‘‘హలో! ధనకొండగారు!’’ వినబడుతోందా... నేను సార్‌, సేఠ్‌ చమన్‌లాల్‌ని. హైదరాబాదు నుండి... హలో హలో’’‘‘హలో! చెప్పండి చమన్‌లాల్‌గారు’’ ధనకొండ పలకరించాడు. ‘‘సార్‌! సార్‌! ఎలాగున్నారు? మేడమ్‌ బాగుందా? పిల్లలు బాగున్నారా? మీ బుజ్జి సితారా అదే మీ బుల్లి కుక్కపిల్ల’’ అంటూ ఛమన్‌లాల్‌ పరామర్శలు మొదలుపెట్టాడు.‘‘అంతా బాగానే ఉన్నారు చమన్‌లాల్‌గారు! ఏది ఈ మధ్య మీరు దేవస్థానానికి వచ్చినట్టులేదే? నాకు మీరు కాల్‌ చేసి కూడా ఒక నెల దాటిపోయిందను కుంటా. ఎప్పుడొస్తున్నారు? ఏదైనా ప్రోగామ్‌ ఉంటే ముందుగానే చెప్పండి. అరేంజ్‌మెంట్స్‌ చేసి పెడ్తాను. డ్యూటీలో ఉన్నాను. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడు కుందాం. ఆఫీసు బాధ్యతలనుండి గుడి లోపలికి నా డ్యూటీ మార్చుకున్నాను. టికెట్లకు, దర్శ నాలకు, సేవలకు అప్పటిలాగా కష్టపడాల్సిన పనిలేదు’’ అని ధనకొండ అనీ అనక ముందే... అటువైపు నుంచి సేఠ్‌ చమన్‌ లాల్‌ ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు.‘‘అయితే సార్‌! ఇప్పుడు కొండ మీద ఆలయం లోపలే పనిచేస్తున్నారా? చాలా ఆనందంగా ఉంది సార్‌! ఈ వారంలోపే కొండకు ప్రోగ్రామ్‌ పెట్టుకుంటాం సార్‌. ఈలోపు రానూ పోనూ రైల్వే టికెట్లు బుక్‌ చేసుకుని తారీఖులు చెప్పేస్తాను సార్‌’’ అని చమన్‌లాల్‌ అంటుంటే ధనకొండ అందుకున్నాడు.

‘‘చమన్‌లాల్‌జీ! రైల్వే టికెట్లు కన్‌ఫర్మ్‌ కాక పోయినా తీసేసుకోండి. రైల్వే వాళ్ళకు చెప్పి వాటిని నేను కన్‌ఫర్మ్‌ చేసిపెడ్తాను. రైల్వేవాళ్ళకు వాళ్ళ అధి కార్లకు నాతో రోజూ పని ఉండనే ఉంటుంది. అందరూ మనోళ్ళే. ఏ పనైనా చిటికెలో చేయించి పెడ్తాను. సరేనా! అంటుంటే...‘‘అవును సార్‌! మీరిప్పుడు దేవుని సన్నిధానంలో పనిచేస్తున్నారు. దేవుని తర్వాత దేవుడంతటివారు. మీ మాటకు అడ్డుచెప్పేవాళ్ళెవరు సార్‌! మీలాంటి వారు గుడిలో ఉంటే మాలాంటివారికి దేవుడు మా నట్టింట్లో ఉన్నట్టే సార్‌’’ అంటూ చమన్‌లాల్‌ చమత్క రించాడు.‘‘చమన్‌లాల్‌జీ! మీకు నామీద ఉండే అభి మానంతో అలా అంటున్నారు అంతే, అయితే మీరు తొందరగా ప్రోగ్రామ్‌ గురించి ఫోన్‌ చేయండి. మీ పని చేసి పెట్టేస్తాను. గుడిలో పనిచేసే మాలాంటి వాళ్ళు ఎంత బిజీగా ఉంటామో మీకు తెలియంది కాదు. మీలాగా నాకు ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలనుంచి వచ్చే పాతమిత్రులు ఎంతో మంది ఉన్నారు కదా? వారికి కూడా దర్శన సేవ లకు సాయం చేయాల్సి వస్తుంది. నాకు తీరిక దొరి కేది అంతంత మాత్రమే’’ అని ధనకొండ అంటుంటే