‘‘అరటిపండు తొక్క మీద కాలువేసి జారిపడతావు. ఎవరో నవ్వుతారు. నీకు దఃఖం. అదే తొక్కపైన వేరేవరో కాలువేసి జారిపడతారు. గబుక్కున్న నీవు నవ్వుతావు. ఒకటే చర్య.. కాని.. సంతోషం.. దుఃఖం ఎవరి చేతిలో ఉన్నాయా? మన చేతిలోనే కదా! మనిషికి సంతోషాన్నిచ్చే సంఘటనలు కన్నా... విషాదంను మిగిల్చేవే ఎక్కువగా గుర్తుంటాయి.. ఎందుకు? మనిషి ఎప్పుడూ జరిగినే దాన్నే ఆలోచిస్తూ ఈ క్షణాన్ని గుర్తించలేకపోతున్నాడు..ఆలోచించు... వాస్తవాలను వాస్తవంగా ఆలోచించు. నీవు వ్యవసాయదారుడవు.. కష్టాలు నష్టాలు నీకు క్రోత్త కాదు. ఏ ప్రభుత్వం కూడా రైతు సమస్యల పట్ల నిస్వార్థంగా స్పందించదని మనకు తెలుసు, సమస్యలను జయించు.. కష్టాల్లో కామెడిని వెతుక్కోవాలి లేకపోతే మధ్య తరగతి మనిషి జీవితం మరణం వైపుగా సాగిపోతుంది. నీ సమస్యలకు పరిష్కారం మరఫం మాత్రం కాదు... పోరాటం.. సమైక్య పోరాటం.. ఆదిశగా ఆలోచించు... మళ్ళీ వస్తాను...’’ ఆసుపత్రి మంచంపైన ఉన్న నా మిత్రునిని ఓదార్చి బయటకు నడిచాను. అతనికి ఆలోచించుకొనే అవకాశం అవసరం. రైతు ఆలోచనల్లోనే భావి భారతి భవిష్యత్‌ నిర్మాణం జరుగుతుందని నా నమ్మకం. మాఘ మాసం... నీటి గాలి చల్లగా ఉంది.. సమయం సాయంత్రం... ఆరుగంటల ప్రాంతం... విశాఖ నగరం.. జనసంద్రంగా ఉంది.. నా మిత్రుని పేరు సదాశివం. రైతు వంశధార ప్రవాహక ప్రాంతంలోని ఒకానొక చిన్న గ్రామం. ఏటి ఒడ్డు గ్రామం. అక్కడ పల్లం ఓరెండుకరాలు పొలం అతనికుంది. కాలం సజావుగాసాగి. ప్రకృతి సహకరిస్తే వచ్చే పంట దిగుబడివలన అతని కుటుంబం హాయిగా సాగుతుంది. ఈ సంవత్సరం గడచిన రెండు సంవత్సరాలు కన్నా వర్షాలు బాగానే కురిసాయి. పంట బాగుంది. 

అనుకున్న సమయంలో అకాల వర్షాలు రైతులను కుదేలుచేసాయి. అప్పులు పేరుకుపోవటమే కాక కొందరి వ్యక్తుల స్వార్థపరత్వం వారికి ప్రభుత ్వం( అధికారులు-నాయకులు) చట్టబద్ధంగా సహకరించటం వంటి అంశాలు నా మిత్నున్ని ఆత్మహత్యకు పురికొల్పాయి. ఇది ఒక్క నా మిత్రుని కధా వ్యధా మాత్రమే కాదు. దాదాపు నూటిఇరవై ఎకరాలు కోల్పయిన రైతులందరిది.నా మిత్రుడు ఆత ్మహత్య చేసుకున్నాడని ప్రాణాపాయస్థితిలో విశాఖలోని ఒకానొక ఆసుపత్రిలో ఉన్నాడని రమ్మని మరోమిత్రుడు పంపిన సెల్‌ సందేశం అందుకొని ఆగమేఘాలపైన ఇక్కడ దిగాను. ప్రాణాపాయం తప్పిందని తెలుసుకొని కుదుటపడ్డాను. వెళ్లి ఓదార్చాను. ఓదార్పు మనిషి సమస్యను పరిష్కరిస్తుందని కాదు. నీకు నేనున్నానే సందేశంను పంపుతుంది. ‘‘ఒక్కమాట’’ మనసును మల్లెల లా తాకగలిగితే మరణం అంచువరకు వెళ్లిన మనిషి కోలుకుంటాడు. పరిష్కారం దిశగా ఆలోచిస్తాడు.