వెన్నెల వెండి జలతారులై కురుస్తోంది. అరకొర మేఘాల ఈర్ష్యాసూయాలు జాబిలమ్మకు దాగుడుమూతలైనాయి. పడుచు జంటలకు స్ఫూర్తిదాయకమైన ఆహ్లాదకర వాతావరణం.భార్గవ్‌ మేడ మీదకి గబగబ నడిచాడు. పక్కనపిల్లలను పడుకోబెట్టుకోని ఆదమరచి నిద్రిస్తోందిశిల్ప. ఆమె చెంతన మెల్లగా చేరాడు భార్గవ్‌.భార్య నడుం మడతపైన సుతిమెత్తగా తడిమాడు.మరోసారి నడుం చుట్టుతా చెయ్యేసి చుట్టేసాడు.ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు తిరిగింది.తప్పన్నట్టు చూపులు విసిరింది.‘‘ఈ వెన్నెలను చూస్తే నీకేమనిపించటం లేదా శిల్పా!’’‘‘హాయిగా అనిపిస్తోంది. పిల్లలను నిద్రపుచ్చాకమనం నిద్రపోతే బహుభేషుగ్గా ఉంటుందనిపిస్తోంది’’.‘‘మరిక ఆలస్యం దేనికి? పిల్లలు మత్తులో పడ్డారు.ఇంక మనవంతు... దేనికో నీకు తెలీనిది కాదు’’ అని శిల్పనుతన మీదకి లాక్కున్నాడు భార్గవ్‌.‘‘ముదిమికి ముచ్చట్లు రావుట’’ చేతిని సుకుమారంగా తోసేసింది.‘‘ఏం మనం అరవైలో పడ్డామా ఏమిటి? ఇద్దరు పిల్లలు నీకు పాతిక నిండా రాకుండానే పుట్టేసారు. నాకు బట్ట తలంటావా... అదీ రోజుల్లో కామన్‌.’’ ఆమెనే తనివి తీరా చూస్తూ అన్నాడు.పలుచటి పొట్టమీంచి పాముపొరలా పాకిన పైట ఎత్తైన రెండు కొండల మధ్యకు చేరింది. అది చూసి భార్గవ్‌ ఉద్విఘ్నుడైనాడు. తన చేతిని మెల్లగా పాకించి మృదువుగా అదిమాడు. అది గమనించి శిల్ప చటుక్కున లేచి కూర్చుంది.‘‘ప్లీజ్‌ శిల్పా! నువ్వు కాదంటే నేనేమైపోవాలి? ఒక్కసారి... ప్లీజ్‌...’’ అని సాహసించి ఆమె పెదవులతో తన పెదాలను కలిపేసాడు.‘‘ఛ ఛ... మీరు శృతిమించి పోతున్నారు. పరాకాష్టకు చేరితే ప్రమాదం’’.

‘‘ప్రమాదం కాదు. ప్రమోదం. ఇటువంటి పిండార బోసిన వెన్నెల్లో పసిపిల్లల్లా పడుక్కోని ఎంతకాలమైందో...’’‘‘ఛీ! సిగ్గులేదూ ఆ మాటనడానికి. పిల్లలు పుట్టినా కూడా ఆ యావే!’’ కోపం ప్రదర్శించింది శిల్ప.‘‘ఆ యావ లేనిదెవరికని? అరవైలో కూడా ఇరవైలా ఉండేది ఎందరని?’’ చిలిపి తనంతో ఆమె పెదవిమీద వేలితో మీటాడు.‘‘అంటే ఇంకా వెర్రివేషాలు వేద్దామనా? చాల్చాలు. మరిక వెకిలి చేష్టలకి పూర్ణబిందువు పెట్టెయ్యండి’’. భర్త చేతులు విడిపించుకొని అటు తిరిగిపోయింది శిల్ప.అంత పండువెన్నెలా ఒక్కసారిగా మసకబారినట్టుగా అయిపోయింది భార్గవ్‌కి. భార్యామణి అంతరంగంలో ఇంత అంతరం ఎలా ఏర్పడింది? తన గత స్మృతులెంత మాధుర్యమైనవి!ఆనాటి శిల్ప.... ఈనాటి శిల్ప... అభినివేశాల్లో... అభిరుచుల్లో ఎంత వ్యత్యాసం! ఏ మాత్రం పొత్తుకుదరని పోలికలు.భార్గవ్‌ హృదయం గత వైభవోపేత సంఘటనల్లోకి తొంగిచూసింది. ‘‘మీకు అన్నీ గుర్తుంటాయిగానీ, మూరెడు మల్లెలు తేవడానికి మాత్రం జ్ఞాపకం ఉండదు. ఛీ! నాతో మాట్లాడద్దు’’ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వస్తున్న భర్తను చూడగానే అలిగి వెళ్ళిపోయింది శిల్ప.వెనకాలే పరుగున వెళ్ళి భార్యను బ్రతిమలాడ్డంలో పడ్డాడు భార్గవ్‌.‘‘ప్లీజ్‌ శిల్పా! నేను కోరి మానేసానని అనుకున్నావు కదూ! మా ఆఫీసులో ఒకరికి ఒంట్లో బాగోకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ఆ బిజీలో మరిచాను’’ బెడ్‌ మీద కూర్చుని దోసిట్లో మొహం దాచుకున్న శిల్పను ఓదార్చాడు భార్గవ్‌.