పరంజ్యోతి ఆ వీధి మలుపు తిరుగుతున్నపడు ఒక మనిషి ఆయనకు దగ్గరగా వచ్చి -‘‘మీరు నాకో సాయం చెయ్యాలి’’ అన్నాడు.ఆ మనిషి ఎవరో పరంజ్యోతికి తెలీదు. ఇంతకుముందు ఎపడూ అతన్ని చూసిన గుర్తు కూడా లేదు.‘‘వివరంగా చెప్పండి’’ అన్నాడు పరంజ్యోతి.‘‘నా పేరు జాన్సన్‌. వరంగల్లు నుంచి వచ్చాను. ఈ వూళ్ళో నాకో స్నేహితుడు వున్నాడు. అతని పేరు రామజోగి. ఓ బేంక్‌లో జాబ్‌ చేస్తున్నాడు. అతను ఎక్కడో ఈ ప్రాంతంలోనే వున్నాడు. అతని ఇంటికోసం గంటనుంచి వెతుకుతున్నాను. ఎవ్వరూ చెప్పలేకపోయారు. కనీసం మీకు తెలిస్తే దయచేసి అతని ఇల్లు ఎక్కడో చెప్పండి’’ అన్నాడు అర్థింపుగా.‘‘పూర్తి అడ్రసు లేదా?’’‘‘సారీ.. అడ్రసు కాయితం తీసుకురావడం తొందరలో మరచిపోయాను. కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుంది.’’‘‘ఏమిటది?’’‘‘అతని ఇల్లు వినాయకుడి గుడి దగ్గరలో వుంటుందిట. ఈ వూళ్ళో ఒకే ఒక్క వినాయకుడి గుడి వుందని రామజోగి ఆర్నెల్ల క్రితం వరంగల్లు వచ్చినపడు చెప్పాడు.’’పరంజ్యోతి కనులు మెరిశాయి. అతను ఎపడో రోడ్డు మీద వెళుతున్నపడు ఓ ఇంటి గోడకు తగిలించి వున్న బోర్డు కనుల ముందు కదిలింది.గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నపడు చిన్నగా వర్షం మొదలయింది.‘‘రండి... మా ఇంట్లో కూర్చుందాం’’ అని ఆ వీధి మొదట్లోనే వున్న తన ఇంటికి జాన్సన్‌ను తీసుకువెళ్ళాడు పరంజ్యోతి.ముందు గదిలో కూర్చున్న తర్వాత భార్యను పిలిచి - ‘‘ఈయన జాన్సన్‌ గారు. 

నా స్నేహితులు. వరంగల్లు నుంచి వచ్చారు’’ అని చెప్పాడు.పరంజ్యోతికి రామజోగి ఇల్లు ఎక్కడో గుర్తుకు చవ్చింది.‘‘ఈ వెనుక రోడ్డులోనే మీ స్నేహితుడి ఇల్లు వుంది’’ అన్నాడు పరంజ్యోతి - జాన్సన్‌తో.సరిగ్గా అపడే పరంజ్యోతి భార్య ట్రేలో రెండు కపలతో కాఫీ తీసుకువచ్చింది.పరంజ్యోతి కాఫీ కపను జాన్సన్‌కు అందిస్తూ ‘‘కాఫీ తాగండి... మీ స్నేహితుడి ఇంటికి తీసుకువెళతాను’’ అన్నాడు.జాన్సన్‌ గబగబా కాఫీ తాగాడు.బయట వర్షం తగ్గిపోయింది.ఓ ఐదు నిముషాలకు పరంజ్యోతి - జాన్సన్‌ను వెనుక రోడ్డులో వున్న రామజోగి ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు వెళ్ళేసరికి రామజోగి ఇంట్లోనే వున్నాడు. పరంజ్యోతిని - జాన్సన్‌ రామజోగికి పరిచయం చేశాడు. తన ఇల్లు చూపించినందుకు స్నేహితుడితోపాటు రామజోగి కూడా పరంజ్యోతికి కృతజ్ఞతలు తెలియజేశాడు.కొంచెం సేపటికి పరంజ్యోతి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతని భార్య నవ్వుతూ ఇలా అడిగింది -‘‘ఎవరీ కొత్త స్నేహితుడు? ఈయన్ని ఎపడూ చూళ్లేదు. ఈయన గురించి మీరు ఎపడూ చెప్పలేదు కూడా’’పరంజ్యోతి నవ్వి జరిగినదంతా చెప్పి - ‘‘ఒక అపరిచిత వ్యక్తికి ఓ కప కాఫీ ఇచ్చినందుకు బాధపడుతున్నావా?’’ అనడిగాడు.