నిరంతర రాత్రులలో ఒక రాత్రి...గూళ్ళకు చేరుతున్న మెలకువ కువకువలు అవతలి క్షితిజంలోకి నిశ్శబ్దంగా వాలుతుండగా తల్లిదండ్రులను చుట్టుకుని పడుకున్న పిల్లలు వాళ్ళని ఏదన్నా కథ చెప్పమని అడిగారు.రేపటిని భయంతో కపకున్న మనుషులు నిద్రలోకి జారిపోతూ ... ‘‘మాకేమీ గుర్తులేదు. మా గతాన్ని ఎవరో తొలిచేశారు...’’‘‘...మీ కథల్ని మీరే చెపకోండి’’ వాళ్ళ ఆఖరి సమాధానం. వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. చీకటి తెర మీద సుషుప్తిది ఒకే నిశ్శబ్దం.వాళ్ళ జ్ఞాపకం లేని నిద్ర వర్తమానంలో లేని పేజీలను తెరుచుకుని దిగంతం మీద నోరు విప్పినపడు మధ్యలో మూసుకుపోయిన ఖాళీ మెరుపులా విచ్చుకుని రాయి ఒకటి విరిగి విరుచుకుపడింది.ఎక్కడో పిడుగుపడినట్లు గర్జన.అందరూ ఉలిక్కిపడి లేచి చూసుకున్నారు.

ఆశ్చర్యం... ఎక్కడ చూసినా ఉప్పెనలా నీళ్ళు. తామింతసేపు నీళ్ళలోనే పడుకున్నారా? తామిక్కడికి ఎలా వచ్చారు? లేక సముద్రమే నడిచివచ్చిందా?‘జలప్రళయం’ ఒక కంఠం అరిచింది.సముద్రతీరంలో వేసిన ప్రతి అడుగుకింద ఇసుక పిడికిలి పికిలిపోతూ ఉంది.నీళ్ళలో లేచి నడవలేక కొందరు మరణిస్తున్నారు. కొందరు అలసి లేవడానికి ప్రయాసపడుతున్నారు. లేచినవారు మళ్ళీ అడుగులు వేయలేకపోతున్నారు. అంతా నిజమే అనుకుంటున్న మునకలో ఎక్కడా హాహాకారాలు లేవు.‘ఏం జరుగుతుంది?’ కొందరు వణికిపోతూ అడిగారు.కఠోర ప్రవాహంలో కొట్టుకుపోతూ కంఠాలు కొన్ని చేతులు పైకెత్తి ‘యుద్ధాలను నిర్దేశిస్తున్న దేశాల చరిత్రలలో మానవీయ నేత్రాల మంచిచెడులు ముఖాలు మార్చుకుంటున్నాయి’ అన్నాయి తమని కబళిస్తున్న కెరటాలకు లొంగిపోతూ.‘‘మనం దారితప్పాం - మన గమ్యం వేరు’’పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు... ఏం జరుగుతుందోనని...‘‘జాగ్రత్త - మనదీ అదే దారి. నడవడం లేదు నడిపించబడుతున్నాం’’ఆకాశం నుంచి మెరుపు విసిరేసిన రాయి మెల్లగా ఏదో ఆకారం రూపుదిద్దుకుంటూ వుంది.‘‘ఏదో రాయి’’ అన్నారు కొందరు.‘‘కాదు రెక్కల స్త్రీ’’‘‘కాదు కాదు ఎవరో యువకుడు’’నిద్ర కళ్ళకు కనపడీ కనిపించని అస్పష్టమైన రూపం.. రాయి పక్షిలా మారుతున్నట్లు.. పక్షి మనిషి రూపం సంతరించుకున్నట్లు... ఫీనిక్స్‌లాఎవరు నీవు? గొణిగారు వారు అరమోడ్పునిద్ర నీళ్ళలో మళ్ళీ కాళ్ళీడుస్తూ.నూతిలోనుంచి ఎవరిదో గొంతు. ‘‘నేను అవతల లోతులలో మొలిచి ఇవతలి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆకురాలు కాలం రాలిన కాలాన్ని’’. ఆ కంఠం రానురాను దగ్గరవుతున్నట్లుంది.