వర్షాకాలం... రాత్రి తొమ్మిది గంటలయింది.ఉదయం నుంచి మబ్బుగా వున్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో వర్షం ఒక్కసారిగా కురవడంతో పాటు ముసురులా పట్టుకుంది.మా ఆవిడ తన స్నేహితురాలి కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌కు ఊరెళ్ళటంతో, ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏమీ తోచక టీ.వీ. ఆన్‌ చేశాను. జీ తెలుగు ఛానల్‌లో డ్యాన్స్‌ షో వస్తోంది.గబుక్కున కాలింగ్‌ బెల్‌ మోగడంతో, ఆసక్తిగా టీ.వీ. చూస్తున్న నేను ఒక్క క్షణం తత్తరపడ్డాను. అంతలోనే మళ్ళీ తేరుకున్నాను.మేము ఇల్లు మారిన సంగతి ఇంకా ఎవ్వరికీ తెలీదు. మరి ఈ టైంలో వచ్చింది ఎ...వ...రై... ఉంటారు? అనుకుంటూ టీ.వీ. ఆఫ్‌ చేసి, వెళ్ళి తలుపు తీశాను.అంతే! నిర్ఘాంతపోయాను.సరిగ్గా అప్పుడు- అక్కడ... అక్కడ...గుమ్మంలో నాకెదురుగా ఓ ఇరవైఏళ్ళ అందమైన అమ్మాయి నిలబడి వుంది. ఇంతకు ముందు ఆమెని ఎక్కడా చూసినట్టు లేదు. పాల నురుగులాంటి తెల్లచీరలో, తల్లో అరవిరిసిన మల్లెపూలతో వర్షంలో తడిసి ముద్దయిపోయి, చలికి గడగడ వణుకుతూంది.పసిడి ఛాయ... నక్షత్రాల్లా మెరిసే కలువల్లాంటి కనులు... సంపెంగలాంటి నాసిక... గులాబీ రేకుల్లా లేలేత అధరాలు... కవ్వించే కుచద్వయం... నాజూకైన నడుములో ఊరించే చిన్ని ముడుత... పినాకిని సైకత తీరాన్ని తలపించే ముచ్చటైన నాభి... వెరసి దివినుండి భువికి దిగివచ్చిన శృంగార దేవకన్యలా వుంది.

రెప్పార్పకుండా మోహనంగా ఆమెకేసి చూస్తూ వుండిపోవడంతో, గుమ్మంలో ఆ అమ్మాయి ఇబ్బందిగా కదులుతూ. ‘‘ఎ...వం...డీ... లోపలికి... రావచ్చా?... ప్లీజ్‌...’’ అనడిగింది.చలికి ఆమె స్వరం వణుకుతూంది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది.ఆ మాటకు ఉలిక్కిపడి, అంతలోనే తెప్పరిల్లి- అప్పటి వరకు ఆమె అవస్థని గమనించనందుకు ఫీలవుతూ, ‘‘రండి!... అక్కడ టవల్‌ వుంది. ముందు తల తుడుచుకోండి. లేకుంటే జలుబు చేస్తుంది’’ అంటూ స్టాండ్‌ వైపు చూపిస్తూ పక్కకి తొలగి దారి ఇచ్చాను.‘‘తల తుడుచుకుంటే చలి తగ్గుతుందటండీ? బట్టలన్నీ వర్షంలో తడిసి ముద్దయి పోయాయి. చీర విప్పి, పిండి ఆరేసుకోవాలి. మీ ఆవిడ చీర గానీ... నైటీ గానీ... ఇవ్వగలరా? ప్లీజ్‌...’’ అందామె లోపలికొస్తూ.ఆమె కలుపుగోలుతనము నాలో అలజడి కలిగిస్తుండగా, బీరువాలో పైనే వున్న పింక్‌ కలర్‌ నైటీ ఆమెకిస్తూ- ‘‘స్నానంచేసి ఇది వేసుకోండి. తడిసిన మీ బట్టలన్నీ వెనక వరండాలో ఆరబెట్టుకోండి’’ అని ఆమెకి బాత్‌ రూం చూపించాను.‘‘సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను’’ అంటూనే నేనిచ్చిన నైటీ, స్టాండ్‌ పై వున్న టవల్‌ తీసుకుని బాత్‌రూంకేసి నడిచింది.కాసేపటికి ప్రెష్‌గా తలస్నానం చేసి నైటీ వేసుకొచ్చిందామె. ఆమె శరీరం మీద నుంచి శాండిల్‌ పరిమళం గమ్మత్తుగా గదంతా వ్యాపించింది.