జస్వంత్‌ స్వరూప్‌ గదిలోకి ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అతను ఆజానుబాహుడు. జస్వంత్‌ సూటు, బూటులో తన హోదాకు తగ్గట్లు ఎప్పటిలా హుందాగా ఉన్నాడు. అతను మల్టీమిలియన్‌ ‘శాంతి స్వరూప్‌ రబ్బర్‌ కంపెనీ’కి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌. స్వరూప్‌ అర్జెంటుగా రమ్మని కబురుపెడితే వెళ్ళాడు.జస్వంత్‌ గదిలోకి ప్రవేశించగానే స్వరూప్‌ ఏదో పత్రిక తిరగేస్తూ కనబడ్డాడు. స్వరూప్‌ తెల్లటి ఖద్దర్‌ దుస్తుల్లో నిరాడంబరంగా ఉన్నాడు. జస్వంత్‌ ఆ బట్టల్లో తప్పితే మరే దుస్తుల్లోనూ స్వరూప్‌ని చూసినట్లు జ్ఞాపకం లేదు.జస్వంత్‌ స్వరూప్‌ ముందు నిలబడి విష్‌ చేశాడు. స్వరూప్‌ జస్వంత్‌ని కూర్చోమన్నట్లు చేత్తో సంజ్ఞచేస్తూ అన్నాడు. ‘‘మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుదామని రమ్మన్నాను!’’జస్వంత్‌ ఆ విషయమేమిటో చెప్పమన్నట్లు తలాడించాడు.‘‘నా వయస్సు పైబడుతోంది. మీకు తెలుసుకదా నాకు వారసులంటూ ఎవరూ లేరు. నా చేతుల్తో ఈ కంపెనీకి జీవంపోసి ఇంతదాన్ని చేశాను. ఈ కంపెనీ కోసం నా శాయశక్తులూ ధారపోశాను. ఇకపై ఈ కంపెనీని ఒక నమ్మకస్తుని చేతిలో పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరేమంటారు?’’స్వరూప్‌ రిటైర్‌ అవ్వాలనుకుంటున్నారని కంపెనీలో చాలారోజుల నుంచి చెపకుంటున్నారు. అతను పెళ్ళి చేసుకోకపోవడంతో వారసులెవ్వరూ లేరు. కనుక స్వరూప్‌ కంపెనీ యాజమాన్యం జస్వంత్‌ చేతిలోకి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. స్వరూప్‌ రిటైర్‌మెంట్‌ గూర్చి ఎపడూ మాట్లాడకపోవడంతో జస్వంత్‌ అది పుకారు అనుకున్నాడు. రిటైర్‌మెంట్‌ పుకారు కాదు నిజమేనని ఇపడు తెలిసింది.

‘‘ప్రస్తుతం మీకు విశ్రాంతి చాలా అవసరం’’ క్లుప్తంగా అన్నాడు జస్వంత్‌.‘‘ఈ కంపెనీని మన హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌ ప్రేమ్‌జిత్‌ చేతుల్లో పెట్టాలనుకుంటున్నాను!’’జస్వంత్‌పై పిడుగు పడినట్లయింది. అతని చేతుల్లోకి వస్తుందనుకున్న కంపెనీ మరెవరి వశమో అవుతోంది! జస్వంత్‌ వనంగా ఉండడంతో స్వరూప్‌ అన్నాడు - ‘‘మీరు ఈ కంపెనీలో ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారు. కాబట్టి నేనో నిర్ణయం తీసుకునే ముందు మీ అభిప్రాయమేమిటో తెలుసుకోవడం సమంజసం! చెప్పండి... ప్రేమ్‌జిత్‌కి ఈ కంపెనీ బరువు బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను. మీకు ఇష్టమేనా?’’జస్వంత్‌ షాక్‌లో ఉన్నాడు. తార్కికంగా ఆలోచించే స్థితిలో లేడు. ‘‘ప్రేమ్‌జిత్‌... చాలా మంచి కుర్రాడు. ప్రేమ్‌జిత్‌... యంగ్‌, డైనమిక్‌, ఇంటలిజెంట్‌, బ్రేవ్‌! చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని అతని చేతుల్లో పెట్టడమే అన్నివిధాలా శ్రేయస్కరం.’’్‌్‌్‌జస్వంత్‌ చెస్‌ బోర్డుపై పావును కదుపుతూ ‘‘ఇన్ని సంవత్సరాలు ఆ కంపెనీలో గాడిదలా చాకిరీ చేస్తే ఇపడు జరిగినదేమిటి? నాకు మిగిలినదేమిటి? ఎవరో ప్రేమ్‌జిత్‌ నిన్నకాక మొన్న వచ్చి గద్దలా కంపెనీని తన్నుకుపోతున్నాడు!’’ అన్నాడు.జస్వంత్‌ స్నేహితుడు ఉపేంద్ర ఆట ఎలా ఆడాలో ఆలోచిస్తూ ‘‘నువ్వేదో నిజాయితీపరుడిలా మాట్లాడుతున్నావ్‌! స్వరూ ప్‌కి తెలియకుండా నువ్వు ఎన్ని లక్షలు దోచుకోలేదు!’’ అన్నాడు.