ఎత్తయిన కొండ ప్రదేశంలో అపురూపంగామలచబడి ఉందా ఆలయం.గుడి మెట్లమీద రాలిన పున్నాగపూలనుండి వస్తున్న మత్తయిన వాసననిశ్శబద్దంగా పరుచు కుంటోంది - ఆప్రాంతమంతా.పచ్చగన్నేరు చెట్టునిండా విరగబూసినపూలు బంగారు ముద్దల్లా మెరిసిపోతున్నాయ్‌.మెట్లకు ఎడం పక్కగా వున్న కోనేట్లో నీళ్లు - ఉదయపు ఎండపడి -కరిగించిన వెండిలా తళతళ మంటున్నాయి?అర్చన ముగించుకుని గుడి, ఆవరణలో వున్న పొగడచెట్టు మొదట్లో కూర్చున్నాడుమనోహర్‌. అతను పూజారి కోసం ఎదురు చూస్తున్నాడు. పన్నెండుకల్లా గుడి మూసేసివచ్చి -అతని సందేహాలకు సమాధానం చెబుతానన్నాడు పూజారి.అందుకే ఆ నిరీక్షణ. పూజారి ఇంకా రాలేదు. ఏమీతోచని మనోహర్‌ - గుడిగోడల మీదితరుణీమణుల భంగిమలు చూస్తున్నాడు.అతని కళ్లు ఓ శిల్పాన్ని చూసి తళక్కుమన్నాయ్‌.శ్రీకృష్ణుని గాఢ పరిష్వంగంలో తనువు కాగి, కరిగిపోతుంటే - పారవశ్యంతో కళ్లు అరమోడ్చి, పుల కించిపోతున్న రాధ శిల్పమది.‘‘వారెవ్వా...’’దేవుడ్ని కీర్తించే శ్లోకాల్లోనే కాదు. గుడి గోడల మీద కూడా శృంగారమే!ఎంత మనోజ్ఞమైన తన్మయత్వపు రతి భంగిమ!అతని చూపులు అలా అలా గోడ మీద పాకు తున్నాయ్‌.మరోచోట శ్రీకృష్ణుడు మైమరచి వేణువు ఊదుతున్నాడు. ఆ సుందరాకారుని చుట్టూ చేరి, మోహంతో తాదాత్మ్యను చెందుతున్నారు గోపికలు.ఒక స్ర్తీ పయ్యెద పూర్తిగా తొలగిపోగా, మరొక వనిత నాభీమండలం మధు కలశంలా ఊరిస్తోంది. వేరొక గోపిక జఘనభాగం కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది. ఇంకొక గోప వధువు కటివలయం నుంచి వలువ నిలువలేక జారిపోతోంది.... 

మరొక మోహనాంగి సమోన్నత వక్ష స్థలం చూపరుల మతి పోగొడుతోంది.‘‘ఆ హాహా... కల వేణు రవావశ గోపవధూ... శతకోటి వృతాత్సర కోటి సమాతో...’’అనుకోకుండా అతడి అధరాల్నుంచి అలవోకగా వచ్చేసిందా శ్లోక పాదం.‘‘నాయనా... మనోహర ... ఇక అడుగు... నీ సందేహాలు’’ మాధవశాస్ర్తి వచ్చి మనోహర్‌ ఎదురుగా కూర్చున్నాడు.గోపికల అంగాంగ విన్యాసాల్ని విచలితుడై వీక్షిస్తున్న మనోహర్‌ ఈ లోకంలోకి వచ్చాడు.‘‘నాయనా... మనోహరా...’’ అంటూ మాధవశాస్ర్తి సంబోధించిన విధానం - అతనికెందుకో గిలిగింతలు పెట్టినట్లనిపించింది.‘‘మనోహర్‌ అంటే ఏమిటి పూజారిగారూ?’’ అర్థం తెలిసినా - కావాలనే అడిగాడు.‘‘మనసులను హరించే వాడు అని అర్థం నాయనా...’’‘‘ఎవరి మనసులనండీ?’’‘‘కన్యామణుల మనస్సులను! భగవాన్‌ శ్రీకృష్ణుడు బృందావనంలో విహరిస్తూ, గోపికల హృదయాలను దోచే వాడు, కనుక మనోహరా... అని ఆయన్ని కీర్తించారు కవులు..’’‘‘మన కవులు మంచి రసికులండీ’’‘‘శృంగారంలో దైవత్వం ఉంది బాబు...’’‘‘ఎంతబాగా చెప్పారండి... మీరు చాలానచ్చారు నాకు... గుడిగోడల మీద ఆ శిల్పకళ చూడండి...’’ మన శిల్పులు కూడా తక్కువ వాళ్లు కాదండోయ్‌... పూజారి గారూ! రతి కళలో సిద్ధ హస్తుల్లా ఉన్నారు... ఎంత నైపుణ్యంగా చెక్కారండి... ఆ కళలో ప్రక్రియల్ని...’’