మదాలస పెళ్లయి రెండురోజులే అయింది.పెళ్లికొడుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సెలవు ఇక వారం రోజులే వుంది. అందువల్ల ఎక్కడికీ హనీమూన్‌ ట్రిప్‌ వేసుకోలేదు. అసలు ఆ జంట, హైదారాబాద్‌ సరిహద్దులు దాటిఎక్కడికీ వెళ్లద లుచుకోలేదు. వారం రోజుల్లో తిరిగిఅమెరికా వెళ్లిపోవాలంటే రాకేష్‌కి చాలా బాధగా వుంది. అతడి బాధనిగ్రహించిందో ఏమో ‘‘ఇప్పటినుంచేబెంగ పెట్టుకుంటే ఎలాగండీ’’ కాస్త సిగ్గుపడుతూనే చెప్పింది మదాలస.‘‘నీకేం...నువ్వు ఎన్నయినా చెబుతావు, వారం రోజుల్లో అమెరికా వెళ్లిపోవాలనే ఆలోచన వస్తేచాలు నాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు’’ అన్నాడు రాకేష్‌.ఆ క్షణంలో అతడి ముఖం చూసి నవ్వాపుకోడానికి విశ్వప్రయత్నం చేసి, అది సాధ్యం కాక పకపకా నవ్వింది మదాలస.ఆమెని ఏమీ అనలేక అతడు మౌనం వహిం చాడు. నవ్వినందుకు వెంటనే సారీ చెప్పిందామె.‘‘సరే సరే...క్షమించేశానుగానీ, నాదొక విన్నపం’’ అన్నాడు రాకేష్‌ నాటకీయంగా. అదేమిటన్నట్టుగా మదాలస కళ్లతోనే ప్రశ్నించింది.‘‘ఈ వారం రోజులూ గంగాళమన్ని అను భవాలు, గంపెడు అనుభూతులు, గుప్పెడు జ్ఞాపకాలు గుండెల నిండా నింపుకునేలా నాకు సహకరించు’’ అన్నాడు. నవ్వబోయి, సిగ్గుపడి తలదించుకుంది. ఆమె చుబుకాన్ని మునివేళ్లతో సుతారంగా పైకాత్తాడు. 

సరేనా అన్నట్టుగా ఆమె కళ్లల్లో కళ్లుపెట్టి చూశాడు.లేడి కళ్లలాంటి పెద్ద పెద్ద కళ్లేమో, తదేకంగా చూసి, అరమోడ్పు కళ్లతో అంగీకారసూచకంగా తల వూపింది మదాలస.కౌగిలిలో బంధించాలనే తహతహతో, వెంటనే ఆమె అరచెయ్యి పట్టుకుని తనవైపు లాక్కోబోయాడు.అది గ్రహించి, చెయ్యి వదిలించుకుని మెరు పులా అక్కడి నుంచి పారిపోయింది మదాలస.బయట తలుపు గడియపెట్టి, కిటికీలోంచి చూసి వెక్కిరించింది.‘‘ఇదేంటిది! ఇప్పటి వరకూ నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి?’’ అన్నాడు రాకేష్‌ ఉక్రోషంగా.‘‘మీరు కోరిన గంగాళంలో ఇది ఒక చిన్న అనుభవం. మధురమైన అనుభూతి. మీ గుప్పెడు జ్ఞాపకాల్లో ఇది చేరింది. అమెరికా వెళ్లాక, గుండెల్లోంచి వెలికితీసి మురిసిపోండి!’’ అంటూ కిలకిలా నవ్వి, కిటికీ మూసేసింది.్‌్‌్‌ఊహల పల్లకిలో ఊరేగించి, వెన్నెల పక్కేసి, వెండిమ బ్బుల్లో మంచు ముత్యాల జల్లుల్లో మల్లెపూల గుబా ళింపుతో ఇరు శరీరాలను ఏకం చేసి, కోటి ఆశలనూ శతకోటి కోర్కెలనూ తీర్చే మధురాను భూతుల శుభరాత్రి, అది తొలిరాత్రి.‘తొలిరాత్రి’ మాట విన్నప్పుడల్లా మదాలస మనసంతా మధురోహలతో నిండిపోతుంది. ఆ మధురానుభవం తాలూకు అనుభూతి పరిమాళాలను ప్రోగుచేసుకుని పదిలపరుచుకోవాలని మనసు తహతహలాడుతుంది.అందరు ఆడపిల్లల్లాగే ఆమెకూ వివాహ జీవితం మీద అందమైన ఆశలు న్నాయి. మరపు రాని కోర్కెలున్నాయి. వాటిలో కొన్నయినా నిజం చేసుకుని జీవితాన్ని పండించు కోవాలని వలపువాకిళ్లనిండా మధురభావాల సుమమాలల్ని కట్టిందామె. వెన్నెల మెట్లెక్కి, ఊహాల పల్లకిలో విహరించడానికి తనువునూ మనసునూ సమాయత్తం చేసుకుంది.