‘‘ఆమధ్య మా అమ్నా నాన్న వచ్చారు. రెండుమూడు రోజుల్లో ఇద్దరమ్మాయిలతో పెళ్ళి చూపులరేంజి చేశారు. ఇద్దరికిద్దరూ బావున్నారు. ఇద్దరితోటీ మాట్లాడాను. కాని, ఎవర్ని చేసుకోవాలో నాకు తెలియటం లేదురా! నువ్వు చూసి నీ అభిప్రాయం చెప’’ అన్నాడు రఘురామ్‌ రైలు దిగి వచ్చిన స్నేహితుడు మోహన్‌తో.‘‘వాళ్ళని చూసేముందు వాళ్ళ వివరాలు తెలిస్తే మంచిది.’’‘‘సునందది కళ్లు మిరుమిట్లు గొలిపే అందం. జోవియల్‌గా మాట్లాడుతుంది. ఎయిర్‌టెల్‌లో ఎగ్జిక్యూటివ్‌. మంచి రిసోర్స్‌ఫుల్‌ పెర్సన్‌. రెండో అమ్మాయి అపర్ణ. సునందలా స్టన్నింగ్‌ బ్యూటీ కాదు. కాని, చక్కగా పోతపోసిన శిల్పంలా వుంటుంది. మితభాషి. కంప్యూటర్స్‌ చేసింది. నిట్‌లో ఫేకల్టీ ఉద్యోగం.‘‘వాళ్ళతో మాట్లాడానన్నావు. దాన్నిబట్టి నీకు తెల్సిందేమిటి?’’‘‘సునందని సినిమా హాల్లో ఓసారి, షాపింగ్‌ సెంటర్లో ఓసారి చూశాను. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కనిపించింది. ఇదివరకే వాళ్ళకి చెప్పినట్టుంది. వాళ్ళకి పరిచయం చేసింది. మర్యాదకని మా యింటికి రమ్మన్నాను. నిజంగానే వాళ్ళ ఫ్రెండునోదాన్ని తీసుకుని హఠాత్తుగా ఓసండేనాడు వచ్చేసింది. నేను లుంగీ బనీనులో వున్నా. సిగ్గుపడి చచ్చిపోయాననుకో!’’‘‘తప్పేముంది? హఠాత్తుగా అమ్మాయిలు తలుపుతడతారేమోనని మనం టీవీ సీరియల్స్‌లోలా ఎపడూ సూటూబూటూ వేసుకుని వుండలేం కదా! సరే, ఏమయింది?’’

‘‘గబగబా బట్టలు మార్చుకుని ఆ కబురూ యీ కబురూ అయ్యాక కాఫీ కలిపి తెచ్చాను. సునంద డేమ్‌ ప్లీజయిపోయింది. వెడుతూ వెడుతూ వాళ్ళింటికి ఎపడొస్తానా అని అడిగింది. మేగ్నిటిక్‌ పర్సనాలిటీ అనుకో!’’‘‘అంటే, నువ్వు పెళ్ళికొపకున్నావని అనుకుంటోందన్నమాట!’’‘‘అవును. నాకలాగే అనిపిస్తోంది.’’‘‘మరి అపర్ణ?’’‘‘మా మామయ్యగారి ఫ్యామిలీ వస్తే వాళ్ళని మ్యూజియంకి తీసుకువెళ్ళా. అక్కడికి వాళ్ళక్కయ్యగారి పిల్లల్ని తీసుకుని వచ్చింది. పిల్లలు ఎగ్జిబిట్స్‌ చూస్తుంటే మేమవీయివీ మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌ మా యింటికి దగ్గరగానే ఉందిట. మర్యాదకి ఎపడేనా రమ్మన్నాను. ఓ సాటర్‌డే నాడు తన కొలీగ్‌ వాళ్ళమ్మాయి బర్త్‌డే పార్టీ అంటే వచ్చిందట! మా వీధిలో కనిపించింది. ఇన్వయిట్‌ చేశాను. ఇల్లంతా చూపిస్తే నా టేస్టుని మెచ్చుకుంది. కాఫీ కలిపి తెస్తానంటే తనూ వంటింట్లోకి వచ్చింది. వద్దువద్దంటున్నా తనే కలిపింది. మా యింటికి వచ్చి మీరు కలపటమేమిటన్నాను. ఆవేళ పెళ్ళి చూపుల్లో తాను తెచ్చిన కాఫీ తను కలిపింది కాదుట... అందుకని... అని నవ్వింది. ఇన్ర్కెడిబుల్‌ ఉమన్‌!’’