ఇంకా బాగా తెల్లారలేదు. చీకటి చీకటిగా వుంది. ఆ సమయాన పచ్చటి పట్టుచీర, ఒంటినిండా నగలు, నీళ్ళు కారుతున్న జుట్టుతో గబగబా పెరట్లోని బాత్రూము దగ్గరకెళ్ళి తలుపుకొట్టింది వీరమ్మ.‘‘అమ్మగారు! స్నానం అయిపోతే వచ్చేయండి. అంతా మీ రాకకోసం ఎదురు చూస్తున్నారు’’ఒక్క సెకండు తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అమ్మగారు బయటికొచ్చి, ఎడంవైపుకి చూశారు.చెట్లకి నీళ్ళు పెడ్తున్న వెంకటేసు, అదే సమయానికి చూసాడు.వీరమ్మ విసుగ్గా వెంకటేసు వైపు చూసి ‘నీ పని చేసుకో’ అన్నట్లు చెయ్యి ఊపి నడిచింది యింటివైపు.అమ్మగారు వనంగా వీరమ్మ వెనకాలే వెళ్లారు.అమ్మగారికి ఎర్రటి పట్టుచీర, నగలు వడ్డాణం అదీ పెట్టి అలంకరించింది. పిలుపు వచ్చాకా అమ్మగారు భక్తులంతా వున్న హాల్లోకి వెళ్లి ఆసీనులవుతారు. అదీ రోజూ జరిగేదే.ఆ పక్కగానే వున్న హాలు పెద్ద లైట్లతో పట్టపగలులా వుంది.భజనలు అవుతున్నాయి. గంటలు మోగుతున్నాయి.వీరయ్య, తన ఎర్ర బరంపురం పంచని, పైన వున్న పట్టు వస్ర్తాన్ని సవరించుకుంటూ చేతిలో వున్న పూల సంచిని, ఓ పక్కగా వున్న ముత్తయిదువులకిచ్చి దండలు చెయ్యమని సైగచేశాడు.

ఆ హాల్లో ఓ వైపున తెర వుంది. అది సంత్రా రంగులో వున్న సిల్కు బట్టతో కుట్టినది.ఆ తెర లాగారు.వెండికాళ్ళున్న పీఠం మీద కూచున్న అమ్మగారు అందరికీ దర్శనమిచ్చారు.భజన జోరు హెచ్చింది.‘‘అయ్యగారు’’ అన్నాడు వీరయ్య.వివిధ ఆకారాల్లో వున్న హారతి పళ్ళాల్ని నేత వత్తుల్తో అలంకరిస్తున్నాడు. చేస్తున్న పని ఆపి వీరయ్యవైపు చూశాడు ఆ అయ్యగారు.‘‘ ఈరోజు శుక్రవారం. భక్తులు ఎక్కువమంది వస్తారు. దర్శనం మొదలెట్టాకా మనిషికి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ యివ్వద్దు’’‘‘అలాగేనండి’’ అన్నాడు.

వీరయ్య పిలిచిన అయ్యగారు, నిజానికి వీరయ్య కొడుకు. పూర్వనామం భిక్షపతి.ఓ నల్లప్యాంటు, ఓ ఎర్ర టీషర్టు, లేకపోతే అడ్డచారల టీషర్టుతో సంజయ్‌దత్‌ లాంటి జులపాల జుట్టుని నీళ్ళు వేసి దువ్వి యింటినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న ఆడపిల్లల స్కూలు దగ్గర కాసేవాడు.అది ఒకపడు.ఇపడు- కార్డంచు జరీ పంచ, పిలక, నుదుట వీబూతి... గంభీరంగా తనపని చేసుకుపోతున్నాడు. కారణం కొత్త అవతారం.