బతుకు పండిందిఫ ముక్తేవి భారతిరిటైర్‌మెంట్‌తో ఎంతో విశ్రాంతి వుంటుందని, దేశంలో చూడని ఎన్నెన్నో ప్రదేశాలు చూసిరావచ్చని ఎంతో ఉత్సాహంగా అనుకున్న జయరామ్‌ మనసు ఆ రోజు ఒక్కసారిగా చిన్నపోయింది. నాకు నువ్వు, నీకు నేను, చాలు కదా అని జయరామ్‌ అన్నపడల్లా సుధామణి నవ్వి ఊరుకునేది.అపడపడు తమకి పిల్లలు లేరు అనే భావం మనసులో కదిలినా, వెంటనే దాన్ని పక్కకి నెట్టేసి భార్యాభర్తా సినిమాకో, స్నేహితుల ఇంటికో వెళ్లి కాలం గడిపి వచ్చేసేవారు.‘పిల్లలు లేకపోతేనేం, పెంచుకోండి, అదీ ఓ పుణ్యకార్యం చేసినట్టే’ అంటే ‘నాకు పిల్లలు లేరని ఎందుకంటారూ, అదిగో’ అంటూ పేపరు చదువుతూ కూర్చున్న భర్తను చూపి గల గలా నవ్వేది సుధామణి.జయరామ్‌, సుధామణి మద్రాసు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మద్రాసులో సుధామణి స్నేహితురాలుంది. అక్కడకెళ్లి అక్కడనుంచి మహాబలిపురం, కంచి చూసి రావాలని... పెళ్లయిన పదేళ్లకి వెళ్లిన మద్రాసు ట్రిప ఇపడు గుర్తొచ్చింది సుధామణికి.మహాబలిపురంలో బస్సుదిగారు టూరిస్టు బస్సు - అందంతో బాటు అక్కడ చూడాల్సిన వన్నీ చూశాక కంచికి వెళ్లారు, చీరలు కొనాలిగా మరి- సుధామణి తనకి, ఫ్రెండుకి కూడా కంచిపట్టు చీర కొన్నాక విష్ణుకంచిలో దేవాలయం చూడాలని బయల్దేరారు భార్యాభర్తా.పెద్ద చెట్టు చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జయరామ్‌, సుధామణి కూడా ప్రదక్షిణం చేశారు.

 మామిడి పండు చిన్నది. వచ్చి సుధామణి పాదాల ముందు పడింది. గబుక్కున తీసి కళ్లకద్దుకుంది. అక్కడందరూ ‘ఎంతదృష్టం, మీ కోరిక తీరుతుంది- అందుకే, ఆ పండు మీ ముందర పడింది’ అంటూ తెగ సంతోషించారు. సుధామణి మనసులో అనుకుంది తనేం కోరుకుందీ!!-‘మీరేం కోరుకున్నారూ’ అంది రహస్యంగా భర్తతో ‘త్వరగా ప్రమోషన్‌ ఇప్పించమని’ వెంటనే అన్నాడు జయరామ్‌. దేవుడి దగ్గర కూడా అదేనా- వంశోద్ధారకులు కావాలని కోరుకోవాలి అంది నవ్వి సుధామణి- ఎప్పటి సంగతో ఇది!!సుధామణి నల్లని జుత్తులో వెండి తీగలు మెరుస్తున్నాయి.రిటైరయ్యాక ఇంట్లో ఇద్దరే వుంటుంటే, భర్త పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ, భార్య చాలా బాధపడిపోతోంది... సుధామణి కళ్లముందు ఓ గొప్ప ఆలోచన మెరుపులా మెరిసింది.తన అక్క కొడుకు గుర్తొచ్చాడు. ఇంజనీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అక్కకి నలుగురు కొడుకులు... బావగారు పోయారీ మధ్య. తనకి చాలా ఇష్టమైన వాడు ఆఖరి వాడు చందు. సుధామణికి చాలా సంతోషమనిపించింది. జయరామ్‌ టి.వి లో టెన్నిస్‌ చూస్తున్నాడు. ‘దాని నోరు మూసి త్వరగా రండి’ అంటూ టి.వి కట్టే సింది.‘మా చందు వున్నాడు కదా’-‘ఆఁ వున్నాడు’