సాయంత్రం అయిదు గంటలు! వెంటనే చేస్తున్న పని ఆపేసి ఫైళ్ళన్నీ సర్దేశాను. ఇంకా ఎంతో పనుంది. కానీ మనసు ఒపకోవడం లేదు.ఇవాళ ఆరు గంటలకి రఘురాంని కలిసి వాడితో గడపాలి! రఘురాం ప్రత్యేకంగా నాకొక్కడికే పార్టీ ఇస్తున్నాడు. ఉద్యోగంలో చేరాక వాడు ఇవాళ మొదటి జీతం తీసుకుంటున్నాడు. అందువల్ల పార్టీ నాకొక్కడికే ఇవ్వాలని వాడి పట్టుదల. నిజానికి ఉద్యోగం సంపాదించుకోవడానికి రఘురాంకి నేను ఎటువంటి సహాయం చెయ్యలేదు.నాకోసం ఎదురుచూస్తూ వాడు ఎంత ఆరాటపడుతుంటాడో అనుకుంటూ రూమ్‌కి చేరుకున్నాను. ఎంతో ఉత్సాహంతో గుమ్మంలోనే ఎదురువచ్చాడు.త్వరత్వరగా తయారయ్యాను. ఇద్దరం కలిసి బయలుదేరాం! రఘు మాటల్లో ఎంతో ఉత్సాహం. గతం కలిగించిన కష్టాలు అపడపడు మాటల మధ్య చెపుతూనే ప్రస్తుతం తను ఎంత సంతోషంగా బతుకుతున్నాడో రెట్టించిన హుషారుతో చెపుతున్నాడు.నేను, రఘు కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాం. చదువుకుంటూనే ఒకరికొకరం దగ్గరయ్యాం. కాలేజీ అయిపోయాక నేను, వాడు నా గదిలో కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం.కాలేజీలో చదువుకునేటపడు ఎంతోమంది పరిచయమవుతారు. అలాగని అందరూ స్నేహితులు కాలేరు. స్నేహం కలిసినా ఆప్తులుగా కలుసుకోవడం అరుదు. ఈ అరుదయిన సంగతే నన్ను - రఘుని కలిసేటట్టుగా చేసింది.పరీక్షలు అయిపోగానే నేను విశాఖపట్నం వచ్చేశాను. ఇద్దరం ఫస్టుక్లాసులో పాసయి డిగ్రీలు తీసుకున్నాం.

‘‘మనం చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం దొరకదు. అలాగని ఇంకా చదువుకుంటూ పెద్ద ఉద్యోగాలు చెయ్యాలనే ఆశతో బ్రతకడం నాకిష్టంలేదు. కాని రఘు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చెయ్యాలని, అందుకు తగిన ఉద్యోగం తెచ్చుకోవాలని పంతం పట్టాడు.రఘు యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటూ కాలం గడుపుతున్నాను. మా ఇద్దరి మధ్య ఉత్తరాల వల్ల మా జీవిత విధానం ఒకరికొకరికి తెలుస్తుండేది.ఒకరోజు హఠాత్తుగా నాకు ఉద్యోగం వచ్చింది. వెంటనే చేరిపోయాను. ఒక సంవత్సరం తరువాత రఘు యూనివర్సిటీ చదువు పూర్తయింది. ఎంతో పట్టుదలతో పోస్టుగ్రాడ్యుయేట్‌ అయిన రఘురాం ఎన్ని కష్టాలుపడినా వాడు కోరుకున్న ఉద్యోగం దొరకలేదు. ఈడొచ్చిన ఆడపిల్ల త్వరగా పెళ్ళవ్వాలని కోరుకుంటుంది. చదువు పూర్తయిన తర్వాత మగపిల్లాడు అతిత్వరగా ఉద్యోగం రావాలని ఆరాటపడతాడు.క్లిష్ట పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఎదురయ్యే అనుభవాలు ఎన్నెన్నో. సరిగ్గా ఇటువంటి పరిస్థితి రఘురాం అనుభవించాడు.‘‘ఒరేయ్‌ వంశీ ఆశలు పెంచుకోవడం, అవి తీరలేదని పడే బాధా మనసుని మనిషిని క్రుంగదీస్తుందని ఇపడిపడే తెలుసుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వెంతో అదృష్టవంతుడివి’’ ఉత్తరాల్లో రఘురాం పరిస్థితి వ్యక్తం చేస్తుండేవాడు.రఘురాం రాసిన ఉత్తరాలు చదువుతున్నపడు ఎంతో బాధపడుతూనే ‘‘ఇపడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏదో ఒకరోజు నీ కష్టం ఫలిస్తుంది’’ అంటూ రాసిన ఉత్తరాల ద్వారా ఓదార్పు కలిగేది.