రాత్రి పదిగంటలకల్లా కమలని రమ్మని చెప్పాను... ఈ క్షణమో, మరుక్షణమో తను తప్పక వస్తుంది.సమయం గడుస్తున్నకొద్దీ, క్షణాలు లెక్కబెట్టుకోవడం ఎక్కువైంది. కమలను తలచుకునేకొద్దీ ఒళ్ళంతా మత్తుగా మూలుగుతోంది.అసలే పౌర్ణమిరాత్రి... లక్షలకోట్ల చుక్కల మధ్యన చంద్రుడు మరీ హొయలు పోతున్నాడు. కమల వచ్చేస్తే నా ముఖంలోనూ వచ్చే వెలుగు చూస్తే, తను చిన్నబోతాడేమో...ఈ రాత్రి నాకూ, కమలకూ మరచిపోలేని మధురరాత్రి కాబోతోంది. పచ్చని పొలాలు సాక్షిగా, పక్కనే పారే సెలయేరు సాక్షిగా, పైన ఆకాశం, క్రింద భూదేవి సాక్షిగా, కమల నా స్వంతం కాబోతోంది. కోర్కెల కొలిమిలో రగిలిపోతున్న నా దేహార్తిని తీర్చే రుచిర జలం కమల.అసలు గతకొద్ది రోజులుగా నన్ను నేను పోగొట్టుకున్నాను.

 నా ఊపిరిలో, ఊహల్లో కమలే నిండిపోయింది. కళ్ళు ఆమెకోసమే తెరచుకుంటాయి. చెవులు ఆమె గొంతునే గుర్తుపడతాయి.నాకు ఊహ తెలిసినప్పటి నుండి కమలను ఎరుగుదును. ఆమె నాకన్నా రెండు మూడేళ్ళు చిన్న... వయసులో...అంతాకలసి అయిదువందల ఇళ్ళున్న మా ఊళ్ళో నిజానికి అందరికీ, అందరూ ఎంతో కొంత తెలుస్తారు. పేరుకు పల్లెటూరయినా, పట్నం వాసనల్నీ గట్టిగానే పీల్చుకుంటోంది మా ఊరు. కొత్తలోకపు ద్వారాలు వడివడిగానే తెరచుకుంటున్నాయి.గౌనులదశ దాటి లంగా జాకెట్ల మీదుగా ఓణీవేసే లెవెల్‌కి నా కళ్ళ ముందే ఎదిగిపోయింది కమల. సరిగ్గా యిక్కడనుండే ఆమెలో ఏవోవే కొత్తందాలు నాలో ఎక్కడో సంచలనాలు రేపడం ప్రారంభమైంది.అప్పటివరకు ఏ మాత్రం భేషజం లేకుండా అబ్బాయిలతో కూడా కలివిడిగా కలసి ఆడుకున్న కమల, పైట ఒంటిమీదకి కొత్తగా వచ్చేసరికి మాకు, ఇంకా చెప్పాలంటే నాకు క్రమంగా దూరమౌతోందేమోనని అనుమానం ప్రారంభమయింది.దాంతో ఆమెని గమనించడం మరింత ఎక్కువైంది. అబ్బో... ఎంత త్వరగా అందాలని పెంచేసుకుంటోంది? సన్నగా రివటలావుండే అమ్మాయి బొండు మల్లెలా ముద్దుగా... బొద్దుగా మారిపోయింది. కోటేరు ముక్కుకి కొత్త కళ వచ్చింది.

పెదవుల్లో వచ్చి చేరిన ఎర్రెర్రని చిరుకంపనలు, బుగ్గల్లో వెచ్చని ఆవిరులు, నుదురు, కనులు, చెక్కిలి, చుబుకం... ప్రతి భాగంలోనూ ఓ కొత్తదనం.ఇవి చాలవన్నట్టు పైటచాటున పాలకడలిలా పొట్టభాగం, నడి సంద్రాన విహరిస్తున్న నావలా ఆ బొడ్డు, సాగరతీరాన వెలసిన రెండు హిమవన్నగాలు...కమలలో చోటుచేసుకున్న కొత్త అందాలన్నిటికీ రక్షణలా, సమున్నతంగా గర్వంగా నిలుస్తున్న ఆ వక్షభాగం.నేను పిచ్చివాణ్ణయిపోయాను. ఆ పిచ్చి పేరు కమల. నా జపతపాల మూల బిందువు కమల.మా వెనుకవీధిలో వుంటున్న వాళ్ళకీ, మాకూ పెద్దల వైపు నుండి పరిచయాలు బాగానే వున్నాయి. నాకు వాళ్ళింటికి వెళ్ళిరావడానికి ఎవరికీ అభ్యంతరాలు లేవు. అలాగే ఆమెకీ మా యింట్లో చనువు ఎక్కువే.