సౌండ్‌ హఠాత్తుగా పెరిగింది.. సన్నటివెలుతురులో నున్నటి శరీరాలుమెరుస్తున్నాయి..ఆడుతున్నాయి..‘‘షౌండ్‌ తగ్గించమను.. ఒక్క మాట కూడా వినబడటం లేదు’’ అన్నాడు ఆదిత్య.‘‘ మనం పబ్‌కి వచ్చింది ఈ మాత్రం సౌండ్‌లో ట్యూన్‌ వినడానికి.. డ్యాన్స్‌చేయటానికి.. యోగా చేయటానికైతే పార్క్‌కి వెళ్తే సరిపోయేది కదా! ’’ అనికిసుక్కున నవ్వాడు శర్మ.మాధవ మాత్రం ఏం మాట్లాడకుండా డ్యాన్స్‌ చేస్తున్న వాళ్లనే చూస్తున్నాడు. ఆదిత్య, మాధవ, శర్మ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. కంపెనీలో ఒకే సారి చేరారు. ఒకేసారి ముగ్గురికి ప్రమోషన్లు వచ్చాయి. ముగ్గురు ఒకే ప్రాజెక్టు కోసం అమెరికాకి వెళ్లి వచ్చారు. ముగ్గురు ఒకే ఫ్లాట్‌ తీసుకొని ఉంటున్నారు. అలాంటిది శర్మ, మాధవ్‌లను బెంగుళూరుకు ఒక ప్రాజెక్టు కోసం పంపాలని మేనేజిమెంట్‌ నిర్ణయించింది. ఆదిత్యను మాత్రం హైదరాబాద్‌లోనే కొద్ది కాలం ఉంచుతామని ప్రాజెక్టు మేనేజర్‌ చెప్పాడు. ఆదిత్య తను కూడా బెంగుళూరు వెళ్తానని గట్టిగా పోట్లాడాడు. మేనేజర్‌ మాత్రం ససేమిరా అన్నాడు. మర్నాడే ఇద్దరి ప్రయాణం. ముందు రోజు ఎంజాయ్‌ చేయాలని పబ్‌కి వచ్చారు.‘‘బాస్‌! మీ ఇద్దరిని మిస్‌ అయిపోతా!’’ అన్నాడు ఆదిత్య.‘‘అబద్ధం.. అంతా అబద్ధం.. మేము లేకపోతే నువ్వు రాగిణితో సెటిలయిపోదామనుకుంటున్నావు’’ అన్నాడు శర్మ కొద్దిగా గట్టిగా. ఖాళీ గ్లాసు గట్టిగా టేబుల్‌ మీద కొట్టాడు. అప్పటికి అతనికి అది ఐదో రౌండ్‌.. ‘‘ప్రామిస్‌..రాగిణి మీ చెల్లి లాంటిది..అస్సలు మీ గురించి ఏం చెప్పను’’ అన్నాడు ఆదిత్య.

‘‘చూసావా! తాగితే అందరూ నిజం చెబుతారు.. ఈ వేస్ట్‌ఫెలో మాత్రం రాగిణిని మన చెల్లి అంటున్నాడు’’ అంటూ వెనక్కి తిరిగాడు మాధవ. తిరిగిన వాడు తిరిగినట్లే ఉండిపోయాడు. ఏ సౌండ్‌ రాకపోయేసరికి మాధవ కేసి తిరిగారు శర్మ, ఆదిత్య.‘‘వావ్‌! ఏం ఫిగర్‌.. చేస్తే ఆ ఫిగర్‌తోనే డ్యాన్స్‌ చేయాలి..’’ అన్నాడు మాధవ- దూరంగా ఓ అమ్మాయిని చూస్తూ. శర్మ, ఆదిత్యల్లో ఉత్సాహం పెరిగింది.‘‘ఏ ఫిగర్‌ గురూ’’ అడిగాడు ఆదిత్య.‘‘ఎంతైనా హైదరాబాద్‌ అమ్మాయిలు కత్తి గురూ.. పెళ్లి చేసుకుంటే ఇక్కడ వాళ్లనే చేసుకోవాలి’’ అన్నాడు శర్మ. ఇంతలో బీటు మారింది. డ్యాన్స్‌ స్టైల్‌ మారింది. మాధవ దృష్టి డ్యాన్స్‌ ఫ్లోర్‌ను వదలటం లేదు.‘‘ఎవరు గురు.. అంత గొప్ప ఫిగర్‌.. నాకు చూపించు.. మాట్లాడేస్తా’’ అన్నాడు శర్మ. కుర్చీలో నుంచి లేవబోయాడు. మళ్లీ కూర్చుండిపోయాడు.‘‘ సస్పెన్స్‌.. నా డ్రీమ్‌ గర్ల్‌..నా కళ్ల ముందు డ్యాన్స్‌ చేస్తోంది. ఆ అమ్మాయే నాకు కావాలి..ఇంకెవ్వరూ వద్దు..’’ అన్నాడు మాధవ.ఆదిత్య ఏం మాట్లాడ లేదు. అతని కళ్లు మాత్రం మాధవ చెప్పిన ఫిగర్‌ కోసం వెతుకుతున్నాయి. మాధవది అమ్మాయిల విషయంలో చాలా మంచి టేస్ట్‌. ఆ సంగతి శర్మ, ఆదిత్యలకు తెలుసు. మాధవ అంత మనసు పడుతున్నాడంటే ఆ అమ్మాయి చాలా అందగత్తె అయి ఉండాలి. శర్మ కుర్చిని ముందుకు లాగాడు. మాధవ దగ్గరగా వేసుకున్నాడు.