‘‘ఇంకా ఇలాగే ఉన్నావటే..లేచి చీర మార్చుకో. అల్లుడు గారు నీ కోసం కాసుక్కూర్చున్నారు’’ జడలో మల్లెలు ముడుస్తూ తొందరపెట్టింది ప్రభావతమ్మ.కీర్తిలో చలనం లేదు. సింగారించుకుందామన్న ధ్యాసలేదు.తొలిరేయి తలపులతో మలిరేయి మఽధురానుభవం కోసం తపించి పోవలసిన ఆ నవవధువు మనసు మౌనంగా ఉండడం వింతగా తోచిందామెకు.‘‘చెప్తోంది నీకే.ముఖం కడుక్కుని కొత్త చీర కట్టుకో’’ స్వరం రెట్టించింది ప్రభావతమ్మ‘‘తలనొప్పిగా ఉంది. విసిగించకు. నేను ఇవాళ ఇక్కడే పడుకుంటాను’’ ఖండితంగా చెప్పింది కీర్తి.‘‘అదేంటే..తలనొప్పైతే ఏదైనా మాత్ర వేస్కోవాలిగానీ గదిలోకెళ్లనంటావేంటి?’’ కూతురు మాటకు విస్తుపోతూ అంది ప్రభావతమ్మ.మరి మాట్లాడకుండా మంచమెక్కి ముసుగుతన్నింది కీర్తి.ఆమె ధోరణికి జగన్నాఽథం కూడా నివ్వెరపోయాడు. కూతురికి ఎలా చెప్పాలో తెలీక తిన్నగా అల్లుడి దగ్గరికెళ్లి...‘మరోలా అనుకోకు బాబూ! అమ్మాయికి వంట్లో బాగోలేదు.’’అంటూ సర్దిచెప్పాడు.మతిపోయింది మనోజ్‌కి. ఉన్నట్లుండి కీర్తికేమైంది?..నిన్న బాగానే ఉందే!..తలనొప్పి సాకుతో తన నుంచి తప్పించు కోవాలని చూస్తోందా? మరి పెళ్లెందుకు చేసుకుంది. కొంపదీసి లవ్‌ ఎఫైర్‌ ఏమైనా...ఆ ఊహకు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యాడు. అలాంటిదేదైనా ఉంటే నిన్నరాత్రి తనతో సహకరించి ఉండేది కాదు కదా! ఆమె మాటల్లో గాని, చేష్టల్లో గాని ఎక్కడా అయిష్టత అనేది కానరాలేదు. మరెందుకీరోజు ఇలా ప్రవర్తిస్తోంది? తన గురించి ఎవరైనా ఏదైనా చెడుగా చెప్పారా? నిజంగా వంట్లో బాగో లేకపోతే ఆ సంగతి తనతో చెప్పొచ్చు. ముఖం చాటేయడం దేనికీ? సడన్‌గా గత రాత్రి అనుభవం కళ్లముందు మెదిలింది.ముద్దమందారంలా ఎర్రగాబొద్దుగా ఉంటుంది కీర్తి.

 కళ్లు చెదిరే అందం ఆమె సొంతం. అట్టే చదూకోకపోయినా సంస్కారమున్న వ్యక్తి. నవనీతం వంటి మనసు ఆమెకున్న ఒకే ఒక ఆభరణం.చేతులకి పాదాలకి తళుకులీనే మెహందీ సొగసులు, మెడలో పసిడికాంతులు మించి మిలమిల మెరిసే పసుపుతాడు, ముద్దొస్తున్న ముఖారవిందంలో కలబోసుకుని అలముకున్న సిగ్గు దొంతరలతో మూర్తీభవించిన నవవధువు. పాలగ్లాసుతోఅడుగులో అడుగు వేస్తూ గదిలోకిచ్చింది.గ్లాసు అందుకుని పక్కనపెట్టి మృదువుగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు మనోజ్‌.మగడి స్పర్శకు పులకించిపోయిందామె తనువు. పయిట జారింది. ఆమె పరువం కనువిందు చేయడంతో నడుం చుట్టూ చేయివేసి ఆమె పెదాల్ని అందుకోబోయాడు.సిగ్గుతో తల పక్కకు తిప్పింది. అయినా వదల్లేదు మనోజ్‌. కీర్తిని తన వైపుకు తిప్పుకుని ఆమె శరీరంలోని ప్రతి అణువుని మృదువుగా స్పృశించాడు.మత్తుగా మూలుగుతూ రెప్పలు వాల్చింది. ఒక్క ఉదుటున ఆమెను పాన్పు మీదకు నెట్టాడు. అయితే అసలు అనుభవంలోకి జారే ముందు ఆమె రవ్వంత అసంతృప్తికి లోనైనట్లు గ్రహించాడు. తన తొందరపాటు ఆమెను ఇబ్బంది పెట్టిందేమో అనుకున్నాడు.