శివలింగం మీంచి జారుతున్న అభిషేక క్షీరంలా, నునుపుగా వున్న నల్లటి కొండమీంచీ దూకుతున్నాయి, ఆవేశంగా శబ్దం చేస్తూ - నీళ్ళు ... సహజసిద్ధమైన తలకోన జల పాతం! దూకుతూ రూపొందించుకున్న కొలనులో కాస్సేపు ఆగి, ప్రవహించుకు పోతున్నాయి.. ఎక్కడికో!ఆకాశం మీదికి ఎగబాకిన సూర్యుడు తలకోనలోని కొలనులోకి తొంగిచూస్తూ, తామరల్ని మేలుకొలుపు తున్నాడు; కిరణాల వేళ్ళతో వాటి బుగ్గలు నిమురుతూ...విచ్చుకుని, సూర్యుణ్ని చూసి నవ్వుతున్న తామరల మధ్య ఉన్నట్టుండి ఒక సజీవ కమలం ప్రత్యక్షమైంది. అది కమలం కాదు; అందాల నటి తూలిక ముఖం...ఆంధ్రా కౌబాయ్‌ సినిమా షూటింగ్‌లో, తలకోనలో వున్న తూలిక మూడోకంటికి తెలీకుండా, తెల్లారేసరికి - తలకోన జలపాతంలో స్విమ్మింగ్‌ చేస్తోంది! హిందీ నటి కరీనాను అనుకరిస్తూ, బికినీ వేసుకుని, ఆ ఏకాంత ప్రదేశంలో గోల్డ్‌ఫిష్‌లా ఈదులాడుతోంది తూలిక.తూలిక ఉల్లాసంగా నీటిమీద వెల్లకిలా తిరిగింది. తూలిక శరీరం బంగారు తీగలాగా వెనక్కి జారుతోంది. వయ్యారంగా తామర పువ్వులా మెరుస్తున్న ఆమె ముఖాన్ని జంట తామరమొగ్గలు నీటిలోంచీ, నిక్కిచూస్తూ వెంటాడుతున్నాయి... తనను ఎవ్వరూ చూడ్డం లేదన్న ధైర్యం తూలిక చేత విచ్చలవిడిగా జలవిహారం చేయిస్తోంది.తనను ఎవ్వరూ చూడ్డం లేదన్న తూలిక నమ్మకాన్ని ఎగతాళి చేస్తూ చెట్ల చాటులోంచీ రెండు కళ్ళు రహస్యంగా చూస్తున్నాయి. 

ఆ కళ్ళు కెమెరామన్‌ ‘కెమెరా కిరణ్‌’ కళ్ళు....కెమెరా కిరణ్‌ చేతుల్లోని ఇటాచీ కామ్‌కార్డర్‌. అలల మీద ఆరబోసిన తూలిక అందాల్ని లాగి, తనలో దాచుకుంటోంది; ముందు ముందు ‘కనువిందు’ చేయడానికి! వర్ధమాన నటి తూలిక వొంపుసొంపులు కెమెరా కిరణ్‌ శరీరాన్ని జలదరింప చేస్తున్నాయి. స్విమ్‌ సూట్‌లో ఇమడకుండా పొగురుగా బైటపడుతున్న తూలిక సౌందర్యం కిరణ్‌ రెప్పల్ని లాగి పట్టింది...కిరణ్‌ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. పనిచేసే ప్రతీ సినిమాలోంచీ ఇలాంటి దృశ్యాల్ని బావ జగన్‌కి ప్రెజెంట్‌ చేయడం కిరణ్‌ అలవాటు! ఈసారి తను బహూకరించే తూలిక వీడియోతో జగన్‌ తూలిపడిపోవడం ఖాయం! చెల్లెలు మల్లికను పళ్ళెంలో పెట్టి తనకు ఇవ్వడం ఖాయం! తూలిక ఇంకా జలకాలాటలోనే వుంది! తడి బికినీ విప్పేసి, పొడిబట్టలు కట్టుకునే గిలిగింతల సన్నివేశం కోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్న కిరణ్‌ - కళ్ళకు సంతర్పణ చేస్తున్న తూలిక తడి ఆరని అందాల్ని చూస్తూ సర్వాన్నీ మరిచిపోయాడు... తామరాకు మీద కూచుని, తన వైపే చూస్తున్న చిన్నారి కప్పపిల్లను చూస్తూ చిరునవ్వు నవ్వుతున్న తూలిక ముఖం నీటి బిందువులతో మెరు స్తోంది. తాను సినిమాల కోసం షూట్‌చేసే ‘యాక్టింగ్‌ స్నానఘట్టాలు’ వేరు! ఇలాంటి నేచురల్‌ జలక్రీడలు వేరు! అడ్డూ, ఆపూ లేని జలక్రీడలవి...