అభినందించేవారే. మా స్కూల్లో సన్మానం కూడా చేసారు. చిత్రలేఖనంలో నాకు ఆయనే స్ఫూర్తిగా నిలిచారు.మొదట్లో బాపు బొమ్మలను చూసి అలాగే వెయ్యాలని ప్రయత్నించేవాడిని. ఆ తీరుకీ ఎంతో దూరంగా వున్నట్లుండేవి. కొంత కాలానికి ఎక్కడెక్కడో కాస్త పోలికలు కనిపించేవి. అలా వ్యంగ చిత్రానికి బాపు బొమ్మల్లా కాకపోయినా, నా శైలిలో కొంత నైపుణ్యం సాధించగలిగాను.పత్రికలకు పంపే కార్టూనులేవీ ప్రచురింపబడేవి కావు. లోపం ఎక్కడుందో నాకర్థమయ్యేది కాదు. పట్టు విడువకుండా అలా పంపుతూ వుండేవాడిని. చివరకు ఒక మాసపత్రికలో నా కార్టూన్‌ వచ్చింది.

ఆరోజు నా ఆనందానికి అవధులు లేవు. తరువాత నా కార్టూన్లు చాలా పత్రికల్లో వచ్చాయి.కొన్నాళ్లకు మనుషుల రూపాలనూ, ప్రకృతి దృశ్యాలనూ చిత్రించే ప్రయత్నం మొదలుపెట్టాను. అది ఇంకా కష్టమనిపించేది. నా చదువును కూడా నిర్లక్ష్యం చేసి సమయమంతా దానికే వెచ్చించేవాడిని. అలా ఎంతో కృషి చేశాక, ఇపడిపడే ఆ విషయంలో అందరి మెప పొందగలుగుతున్నాను.నేను వేసిన వర్ణచిత్రాలను ఎన్నో మా స్నేహితులకూ, బంధువులకూ ఇచ్చాను.అవి చూసినపడల్లా నేను వారికి గుర్తుకొస్తాను. నా గురించి చెపకుంటారు. ఇది నాకెంతో గర్వకారణమనిపిస్తుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నా నాకు ఊరటనిచ్చేది ఇది ఒక్కటే.నిన్న ఒక ఇంటర్వ్యూకు వెళ్లివస్తుంటే పాత మిత్రుడొకడు కనిపించాడు. డిగ్రీలో మా క్లాస్‌మేట్‌ అపడు మాకు. కల్చరల్‌ సెక్రటరీగా వుండేవాడతను. చాలా కాలమయింది అతన్ని చూసి.