మనలోఒకరుఫ కేశిరాజుఫణిప్రసాద్‌ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు...డ్రాయింగ్‌ రూంలో కూర్చొని పేపరు చదువుతున్నాను! పేపరు చూస్తున్నానన్న మాటేకానీ మనసంతా కాఫీ కోసం ఎదురుచూస్తోంది!ఉదయం లేవగానే ఎటువంటి ఆలస్యం చేయకుండా మా ఆవిడ వసుధ కాఫీ ఇచ్చేస్తుంది.! ఈ రోజు ఆదివారం! స్నానం చేసే లోపే ఒకటి రెండుసార్లు కాఫీ తాగితే కానీ ఆగలేని మనసు రెండో సారీ కాఫీ కోసం విలవిల్లాడుతోంది.వంటింట్లో హడావుడిగా ఉందేమో అనుకుంటూ వసుధా అంటూ పిలిచాను! ‘‘ ఒక్క క్షణం, కాఫీ తీసుకొని నేనే వస్తున్నాను’’అంటూ మా ఆవిడ వెంటనే పలికింది! పైగా ఆప్యాయంగా పలికింది! ఏమిటో విశేషంమాట ప్రకారం క్షణంలో కాఫీ తెచ్చి ఇచ్చింది.! తను కూడా ఒక గ్లాసులో కాఫీ తెచ్చుకుంది.! తప్పకుండా ఏదో పని మీదే వచ్చింది.! కాఫీ తాగుతూ అనుకున్నాను.!‘‘ఈ మధ్య కాఫీ మంచి రుచిగా ఉంటోందోయ్‌’’ కాఫీ కపని వసుధకి ఇచ్చేసి మళ్లీ పేపరు చేతిలోకి తీసుకొన్నాను! వంటింట్లోకెళ్లిన మా ఆవిడ క్షణంలోనే నా దగ్గరకొచ్చింది! నా చేతిలోని పేపర్‌ను తీసుకొని జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టింది!విషయం ఏమిటోనని నేను అడగలేదు. ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుందని వసుధని చూసి అర్ధం చేసుకున్నాను!‘‘దశరధరామయ్యగారి పరిస్థితి రోజు రోజూకీ అఽధ్వాన్నమైపోతోంది’’ తను చెప్పబోయే సంగతికి మొదటి మాట! ‘‘దశరథ రామయ్యగారంటే జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను! అదే ఆ వేళాకోళమే నాకు నచ్చదు’’ సీరియస్‌గా చెప్పింది మా ఆవిడ! ‘‘మన వీధి చివర పాలబూత్‌ దశరథ రామయ్యగారి గురించేగా నువ్వు మాట్లాడేది’’ అని అడగగానే వసుధ అవునన్నట్టుగా తలూపింది!దశరథరామయ్య రిటైరయిన వ్యక్తి! ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డాడు! తన వాళ్ల సుఖసంతోషాల కోసం బాధ్యతల లైనులో అనుక్షణం నిలబడి తన బాధ్యతలను విరామం లేకుండా నిర్వహించిన ఓ సగటు మనిషి! రిటైరయ్యాక తన కొచ్చే పెన్షన్‌ డబ్బులు కూడా కొడుకు బాగోగుల కోసం ఇచ్చేసిన పిచ్చి తండ్రి! ఎవరికైనా డబ్బు అపురూపం గానీ, డబ్బు తెచ్చే మనిషిని అభిమానంగా చూడాలని అనుకునే కొడుకులు ఈ రోజుల్లో ఉంటారా? ఉంటే తప కదా!రిటైరయ్యాక కొడుకు దగ్గరే ఉండి అలసిన మనసుకు విశ్రాంతినివ్వాలని అందరి తండ్రుల్లాగే ఆశపడ్డారు!ఆసరాగా ఉంటాడనుకున్న కన్న కొడుకు ఆశ్రయం కూడా ఇవ్వలేదు. పైగా ఒక రోజు చెప్పకుండా ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు! ఎక్కడికో వెళ్లి తిరిగివచ్చిన దశరథరామయ్య తాలుకూ పాత సామాను మాత్రం ఖాళీ చేసిన ఇంట్లో కనపడింది! తన కన్నకొడుకు దృష్టిలో తనూ కూడా ఒక పాత సామాను అనే విషయం అర్ధం అయి నిస్సహాయంగా చతికిలబడిపోయాడా వృద్ధుడు!