కథా కాలం.....బిగ్‌ బ్యాంగ్‌ ప్రయోగం జరగడానికి ఒక రోజు ముందు.

09-09-2008.

సమయం రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు.

చిత్రలేఖ చిత్రంగా విచిత్రావస్థలో వుండి పోయింది.మూడు వందల అరవై అయిదు రోజుల స్తబ్ధత. ముప్పయి నిమిషాల్లో కోరికల కొలిమిలో కా..లి... పో...తో...న్న...ట్టు అనిపిప్తోంది.అవున్మరి... ఆలస్యంగా ఆ వేళ్టి పత్రిక చూసింది. అప్పటికి అరగంట క్రితమే టీవీల్లో చూసింది. ఆ భయం... ఆమెలోని నిరాసక్తతను శృంగారమయంగా చేసినట్టు అనిపించింది.తెల్లవారితే బిగ్‌ బ్యాంగ్‌ ప్రయోగం...జనంలో కలకలం... కొందరు ఇష్టమైన పిండి వంటలు చేసుకున్నారు. మరికొందరు ఇళ్ళలోనే వుండి పోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లలను ఆ వేళ్టికి స్కూళ్ళు మాన్పించారు. రోడ్లు క్రమక్రమంగా నిర్మానుష్యమై పోతున్నాయి.రే... పు... వుం...డ...దా?ఒప్పుడు స్కైలాబ్‌ భయం వణికించింది. ఇప్పుడు బిగ్‌ బ్యాంగ్‌ భయపెడుతోంది. అది కాదు ఆమె భయం... ఎట్లాగు చనిపోక తప్పదు.అలాంటప్పుడు... మూడు వందల అరవై అయిదు రోజులుగా పేరుకుపోయిన జడత్వాన్ని వదిలేస్తే... వదిలేస్తే... దూరంగా వున్న రెండు తనువులను పెనవేస్తే... పోనీ... పోతేపోనీ భయాలు... బిడియాలు.... ఏం కాబోలు... సంకెళ్ళు తొలగిపోనీ... తెగిపోనీ తన ఒంటి మీది అచ్చాదనలు అయ్యయ్యో అనకుండానే నేల మీదికి జారిపోనీ... ఆ అచ్చాదనలు దీనంగా చూస్తే చూడనీ. డోంట్‌ కేర్‌ అవినాష్‌ ఆశ్చర్యంగా భార్య వంక చూసాడు. 

ఆ తర్వాత అపనమ్మకంగా అడిగాడు. నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా? అది ఆశ్చర్యంలో నుంచి ఆనందానికి ట్రాన్స్‌మిట్‌ అయిన ఫీలింగ్‌.‘‘అవును’’ భర్త దగ్గరికి వచ్చి అతని గుండెల్లో తలపెట్టి అతన్ని చుట్టేసి అంది.ప్రొవలేటింగ్‌గా కనిపించే భార్య అందాల తాలూకు స్పర్శను అనుభవిస్తూ విస్మయానందాన్ని అనుభూతిస్తూ సంవత్సరం వెనక్కి వెళ్లాడు పెళ్ళయిన మొదటి రోజు... మొదటి రాత్రి... పడగ్గదిలో ఫస్ట్‌ నైట్‌ అలంకరణల మధ్య, సిగ్గు, బిడియాల మధ్య కాకుండా భయం జడత్వాల మధ్య బేలగా కూచొన్న చిత్రలేఖ.‘‘మనం శారీరకంగా ఒకటి కాకుండా, ప్రేమగా వుండలేమా?’’ చిత్రలేఖ ప్రశ్న.అది భయమో... అమాయకత్వమో... ఫోబియానో...‘‘ఏం... భయమా?’’ లాలనగా అడిగాడు భార్య భుజమ్మీద చేయేసి.నీ... ఫొ... బి... యా...ఈ వ్యాధి వున్న వాళ్ళు మంచంపై పడుకోవడానికి భయ పడతారట.‘‘పోనీ... మనం నేల మీద అదే మంచమ్మీద కాకుండా పడుకుందామా?’’ అడిగాడు అవినాష్‌... అది తన అమాయకత్వామా? ఒక్క క్షణం అనిపించింది అతనికి.‘‘ఊహు... అసలు మనం ‘అది’ లేకుండా కలిసి వుండలేమా?’’మళ్ళీ అవినాష్‌కు మరో విషయం గుర్తొచ్చింది.‘స్త్రీ ప్రేమకోసం భర్తకు సెక్స్‌ను అందిస్తుంది. అదే పురుషుడు సెక్స్‌ కోసం భార్యను ప్రేమిస్తాడు’’ తను తప్పు చదివాడా? లేదా అది నిజమా... తన భార్య అనుమానం కూడా ఇదేనా?