తుపాన్‌. నాలుగేళ్ల తరువాత ఆకాశం అంతా చీకటిని కపకుంది. ఉరుములతో పాటు మెరుపులు చీకటిని చీల్చుకొస్తున్నాయి. ఇప్పటికే వాన ఇక వద్దన్నంతగా కుండపోతగా కురిసింది.ఆ స్థితిలో వాతావరణం రమేష్‌లో కసిని, కోపాన్ని,వేదనను రగిల్చింది.నాలుగేళ్ళ నుంచి ఇటువంటి వాతావరణం కోసం తపించని రోజులేదు కదా....మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూడాలని మెడలు విరిగి పోయేంత వరకు,కళ్ళు కాయలు కాసేంత వరకు చూసిన రోజులు ...చివరకు నిరాశను మిగిల్చిన ఆ రోజులు అతనిలో తీవ్రమైన కోపాన్ని నింపాయి .ఈ ఉరుములు... మెరుపులు...మేఘాలు... ఇన్నాళ్ళ నుంచి యాడ నిద్రపోతాన్నాయో. ఇపడు పడే వానేదో అపడే పడింటే ఈ ఇబ్బందులుండేవి కాదుకదా అని దుఃఖం నిండిన మనసుతో అనుకున్నాడు.రమేష్‌ కల్లోలిత ఆలోచనలకు కేంద్ర బిందువు రెండు రోజుల కిందట జరిగిన సంఘటనే.వర్షం మొదలవడంతో అతను అక్కడ నుంచి మళ్ళీ ఇంట్లోకి వచ్చినాడు. ఆలోచనల నుంచి నిద్రలోకి జారుకుందామనుకున్న అతని ప్రయత్నం ఫలించలేదు. ఆకాశం ఎడతెరిపి లేకుండా వర్షిస్తున్నట్లుగా, అతని మనసు ఆలోచనలను కురిపిస్తోంది.రెండు రోజుల కిందటి సంఘటన పెద్దగాయమై, బాధై సలపరిస్తోంది.అంత అప ఈ కరువు కాలంలో కట్టాలంటే యాడబ్బా.

 ఎడారిలో నీళ్ళ నైనా పుట్టించవచ్చేమో కాని కరువులో యాబైవేల రూపాయలు పుట్టించడం జన్మలో అయ్యే పని కాదనుకున్నాడు. అయినా అప కట్టక తప్పదు కదా. ఏం చేయాలో అతనికి తోచడం లేదు. తీసుకున్న అపలకు వడ్డీలు కట్టేందుకే నాలుగేళ్ళ నుంచి దిక్కులేకపాయ. అట్లాంటిది మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కొత్తగా అప అడగాలనే ప్రశ్నలు ఉదయించాయి. కనుచూపు మేరలో తన సమస్యకు పరిష్కార మార్గం కానరాక చివరకు ‘భగవంతుడా నీవే నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ’ రెండు చేతులను గాలిలోకి ఊపుతూ నమస్కారం చేశాడు కనిపించని దేవుళ్ళకు..అట్లని అతను భారమంతా దేవుడిపైన వేసి ఊరుకోలేదు. అప ఎవరి దగ్గర అడగాలనే విషయాన్ని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్న కొద్దీ తనింత వరకు ఎవరెవరి దగ్గర అపచేసింది గుర్తు తెచ్చుకుంటున్నాడు.చెంగారెడ్డి, సుబ్బరాయుడు, శిలార్‌, రఘు.., ఈ నాలుగేళ్ళ నుంచి అంతోయింతో వీళ్ళందరి దగ్గర అప తెచ్చుకున్నాననే ‘ఆలోచన’ తిరిగి లెక్క అడగడానికి అడ్డుకట్ట వేస్తోంది. అడగందే అమ్మ అయినా పెట్టదని, అన్ని నువ్వే ఊహించుకుంటే ఇపడు అప ఎట్లా తీరుస్తావని అంతరాత్మ హితబోధ చేస్తోంది.ఇపడతని జీవితాశయం ‘పాతఅపతీర్చడమే’. దానికి ఏం చేయాలన్నదే అతని ముందున్న పెద్ద ప్రశ్న.లెక్క...లెక్క.. ఎవరిస్తారు, ఎవర్ని అడగాల.. ఎడతెరిపి లేని ఆలోచనలు.