తన భార్య చాందినికి కథలు కాకరకాయలు రాయడం వచ్చంటే ఆ అభిరుచికి తెగ పొంగిపోయాడు యాదగిరి. వెన్నెల్లో చెట్టాపట్టాలేసుకుతిరగడం యిష్టమంటే ఆనందించాడు. వంటింట్లోంచి కదలకుండా షడ్రుచులుచేసి పెడుతూంటే మరింత ఉబ్బిపోయాడు.మరీ అంతలా పాలునీళ్లలా కలగలసిపోయిన ఆదంపతుల మధ్య ఏంజరిగిందో ముందు ముందు మీకే తెలుస్తుంది.్‌ ్‌ ్‌మెట్టింట్లో అడుగిడిన మూడోరోజే మొదలెట్టింది చాందిని.‘‘ఏమండీ- పెళ్ళయినప్పటినుండీ మీకూ నాకూ ఇద్దరికీ తీరిక లేదాయె. మనలో ఎవరికి ఎక్కువ ప్రజెంటేషన్స్‌ వచ్చాయో చూసుకుందామా?’’ అని ఒక్కో ప్యాకెట్‌ విప్పారు.అన్నీ విప్పాక పకపక నవ్వుతూ ‘‘చూశారా, నాకే ఎక్కువగా వచ్చాయి. అంటే నాకు అంగబలం, బంధుబలగం ఎక్కువని ఒపకుంటారా?’’యాదగిరి ఉడుక్కున్నాడు.‘‘ఏమండీ! నాదో మనవి. వీటితో పాటుగా నాతో పుట్టింటినుంచి తెచ్చుకున్న ఆభరణాలు చూపిస్తానండీ..’’ అంది గోముగా.‘‘దానికంతగా చెప్పాలా చూపించు’’ అన్నాడు యాదగిరి.ఒకటొకటే బయటకు తీసింది.వడ్డాణం, రవ్వల నెక్లెసు, గుళ్లపేరు, పచ్చల పతకం, చంద్రహారం, పాపిడి పిందె.చివరగా- ‘‘ఇది కూడా చూడండి’’ కిసుక్కున నవ్వుతూ చూపించింది.‘‘ఏయ్‌! నీకూ... ఇప్పటికీ ఇంకా నీ దగ్గరుం చుకున్నావా!’’ చిలిపిగా అని నవ్వాడు.

‘‘మా తాత దీన్ని చేయించాక చనిపోయాడు. ఆయనకు నేనంటే ప్రాణంట.. అందుకనే నేను దీన్ని గుర్తుగా దాచుకున్నాను’’‘‘పోనీ....నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి... అబ్బ రెండు తులాల బరువుంటుంది... కానీ ఓ షరతు’’‘‘ఏమిటో?’’ చిత్రంగా చూసింది చాందిని.‘‘దీన్ని ఎపడూ బయటకు తీయకుండా పెట్టె అడుగున దాచెయ్యి...’’ అన్నాడు యాదగిరి.‘‘పోదురూ బడాయి...’’ అనేసి వస్తువులన్నింటినీ దంతపుపెట్టెలో పెట్టి, బీరువాలో భద్రపరిచింది.్‌ ్‌ ్‌ఒకరోజు సాయంత్రం-యాదగిరి ఇంట్లో అమ్మలక్కల హడావుడి. బండి స్టాండ్‌ వేసి లోపలికి అడుగుపెట్టాడు. ఆడవాళ్ల మధ్య నుండి పోవడానికి ఇష్టపడక పెరటిద్వారం గుండా తనగదిలోకి చేరాడు.‘‘మా బామ్మ పునిస్ర్తీగా వున్న రోజుల్లో ఈ వడ్డాణం చూడ్డానికి ఊర్లో ఆడాళ్ళు ఎగబడేవారట. ఆవిడ పోతూ నాకిమ్మని చెప్పిందట. నేనప్పటికి చంటిదాన్ని. మరి ఈ పాపిడి పిందె ఉందే... దీన్ని మా శంకరాభరణం మామయ్య చేయించి పెట్టాడు. ఇంక చివరిగా...’’ అని ఆగింది చాందిని.‘‘అవేమిటి చందూ... గుప్పెట్లో దాచావు అంత రహస్యమా’’ ఓ కీచుగొంతు ప్రశ్న.‘‘నా ప్రాణాతి ప్రాణంగా దాచుకున్న ఈ వస్తువు. మా తాతయ్య ప్రేమగా నాకు చేయించి తను పోయాడు’’ అన్నది బాధగా.‘‘అయ్యో! అలాగా... ఏదీ మీ తాతగారి ప్రియమైన కానుక...’’ వెంగమ్మగారు అడిగారు.‘‘చూడండి’’ అని గుప్పెట తెరిచింది.అంతే ఘొల్లున నవ్వులు.‘‘ఎర్రపొడి మధ్యలో ధగధగలాడుతూంది. అసలే నువ్వు ఎర్ర టి పిల్లవి... అందుకనే పొదిగి వుంటారు’’మళ్ళీ పకపకలు.ఆ దృశ్యం చూస్తుంటే యాదగిరికి ఎక్కడ్లేని మంటలు పుట్టుకొచ్చాయి.