కద్దరు దోతి, కద్దరు కమీజు. దాని మీద కద్దరు కోటు. నెత్తిమీద నెహ్రు టోపి. చేత్ల పుస్తకాల సంచి బట్కోని పెద్దబడి దిక్కు జల్దిజల్ది నడ్సుకుంట పోయెటాయిననే లెక్కల పంతులు వెంకట్రావు. గాయిన మా నాయిన. మా నాయిన గుండుకు గుండు ఉండెటోడు. ఎక్వ మాట్లాడెటోడు గాదు. ఎపడు సద్వుకుంట రాసుకుంట గూసునేటోడు. పొద్దుగాల్ల ఐదు గొట్టంగనే లేసి ఏడుగొట్టెదాంకగా దినం జెప్పేటి పాటాలను ఒకపారి జూస్కునేటోడు. పోరగాల్ల హోంవర్క్‌ వైలు దిద్దెటోడు.లెక్కలు జెప్పేటపడు మా నాయిన ఒక్కతాన్నే గూసోకుంట పోరగాల్ల తాన్కిబోయి గాల్లు లెక్కలు ఎట్ల జేస్తున్నరో జూసెటోడు. బడి ఇడ్సిపెట్టినంక ఇంటికొచ్చి చాయ్‌ దాగి అనం తారం గేటుదాంక తప్రికి బోయొచ్చెటోడు. కొంత మంది కల్లుదాగెతందుకు మా నాయిన అనంతారం గేటు కాడ్కి బోతున్నడని అనుకునే టోల్లు. అసల్‌ సంగతి ఎర్కైనంక గాల్లు వొచ్చి తప్పైంది, మమ్ములను మాప్‌ జెయ్యుండ్రి సార్‌ అని అన్నరు. తప్రి నుంచి వొచ్చినంక మా నాయిన తానం జేసి గూసునేటోడు. ఇంతల ట్యూషన్‌ పిల్లలు వొచ్చెటోల్లు. ఎన్మిది గొట్టెదాంక మా నాయిన గాల్లకు ట్యూషన్‌ జెప్పెటోడు.శనివారం మా నాయిన ఉపాసముండెటోడు. పల్లీలు దిని పాలు దాగెటోడు. ఖిల్ల కింద ఉన్న హన్మంతుని గుడికి బోయొచ్చెటోడు.

ట్యూషన్‌ అయినంక గింత దిని వసుచరిత్ర, మనుచరిత్ర లేకుంటె ప్యారడైజ్‌ లాస్ట్‌ అసుంటి వైలు సద్వు కుంట పదకొండు గొట్టంగ పండెటోడు. ఒకపారి మా నాయిన కందిలి ముంగట సదువుకుంట సదుకుంట నిద్రొస్తె సోల్గిండు. కందిలి మీద బడ్డడు. గాయి ఛాతి గాలింది. మా నాయినకు నల్పై ఏండ్లు నిండినంక నేను బుట్టిన. గందుకే నేను ఎన్నడు మా నాయినతోని బజార్కు బోయెటోన్ని గాదు.ఒగాల్ల బోతె ‘‘మీ తాతనా?’’ అని మా దోస్తులు అడిగితె-‘‘మీ మన్మడా?’’ అని కొంతమంది మా నాయినను అడిగెటోల్లు.అందరు మా అన్ననే మా నాయిన అనుకునేటోల్లు.ఒకపారి మా నాయిన నన్ను తోమిండు. ఎందుకంటె-