సెల్‌ఫోన్ల వల్ల మనుషుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగాయి. ఉదాహరణకి సుబ్బారావు విషయమే తీసుకోండి. అతనెక్కడికి వెళ్లినా అదంతా కామెంట్రీగా భార్యకు చెబుతూ వుంటాడు.‘‘ఆ... ఇపడే ఆటో దిగాను... మీటరు సరిగ్గానే చూశాను. బస్సు రెడీగా వుంది, డ్రైవర్‌ లేడు.. విండోసీట్‌- ఎండాకాలం కదా, గాలి రాకపోతే చచ్చిపోతాం. తలుపులు అవీ జాగ్రత్త. రెండ్రోజుల్లో వచ్చేస్తా...’’ స్విచ్‌ ఆఫ్‌.బస్సు కదిలింది.‘‘ఏం చేస్తున్నావ్‌... బస్సు కదిలింది. సిటీ ఇంకా దాటలేదు. రేపు నా బట్టలు వాషింగ్‌ మిషన్‌లో వేసేటపడు జేబులోని పేపర్లు తీసి భద్రంగా పెట్టు- పాలు తోడు పెట్టడం మరిచిపోవద్దు... రెండ్రోజుల్లో వచ్చేస్తా...’’ స్విచ్చాఫ్‌.స్విచ్‌ ఆన్‌...‘‘ఇంకా నిద్ర రాలేదా... రాదులే నేనిక్కడ వుంటే ఎట్లా వస్తుంది. ఇపడే షాద్‌నగర్‌ దాటుతోంది. టీవీలో మంచి సినిమా వేశారు. సౌండే సరిగ్గా లేదు. ఈ సినిమా ఏంటో చెపకో. మనిద్దరం కలిసే చూశాం... సౌండ్‌ వినిపిస్తోందా. పాటొస్తే కనిపెడతావ్‌. చెప్పేస్తా... నువ్వంటే నాకిష్టం. (నవ్వు) పక్కన ఎవరైనా అమ్మాయి వుంటే బావుండేది. అంతదృష్టం కూడానా... ఏయ్‌ ఫోన్‌ ఆఫ్‌ చేయకు వూరికే సరదా... మళ్లీ కర్నూల్‌లో ఫోన్‌ చేస్తా’’ - స్విచ్చాఫ్‌కర్నూలొచ్చింది.

‘‘హాయ్‌.. నిద్రపోయావా! డిస్టర్బ్‌ చేశానా. అంత కోపమొద్దు. ఫోన్‌ పెట్టేయకు’’మళ్లీ ఫోన్‌ మోగింది.‘‘రేయ్‌ సుబ్బారావు.. అర్జెంట్‌గా నీ బండి కావాలి ఇస్తావా?’’‘‘నేను బస్సు ప్రయాణంలో వున్నాను’’‘‘ఏం పరవాలేదు. నీ బండికి డూప్లికేట్‌ కీస్‌ నా దగ్గరున్నాయ్‌’’సుబ్బారావుకి నిద్రపట్టలేదు.

‘సారే జహాసే అచ్చా’ అంటూ ఫోన్‌ మోగింది.‘‘అప్రావ్‌ హియర్‌’’ అన్నాడు అప్పారావు.‘‘నేన్రోయ్‌.. కాకినాడ కనకారావ్‌ని’’‘‘కనకారావు.. బావున్నావా. ఇపడే ఢిల్లీకి విమానమెక్కుతున్నాను. ఎలక్షన్‌ రిజల్ట్‌ వచ్చేలోగా ఢిల్లీలో చేసుకోవాల్సిన పనులు చాలావున్నాయి. ఎవరికీ మెజార్టీ రాకుండా హంగ్‌ ఏర్పడితే దగ్గరుండి ఏదో ఒక గవర్నమెంటుని ఫామ్‌ చేయాలి. ఢిల్లీలో ఏదైనా పనుంటే చెప. మనకి పిఆర్‌ ఎక్కువ. చిటికెలో పనులు జరుగుతాయి’’‘‘ప్రస్తుతానికేం పనులు లేవుకాని, నా పాతికేలు ఎపడిస్తావో చెప’’‘‘ఢిల్లీ నుంచి వచ్చాకా చెక్‌ ఇస్తాను క్యాష్‌ చేసుకో’’