హత్య జరిగిన పన్నెండు గంటల తరువాత కానీ ఆ సంగతి పోలీసులకు తెలియలేదు.కొత్తగా సర్వీసులో చేరి ఇంకా మొదటి నెల జీతం తీసుకోని ఇన్‌స్పెక్టర్‌ రాజారాం హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరాడు. అతనితో పాటు ఎస్సై ధనుష్కోటి ఉన్నాడు. రాజారాం ఇప్పుడే తన సర్వీసు మొదలు పెట్టాడు, ధనుష్కోటి మూడు పదుల సర్వీసు పూర్తిచేసి, రిటైర్మెంటుకు దగ్గరవుతున్నాడు.పోలీస్‌ జీపు పోష్‌ లొకాలిటీలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ దగ్గరకు చేరింది. జీపు దిగి చుట్టూ చూశాడు రాజారాం. కార్లలో తప్ప కాలి నడకన మనుషులు తిరగని ప్రాంతం అది.జీపు చూసి సెక్యూరిటీ గార్డు గేటు తీయ టంతో వాళ్ళు లోపలకు నడిచారు.పోలీసులను చూడగానే ఎదురొచ్చాడు ఒక బట్టతల వ్యక్తి. తెల్లటి లాల్చీ, అడ్డ చారల కాటన్‌ లుంగీ కట్టుకుని ఉన్నాడు. నుదుటి మీద పెద్ద అడ్డ బొట్టు ఒకటి పెట్టాడు. వాలకం చూస్తోంటే ఏదో పెద్ద పోస్టులో చేసి రిటైర్‌ అయినట్లున్నాడు. అతని మొహంలో ఎగ్జైట్‌మెంట్‌ కొట్టొచ్చినట్టు కని పిస్తోంది తప్ప ఏ కోశానా బాధ లేదు. ‘‘వెల్‌కమ్‌ ఇన్‌స్పెక్టర్‌...’’ అన్నాడు షేక్‌హ్యాండ్‌ కోసం చేయి ముందుకు జాస్తూ..రాజారాం షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, ‘‘మీరేనా ఫోన్‌ చేసింది?’’ అని అడిగాడు.‘‘అవును. అయామ్‌ అవధాని. రిటైర్డ్‌ తహసిల్దార్‌. యూ సీ.. సోషల్‌ రెస్పాన్సి బిలిటీ ఒకటి ఏడ్చిందిగా. ఎవడూ పట్టనట్లు కూర్చుంటే పనులెలా జరుగు తాయి. 

అదీకాక ఇక్కడి అసో సియేషన్‌ సెక్రటరీగా, వద్దన్నా విన కుండా నన్నే పెట్టారు. దాంతో ఎవ రికి తప్పినా నాకు తప్పలేదు. ఏమం టారు?..’’ అన్నాడు.అసలే రాజారాంకి జంకుగా ఉంది. అతని కెరీర్‌లో మొట్టమొదటి హత్య కేసు... ట్రైనింగ్‌లో నేర్చుకున్న పాఠాలు ఎంతవరకు పనికివస్తాయో తెలియదు. అతని తటపటా యింపు కనిపెట్టిన ఎస్సై ధనుష్కోటి, తనే లీడ్‌ తీసుకుని ‘‘శవం ఎక్కడ ఉంది?’’ అని అడిగాడు.‘‘506లో ఉంది. యూ సీ.. ఐ నో వాట్టూడూ. అందుకే పనమ్మాయి అక్కడ శవం ఉందని చెప్ప గానే 100 నెంబరుకు ఫోన్‌ చేశాను’’ ఆ ఫ్లాటుకు దారి చూపిస్తూ అన్నాడు.