అవును-అప్పటికి నేను బ్రతికే వున్నాను.అందుకే...‘‘నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను సారికా!’’ అని సాందీప్‌ అన్నపడు విరగబడి నవ్వగలిగిందామె.అదే వేరెవరైనా అయితే సాందీప్‌ లాంటి శ్రీమంతుడు అలా అన్నందుకు నివ్వెరపోయుండేవారే! ఎంత అదృష్టం?! అని మురిసిపోయేవారే!సాందీప్‌ శ్రీమంతుడే కాదు. అంతకు మించిన బుద్ధిమంతుడు కూడా. చదువులోనూ, ఆటల్లోనూ, చురుకుదనంలోనూ అన్నింటిలోనూ ఫస్టే-బెస్టే! ఎటొచ్చీ అందంలోనే కాస్త వీక్‌! అలాగని అనాకారి కాదు. కానీ సారికతో పోలిస్తే సూర్యుడి ముందు దివిటి లాంటివాడే!‘‘ఎందుకు సారికా అలా నవ్వుతున్నారు? ఏం నా ప్రపోజల్‌ మీకు నచ్చలేదా?’’ అని అతనంటే-‘‘మిమ్మల్ని మీరు ఒకసారద్దంలో చూసుకోండి’’ అని హేళనగా అనేసి విసురుగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది సారిక.అయినా సాందీప్‌ ఆమెను విడువలేదు.మర్నాడు మళ్లీ అదేమాట చెప్పి ‘‘మీరు కాదంటే నేనాత్మ హత్య చేసుకుంటాను’’ అని బెదిరించాడు. మితిమీరిన ప్రేమ మగాడితో పలికించే ‘పిచ్చిమాట’అది.అతని పిచ్చితనానికి పిచ్చికచ్చిగా నవ్వింది సారిక.‘‘అలాగేం? ఏదీ - దమ్ముంటే నిజంగా ఆత్మహత్య చేసుకోండి....’’ అని కవ్వించింది. అపడు నమ్ముతా మీ ప్రేమ నిజమేనని అంటూ ఊరించింది.పాపం... ఆమె మాటల్ని అమాయకంగా నమ్మి నిజంగానే ఆత్మహత్యకు ఒడిగట్టాడు సాందీప్‌మింగిన నిద్రమాత్రలు సంఖ్య ఎక్కువే అయినా సమయానికెవరో హాస్పిటల్‌లో చేర్పించడం వల్ల అతనికి ప్రాణాపాయం తప్పింది.

ఆ తరాత కూడా అతనామెను ప్రాధేయపడబోతే ‘‘మీ ఉత్తుత్తి బెదిరింపులకి కరిగిపోవడానకి నేనేం పిచ్చిదాన్ని కాదు’’ అంటూ అతన్ని తీసిపారేసింది సారిక.అతనూ పిచ్చివాడు కాకపోవటాన మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యలేదు.ఆ కథ అలా ముగిసింది.్‌్‌్‌ఓ ఆర్నెల్ల తర్వాత...అప్పటిక్కూడా నేనింకా బ్రతికే వున్నాను.అందుకే తండ్రి ఒక మంచి సంబంధం తీసుకొస్తే ‘ఏం బావున్నాడు? బావురుకప్పలా, నేను చచ్చినా చేస్కోను’’ అంటూ తిరస్కరించింది సారిక‘‘బావుండకేమమ్మా? కన్ను కాలూ అన్నీ తిన్నగానే వున్నాయిగా?! స్టేట్‌ గవర్నమెంట్‌లో ఇంజనీర్‌గా చేస్తున్నాడు. ఏ బాదరాబందీ లేదు. ముఖ్యంగా అత్త పోరూ ఆడపడుచు పోరూ వుండవు. ఇలాంటి సంబంధాలు మనం కావాలనుకున్నపడల్లా వస్తాయా?!’’ అంటూ తండ్రితో పాటు తల్లి కూడా ఆమెకు నచ్చజెప్పడానికి శతవిధాల ప్రయత్నించారు.‘‘అయినా అందాన్ని కొరుక్కుతింటామా?’’ అంది తల్లి.‘‘మనిషి సుఖపడేందుకు అందం కన్నా మంచి మనసు ముఖ్యం తల్లీ’’ అన్నాడు తండ్రి.వాళ్ల మాటలామె చెవికెక్కలేదు. ఎక్కినా కూడా అసలే మాత్రం రుచించలేదు.‘‘నా ప్రాణం పోయినా సరే! ఈ సంబంధానికి నేనొపకోను’’ అనేసింది నిర్ద్వందంగా.్‌్‌్‌మరో ఆర్నెల్ల తర్వాత-మరో మంచి సంబంధాన్ని కూడా అలాగే తిరగ్గొటేసింది సారిక.అప్పటికీ నేనింకా బ్రతికే వున్నాను.‘‘అసలేంటే నీ ఉద్దేశం? ఇలా వచ్చిన సంబంధాలన్నింటికీ వంక పెడితే ఎలా? నీ కోసం పై నుండి ఏ మన్మధుడో దిగిస్తొడనుకుంటున్నావా?!’’ అని కేకలేశారామె తల్లిదండ్రులు.