‘‘నమస్కారమండీ! ఈ సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో నా పుస్తకం ఆవిష్కరణ సభ ఉందండీ. మీరు తప్పక రావాలి’’ ఇటీవలనే పరిచయమైన కంఠం.ఇప్పటికి నా సెల్‌కి ఫోన్‌ చేసి చెప్పటం అది నాలుగోసారి. ‘‘తప్పకుండా వస్తానండి’’ అన్నాను. నేను బదులివ్వటం పదోసారి.నాలుగుసార్లు ఫోన్‌ చెయ్యడమే కాకుండా రెండుసార్లు మెసేజ్‌లు, పోస్ట్‌లోఆహ్వానం కూడా వచ్చాయి. ఇంతకీ ఆయనతో పరిచయం లేదు. పేరు కూడా అంతగా వినలేదు. నూతన రచయిత.సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు సంధానకర్తగా వ్యవహరించే తోటి రచయిత, మిత్రుడు కూడా ఫోన్‌ చేసాడు సభకి తప్పక రమ్మనమని. అందుకే పని మీద రాజమండ్రి వెళ్ళినా తొందరగా ముగించుకొని రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ముఖం పట్టాను. అతికష్టం మీద సీటు పట్టుకో గలిగాను. ఈ రోజులలో రైల్లో రిజర్వేషన్‌ సంపాదించటం కన్నా కష్టమైన పని ఏదీ లేదనిపిస్తోంది.

 రైళ్ళని ప్రైవేటీకరణ చేస్తే మీకు సీటు, బెర్త్‌ కావాలంటే మా రైలెక్కండి అంటూ కంపెనీలు ప్రకటనలు చేస్తా యేమో!!!‘‘రామనామము రామనామము రమ్యమైనది రామనామము..’’ ఎవరో ముష్ఠివాడు. ఈ మధ్య ఈ పాట వినబడటం లేదు. క్రొత్తక్రొత్త పాటలు పాడుతున్నారు. వీడెవడో సాంప్రదాయ, పాతతరం ముష్ఠివాడిలా ఉన్నాడు. జేబులోంచి చిల్లర తీసి వేసాను. నా ప్రక్కనకూర్చొన్నవాడు వెయ్యలేదు. పైగా కసురుకొన్నాడు’’ నేను ఇలాంటి వాళ్ళకు వెయ్యనండి. కంపార్ట్‌మెంట్‌ క్లీన్‌ చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకు వేస్తాను. ఏదైనా పనిచేసి అడుక్కోవాలి’’ అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఎవ్వరితో అన్నాడో అర్థం కాలేదు. ఒక్కసారి మొహం చూశాను. గుర్తు కొచ్చింది. ఆయన నాతోబాటే రాజమండ్రిస్టేషన్‌లో టిక్కెట్‌ కోసం క్యూలో నించున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి తన పర్స్‌ను ఎవరో కొట్టేసినట్లుతనది శ్రీకాకుళం దగ్గర పళ్లెటూరని ప్రయాణ ఖర్చులు సర్దుబాటు చెయ్యమని అడుగుతున్నాడు. నలుగురు మొహం త్రిప్పుకున్నారు. ఒకరిద్దరూ రూపాయో రెండో వేసారు. నేను వాడి మొహం పరీక్షగా చూసాను. దీనంగానే ఉంది. పది రూపాయలిచ్చాను. ఇప్పుడుట్రైన్‌లో నా ప్రక్కన కూర్చొన్న వ్యక్తి మాత్రం వాడు ‘‘ఎక్కడికి వెళ్ళాలి?’’ ‘‘ఎంత అవసరమవుతుంది?’’ ‘‘ఎంత పోగయ్యింది?’’ గట్రా ప్రశ్నలు వేసి పంపించేసాడు గానీ పైసా విదల్చలేదు. వాడు కనుమరుగయ్యాక ‘‘ఇదంతా నాటకంమండి! నిజంగా వెళ్ళాల్సి ఉంటే జనరల్‌లో