కళాభారతి ఆడిటోరియం.ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. విశాఖరత్న కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ఏర్పాటుచేసిన అభినందన సమావేశం జరుగుతోంది. వేదిక మీద కూర్చున్నానన్నమాటేగాని ఎదర ప్రేక్షకుల్లో ఆసీనురాలైన నా శ్రీమతి జయంతి మీదే ఉంది నా దృష్టి అంతా. ప్రక్కనే పాప కూర్చుని నన్నే చూస్తూ నవ్వుతోంది.‘‘ఈరోజు ప్రముఖ రచయిత చింతా అప్పారావు గారిని మగధీరుడు బిరుదుతో సన్మానించుకునే అవకాశం.. అదృష్టం... కలగడం మనందరి భాగ్యం. ఎంతో సహృదయం... సత్‌సంకల్పంతో విధివంచితురాలైన ఒక బిడ్డ తల్లిని ఇల్లాలుగా స్వీకరించి పునర్వివాహం చేసుకున్న అప్పారావు గారు ఎందరికో ఆదర్శవంతులయ్యారు. ఆదర్శం తనరచనల్లో వల్లించడమే కాదు తానూ ఆదర్శవంతుడిననే నిజాన్ని మనముందుంచారు. హేట్సాఫ్‌ అప్పారావు గారు. హేట్సాఫ్‌’’.కార్యనిర్వాహకుల్లో ఒకరు మైకు పట్టుకుని నన్నే పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.ఆ మాటలు... ఆ పొగడ్తలు... నన్ను ఈటెల్లా తాకుతున్నాయనిపించింది. మౌనంగా కళ్ళు మూసుకుని మనసులోనే జయంతి రూపాన్ని తలచుకున్నాను.జయంతి!ఆమెతో పరిచయమే చిత్రంగా జరిగింది.ఒక రోజు!బ్యాంకులో నగదు జమ చేద్దామని వెళ్ళాను. బ్యాంకు చాలా రద్దీగా ఉంది. నగదు ఓచరు రాసి, డబ్బు కట్టడానికి క్యాష్‌ కౌంటర్‌ దగ్గర క్యూలో నిలబడ్డాను.ఇంతలో ఆమె ఏవో అప్లికేషన్‌ ఫారాలు చేత్తో పట్టుకుని అటూఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. ఎవరెవరితోనో మాట్లాడుతోంది. వాళ్ళెందుకో అడ్డంగా అటూ ఇటూ తలలు ఊపుతున్నారు. ఆమెనే గమనిస్తూ నిలబడ్డాను. నేనే కాదు. నాలా చాలామంది ఆమెనే కళ్ళప్పగించి చూస్తున్నారు. 

క్యాష్‌ కౌంటర్‌ దగ్గర క్యూ నెమ్మదిగా సాగుతోంది. నిస్సిగ్గుగా ఇహపరాలను మర్చిపోయి ఆమె పిరుదులపై నాజూగ్గా నాట్యమాడుతున్న పొడవాటి జడని... జఘనాన్ని తదేకంగా చూస్తూ నిలబడిపోయాను. నా వెనుక ఉన్నఅతను నన్ను గమనిస్తున్నాడన్న విచక్షణ కూడా గాలికి వదిలేశాను.ఆమె చెయ్యి విడువకుండా పట్టుకొని అయిదేళ్ళ పాప ఆమె వెనుకే తోకలా తిరుగుతోంది. ఆమె ఉన్నట్టుండి నేను నిలబడ్డ క్యూ దగ్గరకు వచ్చింది. నేరుగా నా దగ్గరకే వస్తున్నట్టు అనిపించింది. గభాలున చూపులు మరల్చి ఏమీ తెలీని నంగనాచిలా క్యాష్‌ కౌంటర్‌ కేసి చూస్తూ నిలబడ్డాను.ఆమె తిన్నగా నా ముందర నిలబడ్డాయన దగ్గరకు వచ్చింది. ఓరగా ఆమెనే చూస్తున్నాను.‘‘సార్‌! మీకు ఈ బ్యాంకులో అకౌంట్‌ ఉంది కదా. కొంచెం ఈ ఫారంమీద సంతకం పెట్ట గలరా?’’ ఎంతో వినయంగా బ్రతిమలాడుతూఅడిగింది.‘‘దేనికి?’’ అతను ముక్కుసూటిగా అడిగాడు.‘‘నేను మీకు తెలుసునని...’’ ఆమె బిడియంగా అంది.‘‘మీరెవరో నాకు తెలీదు కదా? ఎలా సంతకం పెడతాను. సారీ’’ నా ముందున్న వ్యక్తి కరాఖండీగా చెప్పి క్యూలో ముందుకు సాగిపోయాడు. అంతా గమనిస్తున్న నాకు ఆమె నిస్సహాయ స్థితి, దయనీయమైన అభ్యర్థన నా