మధ్యాహ్నం మూడు గంటలయింది.నారాయణ ఒక నిశ్చయానికి వచ్చాడు. కలం కాగితం తీసుకొన్నాడు.్‌్‌్‌‘‘నాన్నా,నేనిట్లా అంటున్నానని ఏమీ అనకోకు. నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానో, లేక నువ్వు నన్ను ఇంకా పసిపిల్లవాడిగానే భావిస్తున్నావో తెలియడం లేదు.ఎన్నో సందర్భాలలో నా మనసు వికలమవుతూ వుంటుంది. గులకరాయి పెట్టి చెరువులో కప్పలాటగా నీటిమీదన కొట్టినట్లువుతుంది. ఎపడో చాలా సేపటికి ఆ తాకిడి ప్రభావం అడుగుతుంది. అదోక భయానకమైన అలజడి.నాకిపడు ఇరవై ఆరేళ్లు. అతి కష్టం మీద పేపరు వైజ్‌గా అయిదేళ్లు చదివి అయిందనిపించాను బియ్యేని. ప్రస్తుతం లోకంలో జీవికకు పనికిరాని డిగ్రీ అది. మరి మొన్నటికి మొన్న నువ్వూ, అమ్మా,నేనూ, తమ్ముడు రవి, చెల్లి స్వరూప కలిసి మీ దూరపు బంధువు కూతురు పెళ్లికెళితే కళ్యాణమంటపంలో పదిపదిహేను మందికి నన్నేమో ఎంబిఏగా పరిచయం చేశావు.

 ఏ క్షణాన్న విరుగుతుందో తెలియని ములగకొమ్మ మీద నిలబెట్టావు. నేనేమో ఆముదం తాగిన మొహం పెట్టుకొని కుర్చీలో కూర్చుండిపోతిని.తమ్ముడేం చేస్తున్నాడు చెప? చదవబ్బలేదు. ‘నాకు చదువొచ్చే లక్షణాలు లేవు, నన్ను చంపకండి’ అని ఖరాఖండీగా చెప్పి ఇంటర్‌తో గంటవాయించి, సెట్విన్‌లో కండక్టర్‌గా కదురుకున్నాడు కదా. వాణ్ణేమో ఎంసెట్‌కి తయారువుతున్నా డంటివి. స్వరూప ఫస్ట్‌ ఇంటర్‌ కదా చదివేది. అలాగే చెప్పావు. హమ్మయ్య అని నేను ఊపిరి పీల్చు కోనే లోగా దాన్నో రేంక్‌ స్టూడెంట్‌ని చేసి, టెన్త్‌లో దానికి ఐదొందల అరవై మార్కులు వేసేస్తివి. పాపం దానికళ్ళముందు, మూడొందల నలభై అంకె కనపడి చెమటలు పట్టించిందాయె! కళగల దాని పసిడి మొహం చెమట ముత్యాలతో మెరిసిపోయింది.

ఇక, మా అమ్మను గురించి నీ జోకులేమో దీనికి విరుద్ధంగా సాగినై. మమ్మల్ని ఎవరెస్ట్‌ ఎక్కించి, అమ్మను పాతాళానికి పంపించావ్‌. నువ్వు అభి- ఐష్‌ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే ‘ఆ పిల్లకి ‘మంచని’ పేరేమిటండీ’ అని అడిగిందా? నువ్వామెని తిరపతి తీసుకెళ్తే, ‘అసలీ దేవుడెవరండీ’ అని అడిగిందా?ఎందుకు నాన్నా, ఇందంతా? నలభై ఎళ్ల తర్వాత నీ వాళ్ళముందు నువ్వు గొప్పవాడివని చెపకోవటానికా?