ఎందుకని ఇలా జరుగుతోంది?ఎంత ఆలోచించినా కారణం ఏంటో అంతుబట్టలేదు‘కూరా’కి,‘కూరా’ అంటే అదతని సొంత పేరు కాదు కలంపేరు. అసలు పేరు కూర్మారావ్‌. దాన్నే అలా కుదించి ‘కూరా’ గా మార్చుకున్నాడు.ఎందుకని?ఎందుకని ఇలా జరుగుతోంది??అంతకుముందు కూడా అనేక సార్లు అతనలా వర్రీ అయ్యాడు గానీ, ఈ రోజు మాత్రం అతన్లోని ఆ వర్రీ చాలా చాలా ఎక్కువైపోయింది... తీవ్ర స్థాయిలో వెళ్లింది. కూర్చుంటే అదే ఆలోచన. నిల్చుంటే అదే ఆలోచన. పడుకుంటే అదే ఆలోచన. చివరికి చెప్పకూడదు గానీ- లావెట్రీలో కూడా అదే ఆలోచన.అందుకే ఇతను స్థిమితంగా ఉండలేకపోయాడు.దేర్‌ మస్ట్‌ బి సమ్‌థింగ్‌ రాంగ్‌!లేకపోతే ఎందుకిలా జరుగుతుంది?ఇంతకుముందు సంగతెలా ఉన్నా‘ప్రేమ విజయా’న్ని మాత్రం చాలా అద్భుతంగా రాశాడు తను.నిజంగా అది ఎంత మంచికథ!అలాంటిది కూడా తిరిగొచ్చేసిందీ అంటే- తను రాసే విధానంలో ఏదో లోపముందన్న మాట.అదేంటో ఎలా తెలుస్తుంది?షేవింగ్‌ చేసుకుంటూ అతనలా ఆలోచిస్తుండగా, అతని మనసులో సడన్‌గా షణ్ముఖ రావ్‌ మెదిలాడు.షణ్ముఖరావ్‌ చెయ్యి తిరిగిన రచయిత. అతని రచనలు దాదాపు తెలుగులో వున్న అన్ని పత్రికల్లోనూ చాలా విరివిగా పడుతుంటాయ్‌.

అతనుండేది కూడా విజయనగర్‌ కాలనీలోనే కదా!వెళ్ళి- ఓ మారు సలహ అడిగితేనో-మనకి తెలియని విషయాల్ని తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి అడిగి తెలుసుకోవడంలో తప్పేముంది? ఇందులో బిడియపడాల్సింది ఏముంది?ఈ ఉపాయం ఏదో బాగానే ఉన్నట్టనిపించడంతో షేవింగ్‌ చేసుకో వడం పూర్తవ్వగానే ‘ప్రేమ విజయం’తోపాటు ‘పాప ఫలితం’ ‘జబ్బున పడ్డ జంబులింగం’, ‘పరివర్తన’ అనే కథల్ని కూడా చేతబట్టుకుని షణ్ముఖ రావు దగ్గరికి బయల్దేరాడు కూరా.షణ్ముఖ రావ్‌ పాపం చాలా మంచివాడల్లే ఉన్నాడు. పేరున్న రచయితైనప్పటికీ కూడా తన రాకని ఏ మాత్రం విసుక్కోలేదు. కూరా చెప్పిందంతా సావధానంగా ఆలకించాడు. ‘‘అయితే మీరు మంచి రచనలు చేస్తున్నప్పటికీ తిరిగొచ్చేస్తున్నాయంటున్నారు...’’ అన్నాడు వినడం అయ్యాక.‘‘నాకైతే అలాగే అనిపిస్తోంది సార్‌! నే వ్రాసిన కథల్లో నాకు చాలా బాగా నచ్చిన వాటిని తెచ్చాను. అమూల్యమైన మీ సమయాన్ని వేస్ట్‌ చేస్తున్నాననుకోకపోతే- దయచేసి వీటిని చదివి, లోపాలేంటో తెలియజేస్తే, నేను చాలా సంతోషిస్తాను’’ అంటూ వెంట తెచ్చుకున్న రెగ్జిన్‌ బ్యాగ్‌ లోంచి కథల్ని బయటకు తీశాడు కూరా.‘‘చాలా థ్యాంక్స్‌ సార్‌..మీకు శ్రమ కలిగిస్తున్నందుకు నన్ను మన్నించాలి’’ అంటూ కూరా వినయంగా నమస్కరించి, అతని వద్ద నుంచి సెలవు తీసుకుని వచ్చేశాడు.నిగర్వి- పేరున్న రచయితయ్యుండి కూడా ఎంత ఇదిగా మాట్లాడాడు! అనుకున్నాడు మనసులో కూరా!్‌్‌్‌ఎపడెపడు తెల్లవారుతుందా? అని ఆ రోజంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూసి- మర్నాడు మళ్లీ అదే సమయానికి షణ్ముఖరావ్‌ వద్దకు ఠంచనుగా చేరుకున్నాడు కూరా. పలకరింపులు అవీ అయ్యాక అసలు విషయంలోకి వచ్చాడు షణ్ముఖరావ్‌.