ఆఫీస్‌లో తన క్యాబిన్‌లో కూర్చుని ముఖ్యమైన ఫైల్స్‌ పరిశీలిస్తోన్న వరుణ్‌ ఏకాగ్రత కోల్పోతున్నాడు. అతనికి అదే పనిగా హిమజ గుర్తుకొస్తోంది. జ్ఞాపకంలా మొదలైన హిమజ ఆంక్షల్లేని కాంక్షల్ని రగిలిస్తూ అతణ్ణి వివశుడ్ని చేస్తోంది. విరహుడ్ని చేస్తోంది. ఆ విరహ వేదనలోనే వెక్కిరిస్తున్నట్లు ఒంటరితనం.మనసూ, తనవూ మదనకుతూహలంతో కదం తొక్కుతున్నాయి. కారణం...?! వేసవి సెలవులు రావడంతో హిమజ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పట్నుంచీ వరుణ్‌ పరిస్థితి ఇంతే... రాత్రిళ్లయితే అస్సలు నిద్ర పట్టడం లేదు. మంచం మీద అటూఇటూ పొర్లినా, బోర్లా పడుకుని గుండెలకి దిండుని హత్తుకున్నా, వెల్లకిలా పడుకుని సీలింగ్‌ వైపు చూస్తున్నా, సుఖ భోగాలందించే హిమజ లేదన్న, ఫీలింగ్‌... హిమజ ఊరెళ్ళి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. అప్పుడే అంత ఉధృతంగా విరహ తాకిడిని అనుభవిస్తున్నాడు వరుణ్‌. మనసంతా వెలితిగా, రసరహితంగా ఉంది.కుర్చీలోంచి నిరాస్తకంగా లేచి, నీరసంగా కిటికీవైపు కదిలాడు. రెండో అంతస్తులో ఉన్న, తన ఆఫీసు గదిలోంచి క్రిందకి తొంగి చూశాడు. రోడ్డు మీద రకరకాల జంటలు రంగు రంగుల సీతాకోక చిలుకల్లా బైక్‌ల మీద ఉల్లాసంగా, ఉత్సాహంగా వెళ్తున్నాయి. భారంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పులోంచి పెళ్లికి ముందు, నిశ్చితార్థం అయ్యాక హిమజతో బైక్‌ మీద ప్రయాణం... వర్షం కురిసిన రాత్రి అనుభవం కళ్ల ముందు మెదిలాయి. మనసు గాల్లో తేలిపోతున్న అనుభూతి వరుణ్‌లో నిశ్చితార్థం అంటే సగం పెళ్లయినట్టు అర్థం.‘మీరు కాబోయే భార్యాభర్తలు.... ఇక నిశ్చింతగా ఉండండి’ అని అర్థం.

నిశ్చితార్థం అయినప్పటి నుంచి హిమజ, వరుణ్‌ల సెల్‌ఫోన్‌ సరస సంభాషణలు... విరహ గీతాలు...హిమజ, వరుణ్‌లు ‘కర్నూల్‌’ నుంచి ‘మహానంది’ వెళ్దామని, పెద్దల అంగీకారంతో బైక్‌ మీద రయ్‌మంటూ బయల్దేరారు.బైక్‌ ‘ఓర్వకల్లు’ దాటిందో లేదో ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి రాబోయే వర్షానికి సూచనగా... వరుణ్‌ వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాడు. హిమజ తన రెండు చేతుల్తో అతణ్ణి గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఆమె ఎత్తులు అతని వీపుభాగాన్ని మత్తుగా తాకుతూ మెత్తగా చిత్తు చేస్తున్నాయి. అతనిలో కోర్కెల నాగు బుసకొట్టింది. కసిగా ఆమెని నలిపేయాలనిపించింది. కానీ బిడియం... అనువుగాని ప్రదేశం... ‘నంద్యాల’ సమీపిస్తున్నంతలో జోరున వర్షం.క్షణాల్లో ఇద్దరూ తడిసి ముద్దయ్యారు. బైక్‌ని ఓ చెట్టు కింద ఆపి దిగారు. అంత చలిలోనూ వారిరువురిలో విరహపు ఆవిరులు... ఒకర్నొకరు చూపులతో కాల్చుకు తింటున్నారు.‘‘హిమా...! నీకిప్పుడు ఏం గుర్తుకొస్తోంది...?!’’ ఆశగా అడిగాడు వరుణ్‌.‘‘వేడి వేడి మొక్కజొన్న పొత్తులు...!’’ అంది హిమజ.