’’లక్ష్మీ జాగ్రత్త - ఇదిగో ఇక్కడ ముళ్ళపొద వుంది. చూసి కాలు పెట్టు -’’‘‘అలాగే - మీరూ జాగ్రత్త. గట్టిగా కాలు పెట్టండి. అంతా జారుడుగా వుంది’’‘‘నాకేం ఫరవాలేదు. ఇదిగో ఇక్కడ ఈ పెద్ద బండరాయి ఎక్కాలి. నా చెయ్యి పట్టుకో, జాగ్రత్త సుమా - నీ భుజంపై బరువు నాకివ్వు. ఇవ్వు మరి’’.‘‘వద్దండీ మీరు కూడా బరువు మోస్తున్నారు కదా!’’‘‘సరే అయితే - నా చెయ్యి అందుకో. గట్టిగా కాలు మోపు. లేకుంటే పట్టుండదు’’.‘‘అమ్మయ్య ఈ గుండు ఎక్కేశాము. ఎంతదాకా వచ్చామండీ?’’‘‘చాలా తక్కువ దూరమే సుమా! చూడు అటు - ఆ శిఖరాలు ఎంత ఎత్తుగా వున్నాయో! అంత దూరం నడవాలి మరి!’’‘‘అమ్మో ఇపడే చాలా ఆయాసంగా వుందండి’’.‘‘ఫరవాలేదు లకీ్క్ష మెల్లగా నడుద్దాం. నా మాట విని నీ భుజంపై బరువు కూడా నాకివ్వు’’.‘వద్దండీ నేను మీ చెయ్యి ఆసరాతో నడుస్తాలెండి’’.అట్లా అధిరోహిస్తూనే వున్నారు లకీ్క్షమాధవులు. ఇద్దరికీ బాగా ఆయాసంగా వుంది. కాళ్ళు పీకుతున్నాయి. బరువుకు భుజాలు లాగుతున్నాయి. మాటిమాటికి శిఖరంవైపు చూస్తున్నారు.‘‘అమ్మయ్య. సగం ఎక్కేశామండీ’’ కాస్త నిలిచి ఊపిరి పీల్చుకుంది లకి్క్ష.‘‘అవును సుమా. మిగతా ఈ సగం ఎక్కడమే చాలా కష్టం’’.‘‘కాస్త రెస్ట్‌ తీసుకొని ఎక్కుదామండి’’.‘‘వెనకబడిపోతాం లకీ్క్ష నడుద్దాం పద’’.‘‘సరే. పదండి’’. చాలా స్టీప్‌గా వుంది. 

కళ్ళు తిరుగుతున్నాయి లకి్క్షకి.‘‘మాధవ్‌ ఇక నేను నడవలేను’’.‘‘తప్పదు లకీ్క్ష! నడవాలి. దగ్గరకు వచ్చేశాం. మూడువంతులు వచ్చేశాం. ఒక పావు భాగం మాత్రం మిగిలింది లకి్క్ష. కొంచెం ఓపిక తెచ్చుకో. పద నా చెయ్యి వదలొద్దు’’.‘‘మాధవ్‌’’ గట్టిగా కేక పెట్టింది లకి్క్ష శిఖరంవేపే చూస్తూ నడుస్తున్న మాధవ్‌ను చూసి. ‘‘మీముందు ఎంత గ్యాప్‌ వుందో చూసుకోండి. పడిపోతే ఇక అగాధంలోకే!‘‘ఔను లకీ్క్ష! నేను గమనించలేదు. ఉండు మెల్లగా నేను ముందు దాటుతాను.’’‘‘జాగ్రత్త మాధవ్‌’’‘‘ఇదిగో నా చెయ్యి అందుకో. మెల్లగా దాటు లకీ్క్ష. భయపడవద్దు. అమ్మయ్య - దాటేశావా?’’ఒకరి గుండె చపడు మరొకరికి వినిపిస్తూంది.‘‘ఇదిగో శిఖరాగ్రం! ఎక్కేశాం! సంతోషంగా నవ్వింది లకి్క్ష.‘‘హుర్రే!! లకీ్క్ష చేరేశాం గమ్యం!!’’బరువుల్ని దింపేశారిద్దరూ. ఆనందజోల - నవ్వుల హేల!సంతోష సంద్రంలో ఓలలాడారిద్దరూ. చుట్టూ పరికించి చూసింది లకి్క్ష.‘‘మాధవ్‌ పిల్లలేరీ? కనిపించ రేం?’’ కంగారుగా అడిగింది లకి్క్ష.‘‘అవును లకీ్క్ష! నేను గమనించలేదు. ఆ అదిగో అటు చూడు. రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతున్నారు’’.‘‘మనల్ని ఇక్కడే వదిలేశా మాధవ్‌?!’’ ఏడుస్తూంది లకి్క్ష.‘‘ఔను లకీ్క్ష - బాధపడకు. లోకంలో అది సహజం.’’‘‘మాధవ్‌!’’ గట్టిగా కేకపెట్టింది లకి్క్ష. ‘‘మనం శిఖరాగ్రాన లేము. ఇదేమిటి - మామూలు నేలపై. మాధవ్‌ - మాధవ్‌’’ - మనసంతా నిరాశ, నిస్పృహ, దుఃఖం ఆవరించగా గట్టిగా పిలుస్తోంది లకి్క్ష. అంతలో మెలకువ వచ్చింది లకి్క్షకి.