ఆమె కాళ్ళను ఒకటొకటిగా కదుపుతూంటే మడమల దగ్గర వెండి పట్టా గొలుసులు ఏ సంగీత దర్శకుడూ సృష్టించలేనంత మధురమైన సవ్వడిని కలిగిస్తున్నాయి.. ఇద్దరి మధ్యా మౌనం...

‘‘ఎంతకాలం నుంచీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు’’ కొంటె నవ్వు పెదాలపై నాట్యమాడుతుండగా అడిగింది సుహాసిని.‘‘నేను... నిన్ను’’ అడిగాడు శేఖర్‌.‘‘అవును ‘నన్ను’... ‘మీరు’’ అర్థమయ్యేలా చెప్పింది.‘‘ఏమిటిది’’.‘‘ఏం... నేను చాలా సులభమైన సూటి ప్రశ్న వేశాను. అది కూడా చెప్పకపోతే ఎలా... ఎంతకాలం నుంచీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు... అంతే... ఊఁ’’ కుతూహలంగా చూసింది.‘‘నిన్ను ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పారు నీకు’’.‘‘ఏమిటీ’’ సుహాసిని గొంతులో ఓ రకమైన చిరాకు మరి అలాంటప్పుడు నాతో పెళ్ళికి సంబంధం ఎందుకు కలుపుకున్నారు’’.‘‘నేను కాదు... అది మీ అమ్మా నాన్నల్ని అడ గాల్సిన ప్రశ్న’’.‘‘........... ............. .....’’‘‘అబద్ధమాడద్దు.... నువ్వేం దాచలేవు... మన ఆచార వ్యవహారాల్ని బట్టి అమ్మాయి తరపునుంచే అడగడం జరుగుతుంది. నా విషయంలో అబ్బాయి నుంచి ఎలా అవుతుంది. చెప్పు’’.విశాఖ బీచ్‌ ఒడ్డున వున్న హనీమూన్‌ కాటేజ్‌లో ఉన్నారు. కొత్తగా పెళ్ళయిన జంటల కోసం ఈ మధ్యే ప్రత్యేకంగా నిర్మించారు ఆ కాటేజీ. ఏకాంతం... చక్కని ప్రశాంత వాతావరణం... హనీమూన్‌ ప్యాకేజీల క్రింద ఓ వారంపాటు బస - భీమిలి, అరకు, పాడేరు... ప్రకృతి అందాల మధ్య గడపడానికి మరిన్ని సదుపాయాలు కావాలనుకున్న వారికి.అక్కడ విండో లోంచి చూసినప్పుడు అస్తమించే సూర్యుడు, రంగులు మార్చే ఆకాశం దూరంగా పడవలు... ఆకాశంలో చుక్కల మాదిరిగా గూళ్ళకు చేరే పక్షులు... శరీరాన్ని తాకి హాయిని కలిగించి, కోరికల్ని రేపే సముద్రపు గాలి.సుహాసిని శేఖర్‌ కొత్తగా పెళ్ళయిన జంట. ముందు రోజే పెళ్ళి రిసెప్షన్‌ హడావిడీ అదీ పూర్తి చేసుకుని ఈ హనీమూన్‌ కాటేజ్‌కి వచ్చారు.శేఖర్‌ మంచంపైన వెనుక తలగడాలను ఎత్తుగా పెట్టుకుని ఆనుకుని వున్నాడు. సుహాసిని అతని ప్రక్కన బోర్లా పడుకుని మోజేతులపైన ఆనుకుంది. కాళ్ళను వెనక్కి ఎత్తేసరికి, నున్నటి మేనేమో అందమైన పలుచని చీర అలా జారింది... కాళ్ళ పసిమి అందాలను బహిర్గత పరిచింది.

ఆమె కాళ్ళను ఒకటొకటిగా కదుపుతూ వుంటే మడమల దగ్గర వెండి పట్టా గొలుసులు ఏ సంగీత దర్శకుడూ సృష్టించలేనంత మధురమైన సవ్వడిని కలిగిస్తున్నాయి.ఇద్దరి మధ్యా మౌనం.ఆ మౌనంలో సన్నని సంగీతం.శేఖర్‌ చూస్తున్న ‘ఫిలింఫేర్‌’లో రంగురంగుల బొమ్మలు... అట్టమీద బిపాషా జాన్‌ అబ్రహం.. చూస్తేనే కైపెక్కేలాంటి భంగిమల్లో... దాన్నే తదేకంగా చూస్తున్న సుహాసిని.మేగజైన్‌ బ్లో-అప్‌-ప్రియాంక చోప్రా... అందాలను విరజిమ్ముతూ ఆడవాళ్ళే ఈర్ష్యపడేలా...ఒక ప్రక్క శేఖర్‌ చూస్తున్నా మరోప్రక్క సుహాసినికి కనిపిస్తున్నాయి... కనిపించాలనే...