విశాఖపట్నంలోని కైలాసగిరి ఓ పచ్చని అందమైన ప్రదేశం. దానికి పడమర బారులుతీరిన సింహాచలం కొండలు, ఓ రెండు కొండల్ని చీల్చుకుంటూ నల్లని కృష్ణమ్మలా ఎన్‌.హెచ్‌.-5 రహదారి, సముద్రం వైపు నుంచి కొండ ఎక్కడానికి మెట్లు, రోప్‌-వే, ఉత్తరం ప్రక్క పోలీస్‌ గ్రౌండ్స్‌ నుంచి కొండపైకి రోడ్డు, కొండపైన శివపార్వతులు, ఇంకా దేవుళ్ళ విగ్రహాలెన్నో ఉన్నాయి.నిట్టనిలువుగా కేక్‌ కట్‌చేసినట్లు ఉండే ఆ కొండ చెరియ పైన కొంతభాగం చదునుచేసి ‘స్యూసైడ్‌ పాయింట్‌’ అని పేరు పెట్టారు కార్పొరేషన్‌ వాళ్ళు. అందుకే కాబోలు అక్కడ చాలా, చాలా గద్దలు కాపురం ఉంటున్నాయి. అందులో ఓ నాల్గు గద్దలు ఆ ఉదయం ఆకాశంలో తేలుకుంటూ లాసన్స్‌-బేలో ఉన్న ఓ అందమైన ఇంటిపైన చక్కర్లు కొడుతున్నాయి.్‌్‌్‌ఆ యిల్లు లాయర్‌ ఆనందరావుది, పెద్ద కాంపౌండ్‌ మధ్య ఇల్లు, చుట్టూతా రకరకాల ఫల వృక్షాలు. ఎక్కువభాగం అరటి చెట్లు పొదలు పొదలుగా పెరిగి ఉన్నాయి. కొన్ని పువ్వులు పూసి, మరికొన్ని గెలలు దిగి... ఆ ఉదయం ఆ యిల్లు చాలా ప్రశాంతంగా ఉంది, అరవై ఐదేళ్ల ముసలమ్మ గొడ్డలి తీసుకుని ఇంట్లో నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చి భీముడులా ఉన్న పనివాడి చేతికిచ్చి ఏదో ఆవేశంగా చెప్తుంది. ఆవిడ ఆనంద్‌ తల్లి ప్రసన్నలకి్క్ష. ప్రచండలకి్క్ష అంటుంటారు ఎరిగిన వారందరూ. ఆనంద్‌ అపడే మార్నింగ్‌ వాక్‌కి కైలాసగిరి ఎక్కి దిగివచ్చాడు. 

పేపర్‌ చూస్తూ బూట్లు విపకుంటున్నాడు. వంటగదిలో సరస్వతి, ఆనంద్‌ భార్య, ఉల్లిపాయలు తరుగుతోంది. బంటిగాడు, ఆనంద్‌ ఒక్కగానొక్క కొడుకు చింటూతో (పామేరియన్‌ డాగ్‌) బాల్‌ ఆట ఆడుతున్నాడు. వాతావరణం ఉక్కగా, ఉద్రిక్తంగా ఉంది.‘నరకరా వాటిని’ అంది ప్రచండలకి్క్ష.‘‘వేటిని అమ్మగారూ’’, భీముడి ప్రశ్న.‘‘అవేరా అరటి చెట్లన్నింటినీ, నరికి పారేయ్‌. ఒక్కటి కూడా మిగలకూడదు’’.‘‘పచ్చటి చెట్లమ్మా, వాటినెందుకు నరకమంటున్నావ్‌?’’ పేపర్లో నుంచి తలెత్తాడు ఆనంద్‌.‘‘సిద్ధాంతి చెప్పాడ్రా, ప్రొద్దున్నే వాటి మొహం చూడకూడదని.’’‘‘ఏం?’’‘‘ఒకే ఒక్క గెల కాస్తుందిగా అందుకని. నీ మొహం, నీ భార్య మొహం కూడా చూడొద్దన్నాడు. వీటిని నరికించి నేనెటైనా పోతా... వృద్ధుల ఆశ్రమం మంచిది చూడు చేరిపోతాను.’’‘‘ఎవడమ్మా వాడు? మూఢ విశ్వాసాల్ని ప్రచారం చేస్తుంది? చూపించు. ఏదో ఒక కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తాను’’ అన్నాడు ఆనంద్‌.‘‘ఇన్నీ చెప్తావుగానీ ఇంకో పిల్లనో, పిల్లాడినో కందామని ఉండదేరా నీకు? మితిమీరిన గారాబంతో బంటీగాడు పెంకెగా మొండిగా తయారవుతున్నాడు, ఇంకోడు ఉంటేనేగాని పంచుకోవడం తెలియదు... అసలు సంగతి బయట పెట్టింది ప్రసన్నలకి్క్ష. బంటీగాడు మొహం మాడ్చుకున్నాడు, నానమ్మ తనని ఇరికించినందుకు నిరసనగా. టైమ్‌ బాగోలేదంటూ పెరట్లోకి పరుగుతీసింది చింటూ, దాని వెనక పరిగెట్టాడు బంటీ.