మీ సేవా కేంద్రంలో విద్యుత్‌ బిల్లు చెల్లించి బయటపడ్డాను. అసలే మబ్బులు కమ్ముకు వస్తున్నాయి. అయినా వెళ్ళిపోదామని బైకు తీశాను. ‘‘సార్‌!’’ అన్న పిలుపుతో అటువైపు తిరిగాను.ఆమె మొహంలో ఏదో విచారం! దిక్కులు చూస్తోంది. ‘‘సార్‌! బిల్లుకు సరిపడ సొమ్మే మా ఆయన ఇచ్చారు. ఫైన్‌ పడుతుందనుకోలేదు. మీ దగ్గర ఓ ముప్ఫై ఉంటే ఇస్తారా? కట్టేస్తాను. లేకపోతే మళ్ళా రెండు కిలోమీటర్ల దూరం పోయి రావాలి. ఇక పావుగంటలో మూసేస్తారు’’ అభ్యర్థించింది. ఓ ఆడది... పైగా అందమైనది.... అడుగుతుంటే కాదనలేక తీసిచ్చాను.‘‘థాంక్యూ! సార్‌!’’ అని లోపలికెళ్ళి బిల్లు కట్టేసి వచ్చింది. అప్పటికే వానపడేలా ఉంది. ఎక్కడికెళ్ళాలని అడిగితే ‘అయ్యన్నపేట’ అని చెప్పింది. నేనూ అదే దారి కాబట్టి రమ్మన్నాను. ఆమె బండెక్కింది ‘‘మీ మేలు మరచిపోలేను’’ మధ్యలో ఓసారి అన్నది.‘‘ఇంతకీ మీ పేరు? మీ వారేం చేస్తారు? పిల్లలున్నారా?’’ వివరాలు కనుక్కోవాలనే ఆసక్తి నన్నురికించింది.రోడ్డుమీద ఒక్కసారి బండి జర్క్‌ ఇచ్చింది. ఆమె ఎద ఎత్తులు హఠాత్తుగా హత్తుకున్నాయి. నరాలు జివ్వుమన్నాయి.పూలదండ తాకినట్లుగా శరీరం గమ్మత్తుగా పులకించి, మనసు తీయగా మూలిగింది. ‘‘నా పేరు సువర్ణ! ఆపండి! ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లు’’ ముక్తసరిగా జవాబు.‘‘మరి మీకు డబ్బులెలా అందించాలి. ఇప్పుడిద్దామంటే ఇంట్లో ఉంటాయో ఉండవో చెప్పలేను. పోనీ మీ సెల్‌ నెంబరివ్వండి. టౌన్లోకొచ్చినప్పుడు ఎక్కడ కలవాలో చెబుతా.

 అక్కడికి వద్దురుగాని’’ దిగాక చెప్పింది. కాగితంపై రాసిచ్చాను.ఫఫఫఒక్కసారి నా కళ్ళముందర సువర్ణ రూపం కదలాడింది. మిరుమిట్లు గొలిపే కాంతితో ఆమె అందం వర్ణనాతీతం! శృంగారపరంగా వెర్రెత్తించే స్ఫురద్రూపం!!! సుఖాలకు ఆహ్వానించేలా కళ్ళల్లో కవ్వించే మగత...!! ఇటువంటి అందగత్తెతో పరిచయానికి అదృష్టం ఉండాలి. వయసులో నాకూ ఆమెకు చాలా తేడా! మూడ్రోజులైపోయింది. సువర్ణ నుంచి ఏ ఫోనూ లేదు. బహుశా ఆ సమయంలో అవసరానికి నన్ను వాడుకుందేమో తెలీదు. మళ్ళా ఎక్కడైనా అనుకోకుండా తారసపడితే తప్ప కలవడం జరగదు.ఒకరోజు ఆఫీసుకెళ్తుంటే అదేపనిగా ఫోన్‌ మోగుతోంది. తెలియని నంబరు... ట్రాఫిక్‌ మహా రద్దీగా ఉంది. సెల్‌ తీయలేదు. ఒక అరగంట తర్వాత మళ్ళా అదే నంబర్‌! విసుగ్గానే ఎత్తాను.‘‘హలో! నేన్సార్‌! ఆరోజు మీ సేవా కేంద్రం దగ్గర కలిశాం. గుర్తుందా? మీకు డబ్బివ్వాలి కదా! నేనిప్పుడు బాలాజీ మార్కెట్‌ పక్కకు వస్తున్నాను. మీరు అక్కడికి వచ్చాక ఈ నంబరుకి కాల్‌ చేయండి. కలుద్దాం’’ అని చెప్పి ఆపేసింది.ఔను! ఆమె సువర్ణ! ఇక నాకు ఆమె నుంచి ఏ ఫోన్‌ రాదని నిశ్చయించుకున్నాక ఆ సంగతే మరిచిపోయాను. ఓహ్‌! ఇంత కాలానికి ఆ కమ్మని గొంతు విన్నాను. అంతే! వెంటనే బయల్దేరాను. అక్కడికెళ్ళాక ఫోన్‌ చేశా! నేనున్న చోటుకామె వచ్చింది.