సికింద్రాబాదు క్లాక్‌టవరు దగ్గరి పాసుపోర్టు ఆఫీసు, సమయం ఉదయం ఐదుగంటలు కావస్తోంది. అప్పటికే అక్కడ పాసుపోర్టు కోసం జనం క్యూలో బారులు బారులుగా నించున్నారు. కొడుకు శ్రవణ్‌ పాసుపోర్టు నిమిత్తం సుమారు ఓ గంటక్రితమే వచ్చి మిగతావారితో పాటుగా చాంతాడులాంటి లైనులో నిలబడ్డాడు పరమేశం.‘పాసుపోర్టు కౌంటరు ఎన్నిగంటలకు తెరుస్తారు?’ తన ముందు నించున్న వ్యక్తిని అడిగాడు పరమేశం.‘ఎనిమిది గంటలకు’ విసుగ్గా సమాధానమిచ్చాడా వ్యక్తి.‘మీరు ఎన్ని గంటలకు వచ్చి క్యూలో నిలబడ్డారు’ మరలా ప్రశ్నించాడు పరమేశం.‘మీకన్నా ముందు’ చిరాగ్గా, తలతిక్కగా చెప్పాడా వ్యక్తి.ఇంకేం అడిగితే ఏం అంటాడోనని ఊరుకున్న పరమేశం ఆ గుడ్డి వెలుగులో తాను తెచ్చుకొన్న ఆనాటి పేపరు చూడ్డంలో నిమగ్నమయ్యాడు.‘ఏయ్‌ ఏంటయ్యా! ఇప్పుడే వచ్చి నీ కన్నా ముందునించున్న మమ్మల్ని కాదని బలవంతంగా ఎందుకు లైనులోకి వస్తున్నావు’ ఎవరో కుర్రాడి మీద అరిచారు మిగతా లైనులోని జనం.‘నేను మీ కన్నా ముందే వచ్చాను సార్‌. మంచినీళ్ళ బాటిల్‌ కోసమని వెళ్ళాను’ సంజాయిషీగా చెప్పాడా కుర్రాడు.విషయం తెలియని కొంతమంది ఇంకా ఆ కుర్రాడి మీద అరుస్తూ ఉంటే వారికి సర్ది చెప్పిన పరమేశం తిరిగి పేపరు చదవసాగాడు.

సమయం భారంగా గడిచి పాసుపోర్టు కార్యాలయంలో పని మెల్లిగా ప్రాంభమైంది. పరమేశం వంతు రాగానే కొడుకు శ్రవణ్‌ పాసుపోర్టు పేపర్లు ఆ క్లర్కుకి అందించి ఏమంటాడోనని ఆత్రంగా అతని వంక చూసాడు.‘ఏంటిసార్‌...! సాక్షి సంతకం అన్నచోట మీరు సంతకం చేసారు’ క్లర్కు చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు.‘ఏం బాబు... సాక్షి సంతకం నేను చేయకూడదా?’ అమాయకంగా అడిగాడు పరమేశం.కుదర దండి. మీరు తండ్రి సంతకం చేసారు కదా. అందుచేత, ఈ కాగితాలు రేపు తీసుకరండి. వెనక్కు పేపర్లు తిరిగి ఇచ్చేస్తూ అన్నాడు. వేరే ఎవరిచేతనైనా సాక్షి సంతకం చేయించి, ఆ క్లర్కుమీద పీకలదాకా కోపం వచ్చినా, అవసరం తనది కనక, కోపాన్ని పైకి కనబడనీయకుండా జాగ్రత్తపడ్డ పరమేశం ‘అలా అనకు బాబు, తెల్లారకట్లనగా వచ్చి క్యూలో నించున్నాను. మరలా రే పంటే ఎంతో ఇబ్బంది కదా! అందుచేత మీరే ఏదో మార్గం చెప్పండి’ వినయంగా అన్నాడు పరమేశం.‘ఫారం పూర్తిగా నింపడం రాదుగాని, పిల్లల్ని మాత్రం అమెరికాకి, లండనుకు పంపించాలనుకొంటారు’ వ్యంగ్యంగా తోటి క్లర్కుతో అంటూ, సరే అయితే ఇక్కడే ఉన్న ఎవరిచేతనైనా సాక్షి సంతకం చేయించి ఇవ్వండి, కరకుగా క్లర్కు చెప్పడంతో అతను చె ప్పినట్లే చేసి ఇంటిదారి పట్టాడు పరమేశం.్‌్‌్‌‘ఏంటి నాన్నగారు పాసుపోర్టు ఆఫీసునుండేనా?’ తండ్రి పరమేశాన్ని అడిగాడు శ్రవణ్‌.