రుషీసుపుడి మండలంలో మునులు న కతలుకొండ్రేసిన మొగలాయిఫ గోపిని కరుణాకర్‌మిణుకు మిణుకుమంటా తపసు చేసుకుంటా వుండారు. మంచం కోళ్ళు ఇంకొంచెం పైకి జరిగినాయి. వున్నట్టుండి పిల్లలకోడి రెక్కలు ఇదిలించగానే పిల్లలు కీసుకీసుమంటా చెల్లాచెదరైనాయి.‘‘ఆకాశంలో జరిగే ఇంతలు అన్నీ ఇన్నీ గావు. చిల్లర ఎంచగలమా? చాప చుట్ట గలమా?’’అనింది ఇచ్చిత్తరంగా చుక్కల్ని చూస్తా బత్తుడింటి దీపం.‘‘ఎందుకు ఎంచలేము? ఎందుకు చుట్టలేము? అపడెపడో తాతలకి ముత్తాతల కాలంలో ఆకాశం ముల్లు కట్టికి అందేంత ఎత్తులో వున్నిందంట! ఆడోళ్లు ఇంటిముందర పేన్నీళ్ళుజల్లి, ఆకాశం నుంచి తుంచి చుక్కల్ని పెట్టి, ముగ్గు పిండికి బొదులుగా వెన్నెలతో ముగ్గేసేవాళ్ళంట.’’ అనింది పొరుగింటి దీపం.‘‘అదెట్టా సాద్దిమైతింది? చుక్కల్నిపెట్టి ముగ్గెట్టా ఏసేది?’’ అని అడిగింది అమాయకంగా బత్తుడింటి దీపం.‘‘ఎట్టా ఏంటే ఎర్రిదానా? అది కవిగట్టి వెన్నెల ముగ్గేసింది’’ అనింది పెద్దింటి దీపం.‘‘కవిగట్టడమంటే ఏంది?’’ అనింది అర్ధంగాక తలగోక్కుంటా.‘నీ తిక్క తిరణాలకి పోనూ! కవిగట్టడమంటే వెన్నెలతో ముగ్గెయ్యడం. చందమామని తుంచి తల్లో పెట్టుకోవడం. తొలేటి చినుకు వాలగానే మన్నుపూసి పలవరించడం’’ అనింది పెద్దింటి దీపం.బత్తుడింటి దీపానికి అంతా అయో మయంగా వుండాది.‘‘ఇంగా అర్తంకాలా?’’లేదన్నట్టు తలూపింది.‘‘నీకు అర్తమయ్యేట్టు చెప్తానుండు. కవిగట్టడమంటే రైతు మేడిపట్టి కొండ్రేస్తే భూదేవి నీళ్ళు పోసుకోవడం’’ అని వివరంగా చెప్పింది పెద్దింటి దీపం.‘భలే భలే... ఎంత బాగా చెప్పినావు. సేద్దిం చెయ్యడమంటే కవిగట్టడమేగదా!’’అనింది నగిరింటి దీపం.‘‘ఇపడు మీకు కొండ్రేసిన మొగ లాయి కత చెప్తాను’’ అనింది పెద్దింటి దీపం.

తొలేటి వానలు పడినాయి.భూదేవి సమర్తాడింది. రైతులు మడకలు కట్టి దుక్కిలు దున్నతా వుండారు. తూనికట్టెలు ఇష్టమొచ్చినట్టు ఎగరతా వుండాయి.చింత కొమ్మలమింద వాలినకాకులు మడకసాలులో తేలిన వేరుపురుగులను ముక్కున కరుచుకోని పోతావుండాయి.ఇంటెనక చేన్లో మూడు మడకలు కట్టినారు గోపినోళ్ళు!రెండువారల ముందునుంచే దుక్కిలు దున్నేదానికి కావల్సిన కొరముట్లన్నీ అరువు చేసిపెట్టుకున్నారు.మంగళ గుట్టకి పొయ్యిని వంపు తిరిగిన మూడు ముష్టి తుండ్లు నరుక్కోని వచ్చినారు.గొర్రెలతాత, పెదబ్బ వాళ్ళ నాయన. వాటిని పేడ పంచితంలో వారందినాలు నానేసినారు. ఆ తుండ్లని మడకలు అరువు చేసే కాసీమ్‌మామ దెగ్గిరికి ఎత్తుకోని పొయినారు. గొర్రెలతాత దెగ్గి రుండి మూడుమడకలు చెక్కించినాడు.