సమయం సాయంత్రం ఏడు గంటలు. అపడే ఆఫీసునుంచి వచ్చి స్నానం చేసి టీవీ ముందు కూర్చుని టీ తాగుతున్నాను. ఇంతలో ఇంటి ముందు టెంపో ఆగిన చపడయ్యింది. ఏంటా అనుకుంటూ గబగబా బయటకెళ్ళింది శ్రీమతి. టెంపోలోంచి కంప్యూటరు ఎదురింట్లో పెడుతున్నారు. వాళ్ళు కంప్యూటరు కొనుక్కున్నారు కాబోలు అనుకుంటూ శ్రీమతి ఏదో వింతను చూసినట్లు చూసి గబగబా చేతులూపుకుంటూ లోపలికి వచ్చి ‘ఎదురింటి వాళ్ళు కంప్యూటరు కొన్నట్లున్నారు.
మనం కూడా కొందామండీ’ అంది నాతో. ‘సరేలే చూద్దాం. ముందు వంటకానీ’ అంటూ ఆరోజుకి ఆ ప్రస్తావన దాటవేశాను.‘ఇక ప్రతి రోజు కంప్యూటరు కొనేవరకు నిద్రపోనివ్వదు కాబోలు’ అని మనస్సులో అనుకున్నాను.‘‘ఏంటి మీలో మీరు ఏదో గొణుక్కుంటున్నారు’’ అంది శ్రీమతి.‘‘ఆఁ ఏం లేదు. నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు కదా. కొని ఏం చేసుకుంటావా అని’’ అన్నాను.‘‘నేర్చుకుంటాను. మీరున్నారుగా నేర్పడానికి. మీరూ కంప్యూటర్ కోర్సు వెలగబెట్టారుగా.. ఆ మాత్రం నాకు నేర్పలేరా కంప్యూటర్ కొనకుండా తప్పించుకుందామని ఎత్తు కాకపోతే. అవేం కుదరవు. వెర్రి మొర్రి వేషాలు వేయకుండా రేపు కంప్యూటర్ కొని తీసుకురండి’’ ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది శ్రీమతి.‘‘అది సరే. నేర్చుకుని ఏం చేస్తావు?’’‘‘అదేంటి అలా అంటారు. ఈ రోజుల్లో కంప్యూటర్ లేనిదే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే.
అంతెందుకు రేపు మన పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా లండన్‌లోగాని అమెరికాలోగాని స్థిరపడితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఏం వండుకున్నామో ఏం తింటున్నామో అన్నీ వాళ్ళకి తెలియాలికదా. ఇపడు జీవితంలో కంప్యూటరు ఒక భాగమైపోయింది. అంతే కాదు మన దైనందిన జీవితంలో విడదీయరాని భాగం ఇంకొకటి వుంది. అదే ఇంటర్‌నెట్. ఇంటర్‌నెట్ కనెక్షన్ పెట్టించుకుంటే సినిమా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేసుకోవచ్చు. రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అభినందన శుభాకాంక్షల సందేశాలు చెపకోవచ్చు. తలచిన క్షణానే మిత్రులతో సంభాషించవచ్చు. అవసరమైన సమాచారాన్ని అరక్షణంలో మన ముందుకు తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ జరపడం ఈ-మెయిల్స్ పంపడంలాంటివి చేసుకోవచ్చు. కంప్యూటర్ ఇంటర్‌నెట్‌ల పుణ్యమా అని మనుషుల మధ్య దేశాలమధ్య దూరం చెరిగిపోతోంది. ఇక్కడే మన ఇంట్లో కూర్చొని ఇంగ్లండులోనో ఇటలీలోనో ఉన్న మనకు ముక్కూ మొహం తెలియని వాళ్ళతో కూడా ఎంచక్కా ఛాట్ చేసుకోవచ్చు అంటే కబుర్లు చెపకోవచ్చన్న మాట. మనకి ఓ కంప్యూటరు, దానికి ఇంటర్‌నెట్ కనెక్షను వుంటే చాలు. ఇక ప్రపంచం మన ముంగిట్లో వున్నట్లే!’’ అంటూ సుదీర్ఘమైన వుపన్యాసం ఇచ్చింది శ్రీమతి.