కాలింగ్ బెల్ అదేపనిగా, ఐదు నిమిషాలపాటు మోగుతూనే ఉంది.గాఢనిద్రలో ఉన్న అనుపమకు ఆ కాలింగ్‌బెల్ మోగుతున్న చపడు ఆమె కంటున్న కలలో వినిపిస్తున్నట్టుగా వినిపిస్తోంది. కాస్సేపట్లోనే ఆమెకు ఆ చపడు కలలో వినిపిస్తున్న చపడు కాదనీ, బయట ఎవరో కాలింగ్‌బెల్ నొక్కుతున్నారని అర్థమైంది. ఈ రోజు అన్వేష్ ఓ గంట ముందుగానే వచ్చేసినట్టున్నాడు. అయినా కాలింగ్ బెల్ ఎందుకు మోగిస్తున్నాడో, అతడు వెళ్ళేటపడు బయటి డోర్ తాళపు చెవి తీసికెళ్లలేదని, డోర్‌కు లాక్ చెయ్యకుండానే వెళ్ళిపోయాడని ఆమెకు గుర్తొచ్చింది.ఆమె దిగ్గున లేచి బెడ్‌రూంలోంచి బయటకొచ్చింది.కాలింగ్‌బెల్ ఇంకా మోగుతూనే ఉంది.
‘‘వస్తున్నానండీ’’ అంటూ ఆమె ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకొచ్చి తలుపులు తెరిచింది.‘‘యేమిటంత మొద్దునిద్ర. ఐదు నిమిషాల నుండి కాలింగ్ బెల్ మోగిస్తూనే ఉన్నాను..’’ అన్నాడు అన్వేష్ విసుగ్గా ఇంట్లోకొచ్చి తలుపులు మూసేస్తూ.‘‘మీరు వెళ్ళేటపడు కీ తీసికెళ్ళలేదు కదూ? డోర్‌కు లాక్ చెయ్యకుండానే వెళ్ళిపోయారు. యే దొంగోడన్నా...’’ అంది అనుపమ అతనితో పాటే వాళ్ళ బెడ్‌రూంలోకి నడుస్తూ.‘‘వెళ్ళే తొందర్లో మరచిపోయాన్లే.. అందుకని ఐదు నిమిషాలసేపు నన్ను ఈ భయంకరమైన చలిలో ఇంటి బయట నిల్చోబెడ్తావా?’’ అన్నాడు అన్వేష్ బట్టలు మార్చుకుంటూ.‘‘సారీ డియర్... బాగా నిద్రపట్టేసింది. ఆశ్చర్యం యేమిటంటే కాలింగ్‌బెల్ మోగుతున్న చపడు నాకు వినిపిస్తూనే ఉంది... యేదో కల... ఆ కలలో ఈ కాలింగ్‌బెల్ మోగుతున్న చపడు అది కలకాదు నిజంగానే బయట నువ్వు కాలింగ్ బెల్ మోగిస్తున్నావని అర్థం కావడానికి కొంచెం టైమ్ పట్టింది. సారీ డియర్... వెరీ వెరీ సారీ...’’ అందామె మత్తుగాఅతని మీదకు వొరిగిపోతూ.‘‘సారీలు గీరీలు యేమొద్దుగానీ నన్ను పడుకోనీయ్. చాలా అలసిపోయాను. స్టేట్స్ నుండి వాడెవడో పంపించిన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసేటప్పటికి నా తలప్రాణం తోకకొచ్చింది..ఫీలింగ్ టెర్రిబులీ టైర్డ్’’ అన్నాడతడు చకచకా బట్టలు మార్చుకొని పక్కమీదకు చేరిపోతూ.‘‘అవును... మీరీరోజు గంట ముందుగానే వచ్చేశారు గదా... అలసిపోవడమేమిటి?’’ అందామె అతని ప్రక్కనే పడుకొని, అతన్ని తనవైపు తిపకోవడానికి ప్రయత్నిస్తూ.