‘‘నాకు ట్రాన్స్‌ఫర్‌ అవడంతో త్వరలో వచ్చేస్తున్నాను.’’ ఆరోజు పోస్ట్‌ చూస్తున్న నేను ఉలిక్కిపడ్డాను! ఈ ఉత్తరం ఎవరు రాశారో ఎక్కడి నుంచి రాశారో తెలిసినా వెనక ఫ్రమ్‌ అడ్రస్‌ చూశాను.కరెక్ట్‌! రామకృష్ణ రాసిన ఉత్తరం! పేపరులో హెడ్‌లైన్‌ లాగా అసలు విషయాన్ని తన ఉత్తరంలో మొదటి వాక్యంగా రాశాడు! అలా రామకృష్ణ రాయడం ‘‘నేను అనుకున్నది తప్పకుండా టైమ్‌కి సాధించగలను’’అనే సమర్థతకు ముఖ్యంగా పట్టుదలకు ఉదాహరణ!రామకృష్ణ రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే పనిచేశాడు. రామకృష్ణకి ఆఫీసులో ఎంతో గుర్తింపు వుంది! స్వతహాగా తెలివైనవాడు. ‘‘పీకలు ముంచే సమస్యలు కూడా ఎంతో తేలికగా పరిష్కరించి, ఆఫీసర్ల మెప పొందిన వ్యక్తి! ఆఫీసులో రామకృష్ణకి తెలియని విషయం వుండదు!అలాగని రామకృష్ణ అన్ని విషయాలలో తల దూర్చడు. తన సెక్షన్‌ పని టైముకి పూర్తిచేయడం, వెంటనే మరో పని గురించి ఆలోచించడం, ఇటువంటి లక్షణాలు వున్నవాడు! అతనిలో లోపాలు వెతకాలనుకోవడం ఒట్టి తెలివితక్కువతనం అని అక్షరాలా నిరూపించిన మనిషి. రామకృష్ణ తోటి ఉద్యోగస్థుడిగా నేను చేశాను! అతని సెక్షన్‌లోనే నన్ను కూడా వేశారు. ఒక వారం రోజుల వరకూ నాకంటూ స్వయంగా పని కల్పించలేదు. మేము పనిచేస్తున్న డిపార్ట్‌మెంటు రూల్స్‌ ప్తుకాలు, వాటి అవసరాల గురించి క్లుప్తంగా చెప్పి నన్ను చదివి అర్థం చేసుకోమన్నాడు. మామూలుగా చదవడం కాదు! మనసు పెట్టి చదివి ముఖ్యమైన విషయాలు ప్రత్యేకంగా రాసి వుంచుకోమ్మని మరీ చెప్పాడు!

‘‘ఇతను రూల్స్‌ పాటించే మనిషి’’ రామకృష్ణంటే నాలో కలిగిన అభిప్రాయం.‘‘వెరీగుడ్‌ శ్రీరామ్‌! మీరు డ్రాఫ్టింగ్‌కి ఉపయోగించిన వాక్యాలు చాలా బాగున్నాయి! అంతేకాదు మీకు ఇంగ్లీషు మీద మంచి కమాండ్‌ వుంది’’నన్ను మనస్ఫూర్తిగా అభినందించిన అపురూపమైన క్షణం. వారు మిగిల్చిపోయిన ఒక తియ్యటి జ్ఞాపకం! ప్రస్తుతం ఆ అనుభూతిని నా హృదయాన్ని సున్నితంగా స్పర్శిస్తోంది. అది కేవలం క్షణికం.మనం చేసింది తప్పని తెలిసినా మనతో పాటు మరొకరు కూడా తప చేశారనుకోవడం సహజం. అంతేకాని తప చెయ్యకుండా వుండాలనే ఇంగితజ్ఞానం రమ్మన్నా రాదు. నేర్చుకుందామనుకోవడానికి అహం అడ్డుపడుతుంది. రామకృష్ణకి ఎటువంటి పరిస్థితిలో ట్రాన్స్‌ఫర్‌ అయిందో జ్ఞాపకాల తెరలేస్తోంది.్‌్‌్‌మధ్యాహ్నం రెండు గంటలు! రామకృష్ణ, నేను, లంచ్‌ అయ్యాక సెక్షన్‌కొచ్చి కూర్చున్నాం.ఫోన్‌ మోగింది. తియ్యాలా, వద్దా అనుకుంటూ రామకృష్ణని చూశాను. టెలిఫోన్‌ మోగుతోందన్న సంగతి గమనించకుండా నోట్‌ ప్రిపేర్‌ చేస్తున్నాడు. టెలిఫోన్‌ ఆగకుండా మోగుతోంది.‘‘హలో...’’ అన్నాను.‘‘రామకృష్ణ వున్నాడా?’’ అటువైపు నుంచి ఎవరో అడుగుతున్నారు.‘‘ఒక్క నిమిషం’’ అంటూ రామకృష్ణకి ఫోన్‌ అందివ్వబోయాను.