‘‘నువ్వు బాధపడకు అరూ! నిన్ను కట్టుకోనందుకు వాడు ఏడవాలి. నీ లాంటి గుణవంతురాలిని వదులుకోవడం వాడి దురదృష్టం’’ అరుంధతిని ఓదార్చాను.అరు మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తోంది.‘‘శరత్‌ ఎందుకు యిలా చేశాడు! ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానన్న నన్ను కాదని ఎందుకు వెళ్లిపోయాడు!’’అరు ప్రశ్నలకు ఎవరివద్దా ప్రస్తుతం సమాధానాలు లేవు.ఎప్పటికైనా శరత్‌ కనపడితే నిలదీసి అడగాలని, కాలర్‌పట్టుకుని బుద్ధి చెప్పాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.ఎవరు ఎంతగా చెప్పినా అరు మనసు ఇపడపడే కుదుటపడేలా లేదు. తెలిసిన వారు ఒక్కొక్కరు వచ్చి పలకరించి వెళుతున్నారు. పెద్ద వయస్సువారైతే దెప్పిపొడుపులతో యీసడించుకొంటున్నారు.‘‘ఆడపిల్లలను హద్దులలో వుంచాలమ్మా’’ అని ఒకరంటే..‘‘మన యిళ్లల్లో ఎవరూ చేయని పని నీ కూతురు చేసింది’’ మరొకరు వకాల్తా పలికారు.‘‘అయినా కులం, గోత్రం తెలుసుకోకుండా ముక్కుమొహం తెలియని కుర్రాణ్ణి యింటి అల్లుడుగా చేసుకుందామని తయార య్యారు. అసలు ముందు మిమ్మల్ని అనాలి’’ అంటూ అరూ తల్లితండ్రుల్ని మరింత ఆడిపోసుకుంది పక్కింటి మీనాక్షమ్మగారు.‘‘ముందు ఆ శరత్‌ కంటే కూడ వీరి దెప్పిపొడుపు మాటలు వారిని ఎక్కువగా కృంగదీస్తున్నాయి’’ అనుకుంటూ‘‘కష్టాల్లో వున్న వారికి ఓదార్పు మాటలు కావాలి కాని, ఇలా నిష్ఠూరంగా మాట్లాడ్డం తప్పండి’’ కోపంగా పైకి అనేశాను.

‘‘ఇలాంటి వారి జట్టుపట్టే పిల్లలు యిలా తగలడ్తున్నారు’’ వారి లోంచి ఒకామె మూతి తిపకుంటూ అంది.నా గుండెల్లో ముల్లు గుచ్చుకొన్నట్లయింది. అయినా వీరికేమి తెలుసు! మా స్నేహం గురించి పుండుమీద కారం చల్లడం తప్ప! అనుకుంటూ ఇంటికి బయల్దేరాను.ఆలోచనలు ఒక్కసారి నన్ను చుట్టుముట్టాయి.రఘురాంతో నా వివాహం అయి అయిదు సంవత్సరాలయింది. పెళ్ళయిన వెంటనే హైదరాబాదులో మకాం పెట్టాం. అరుంధతి వాళ్ళు మా ఎదురింట్లోనే వుంటున్నారు. అరు చాల వుషారైన అమ్మాయి. క్రొత్తలోనే అక్కా అంటూ పిలుస్తూ నాకు చాల దగ్గరయింది. మా యిద్దరి బంధం రోజురోజుకూ బలపడసాగింది. అన్ని విషయాలు నాతో హుషారుగా చెప్పేసేది. నా దగ్గర ఏ విషయం దాచేదికాదు. ఒక రోజు తను శరత్‌ను ఏ రకంగా ప్రేమించిందో చెప్పింది. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌! మీ పెళ్ళెపడు అని అడిగినపడల్లా మొగ్గలా ముడుచు కుపోయేది. అపడు మరి అందంగా కనిపించేది నాకు అరూ! ‘‘మీ ప్రేమ సంగతి యింటిలో చెప్పేయ్‌! ఇంకెందుకు ఆలస్యం’’ ఎక్కువ రోజులు దాచడం మంచిది కాద ని సలహా యిచ్చాను.