‘‘ఏవండీ!’’‘‘శైలూ! నీ ఫ్రెండ్‌ సృజన గురించి కాక వేరే విషయమైతే చెప. ఆమె విషయమే అయితే ఇప్పటికే నూటా పదారుసార్లు చెప్పావు. తప్పకుండా ఆమెకు ఏదో ఉద్యోగం చూస్తానన్నానుగా!’’‘‘అదికాదండీ’’‘‘వినే ఓపిక నాకు లేదు. ఇప్పటికే చాలా లేటయింది. రేపుదయమే హోటల్‌ తాజ్‌కృష్ణాలో ఫారిన్‌ డెలిగేట్స్‌తో ‘లీప్స్‌ కార్ల కంపెనీ’ తుదిచర్చలు మన ప్రభుత్వాధికారులతో, అతికీలకమైన ఆ చర్చలను కవరేజ్‌ చేయడానికి మా టీంతోపాటు నేను స్వయంగా వెళ్ళాలి. ఏ రాష్ట్రం ఎక్కువ రాయితీలిస్తుందో, ఏ ప్రభుత్వం ఎరవేసి వాళ్ళను లాగడానికి రకరకాల ఆఫర్స్‌తో ప్రలోభపెడుతుందో అక్కడికి జంప్‌ చేయడానికి చూస్తుంటారు.

అయితే నైసర్గికంగా ఒనగూడే సహజ వనరులు దీర్ఘకాలంలో ఏం లాభాలుంటాయో హింట్స్‌ ఇవ్వడానికి మాలాంటి జర్నలిస్టులం ప్రయత్నిస్తుంటాం మాకున్న రిపోర్ట్స్‌ని బట్టి. సో లెట్‌ మీ స్లీప్‌’’.అప్పటికే రాత్రి 12 గంటలయింది. ఆవులిస్తూ నిద్రలోకి జారుకుంటున్న భర్తకు ఇంకేం చెబుతుంది! తనకు నిద్రపట్టడంలేదే!సృజన గురించే ఆమె ఆలోచనలు, అలా ఎప్పటికోగానీ నిద్రపట్టలేదామెకు.్‌్‌్‌రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగి ఒకసారి చుట్టూ కలయజూసింది.ఎంత మార్పు. ఎన్నాళ్ళకి తను మళ్ళీ రాజమండ్రిలో అడుగుపెట్టింది.

 మొట్టమొదటిసారి సృజన పెళ్ళికి - అది జాలీట్రిప్‌. తన ప్రాణనేస్తం పెళ్ళి - ఎంత సంతోషంగా గడిపింది ఆ మూడు రోజులు. అన్నీ తానై - అందరూ తనే పెళ్ళి పెద్ద అనుకునేలా - ఎంత తృప్తినిచ్చాయా రోజులు. తన మనస్సులో తీపి జ్ఞాపకాలు నింపిన ఆనాటి పర్యటనకు ఇప్పటి తన రాకకు ఎంత వ్యత్యాసం.విశాఖపట్నం విహార యాత్రకు వెళ్ళిన సృజన కుటుంబం ఉన్నఫళంగా విరుచుకుపడ్డ సునామీలో... ఎవర్నో ఆదుకోవడానికి తెగించి తానే బలైన సృజన భర్త. ఊహించడానికి కూడా వీలులేని ఈ సంఘటన.తనకిప్పటికి గుర్తు - ఆ కాళరాత్రి...సునామీ కరాళనృత్యం తను టి.విలో విధ్వంసక దృశ్యాలను కళ్ళప్పగించి చూసిన వైనం, కానీ,అది తన స్నేహితురాలి కుటుంబాన్నే కబళించిందని అపడామెకు తెలియదు.సునామీ బాధితుల జాబితాలో తనూ ఒకతెనని, స్నేహితురాలి నుంచి కబురొచ్చేవరకు తెలియదు.తెలిసిన వెంటనే వైజాగ్‌కు ఫ్లైట్‌లో బయలుదేరింది హుటాహుటిన స్నేహితురాల్ని ఓదార్చడానికి. అపడు చెప్పింది సృజనకి - ‘‘కష్టాలు వచ్చినపడే ఎదురునిలిచి పోరాడే గుండె ధైర్యం చూపాల్సింది.

నీకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళకోసం నీవు బ్రతకాలి. తొందరపడి ఏ అఘాయిత్యానికి పాల్పడినా నీ పిల్లలు అనాథలవుతారు. నీవేం అనెడ్యుకేటెడ్‌వి కావు. నీ కాళ్ళమీద నీవు నిలబడగల సమర్ధత నీకుంది. ఈ విషయం నేను చెబితే కానీ నీకు తెలియదని కాదు - నీకే అవసరమొచ్చినా నేనున్నానని చెప్పడానికే. ఈ విషయం మరవకు. స్నేహానికి నిర్వచనం నీవే చెప్పావు. నాకా విషయం జీవితాంతం గుర్తుంటుంది. ఏదయినా జరగకూడనిది జరిగితే, సింపుల్‌గా దానర్ధం నీవు నా స్నేహాన్ని శంకించినట్టే లెక్క. అది నేను తట్టుకోలేను. ఈ విషయం గుర్తుంచుకుని అడుగెయ్యి. నే వస్తాను’’ అంతే - దాని పర్యవసానమే -