ముక్కంటి ఇంటిలో పెంపుడు పనివాడు దండధరం. ముక్కంటికి ఇష్టమైనవాడు.‘‘వద్దు రావద్దు నీకసలు పనే చెప్పను,ఒకవేళ బుద్ధి తక్కువై నీకు పనంటూ చెబితేఆ పని అయిందాక నీ వెంటే వుంటాను, సరేనా’’ విసుక్కున్నాడు ముక్కంటి.‘‘ఇంకేదన్నా కొత్తరకంగా అరవండయ్యా’’అన్నాడు దండధరం.ముక్కంటికి ఆలోచన పోయి- ఏమి తోచకతన తలమీదే లయవిన్యాసం చేసుకున్నాడు.‘‘ఏమిటండీ ఇది, వాణ్నేమనలేక మీ తల పగలగొట్టుకుంటారు’’ అంటూ వచ్చింది ముక్కంటి భార్య హిమసుతం.భార్య ఆంతర్యం అర్థమయింది ముక్కంటికి. దండధరాన్ని బయటికి పంపించే సరైన అవకాశం కోసం కాచుక్కూచున్నదని తెలుసు. ‘‘వాడు నా దగ్గరకాక ఇంకెక్కడా బతుకలేడు. వాణ్ని ఇక్కడ లేకుండా చేయడమంటే ఎక్కడా లేకుండా చేయడమే. అదొదిలేసి ఇంకేదన్నా చెప’’ అన్నాడు భార్యతో. ‘‘గోల్కొండకి టికెట్లు తేరా అంటే గోల్కొండకోట చూడ్డానికి టికెట్లు తెచ్చాడు మొన్న. లింగాన్ని పిలుచుకురారా అంటేపీక్కురారా అని వినపడిందన్నాడు నిన్న.రోజూ వాడలా మిమ్మల్ని చంపుకు తినడంనేను చూడలేకపోతున్నాను’’ అంది హిమసుతం.‘‘తినడానికి నీకేం మిగల్చడం లేదనా’’ నవ్వుతూ అన్నాడు ముక్కంటి. ‘‘పొరపాటయింది గాని లెండి అసలు నేనొచ్చింది దేనికంటే-మీకు వీలుగాకపోతే మా నాన్నే ఎలాగోలా వచ్చేవాడు. 

వాణ్నెందుకు పంపించారు స్టేషన్‌కి.ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాడో ఏంటో అని కొద్దిసేపు మీ దగ్గర విలవిల్లాడి పోదామని’’ అని చెప్పి వెళ్లిపోతున్న భార్య తల మీద నిమురుతూ ‘‘ఏంకాదు లేవోయ్‌, ఏం చేయను చెప. ‘పోగూడిన పట్టు చీరల మేళా’ ఆవిష్క రణ నీకు తప్పదాయే. మా చైర్మన్‌ గారిని విమానం ఎక్కించి రావడం నాకు తప్ప దాయే’’ అన్నాడు ముక్కంటి.‘‘మా నాన్న ఇంటికొచ్చిందాక నాకు మనశ్శాంతి లేదండీ’’ అంది హిమసుతం. ‘‘సతతం ప్రశాంతం వందే హిమసుతం’’ అన్నాడు ముక్కంటి. చిరునవ్వుతో చిలిపిగా చూసింది హిమసుతం.్‌్‌్‌ఆపసోపాలు పడుతూ- వచ్చీ రావడంతోనే వాష్‌బేసిన్‌ దగ్గరికెళ్లాడు డాక్టర్‌ మత్తేభం. చేతులు తుడుచుకుని మనవడు నందిని ఎత్తుకున్నాడు. ‘‘అల్లుడు గారి కారు రైల్లో తెచ్చాను. మనవడి గారి రైలు కార్లో తెచ్చాను’’ అన్నాడు మత్తేభం బొమ్మరైలు తీసి మనవడికిస్తూ. వెంటనే దాంతో ఆట మొదలు పెట్టాడు నంది.‘‘ఎవరన్నా ఊరునుంచి వస్తే కాళ్లు కడుక్కుంటారు. మీరేంటయ్యా చేతులు తడుపుతున్నారు’’ అడిగాడు దండధరం అమాయకంగా.‘‘అవున్నాయనా మరి. నన్ను చేతులతో నడిపించి నంత పని చేశావు గదా’’ అని అల్లుడు ముక్కంటి వైపు తిరిగి ‘‘అల్లుడుగారూ! నేనిక్కడున్న నాలుగు రోజులూ మీ దండధరానికి మత్తింజక్షన్‌ ఇచ్చి పడుకోబెడతా ఏమనుకోకండే’’ అన్నాడు మత్తేభం నవ్వుతూ.‘‘అమ్మో! నాకు సూదిమందంటే భయం’’ అంటూ పరిగెత్తాడు దండధరం.‘‘డాక్టర్‌ మత్తేభం ప్రసిద్ధ ఎనస్థీషియాలజిస్ట్‌ ఆ కాయానికి మత్తిచ్చాడంటే దాని భాగాలు చూడడానికి ఇరవైమంది సర్జన్లొస్తారు’’ అంది హిమసుతం నువ్వుతూ భర్తను చూస్తూ.