ఢిల్లీ నుంచి విమానం వారణాసి చేరుకున్నట్టు ఎనౌన్సుమెంటు విని ముందుకు నడిచాడు మనోహర్‌. ‘వెల్‌ కం టు మారియా’ అన్న ప్లకార్డ్‌తో ‘ఎరైవల్స్‌’ దగ్గర నిలబడి బైటకు వస్తున్న ఒక్కొక్కరినే గమనిస్తున్నాడు.హాయ్‌! అంటూ ఓ అందమైన అమ్మాయి నవ్వుతూ తనవైపే రావడంతో ‘హాయ్‌! మారియా, వెల్కం టు వారణాసి’ అంటూ ఆమె చేతిలో పూలబొకే ఉంచాడు మనోహర్‌. ‘ఓ... థాంక్యూ’ అంటూ బొకే అందుకుని మెల్లిగా అతన్ని హగ్‌ చేసుకుని తన మెత్తటి బుగ్గలతో అతని బుగ్గల్నిరాస్తూ ‘హౌ ఆర్‌ యు’ నవ్వుతూ అడిగిందామె.‘ఐ యామ్‌ ఫైన్‌, హౌఈజ్‌ యువర్‌ట్రిప్‌ ఇన్‌ ఢిల్లీ’ అని ఎంతో హుందాగా అడిగాడు. ‘ఫర్వాలేదు, కానీ గైడ్‌ మంచివాడు కాదు అతడో మోసగాడు’ ఇంగ్లీషులోనే కాస్త కోపంగా చెప్పింది మారియా.

‘ఓకే లీవ్‌ ఇట్‌’ అని ఆమెను తీసుకుని తన కారువైపు వెళ్ళాడు మనోహర్‌. అక్కడున్నవాళ్ళందరూ మారియా అందాన్ని తేరిపారచూస్తూఉండటంతో పరుగులాంటి నడకతో కారుదగ్గరకు నడిచాడు. అందరి చూపులూ తనపైనే ఉండటం గమనించిన మారియా తన అందానికి లోలోపలే మురిసిపోయింది.ఫఫఫబుడాపెస్ట్‌, హంగేరీ నుండి ఇండియన్‌ కల్చర్‌ మీద రీసెర్చి చెయ్యడానికి వచ్చిన మారియాటెకాచ్‌ చూపులకు ఎంతో అందంగా ఉంటుంది. పోతపోసిన తెల్లటి పాలరాతి బొమ్మలా, ముట్టుకుంటే కందిపోయేలా ఉంది. నీలి కళ్ళు, సంపెంగముక్కు, ఎర్రగులాబీ మొగ్గల్లాంటి లేలేత అధరాలు, శంఖంలాంటి సన్ననిమెడ, లోతైనపొట్ట, ముందుకు పొంగుకొచ్చిన పరువాలతో మగవాళ్ళకు పిచ్చెక్కించేలా ఉండే పొడుగుకాళ్ళ సుందరి మారియా. ఆమె శరీరంలోని ప్రతి అంగమూ దేనికదే ప్రత్యేకం అన్నట్లుగా ఉన్నాయి.

కారు సీట్లో పక్కన కూర్చుని తదేకంగా ఆమెనే కళ్ళార్పకుండా చూస్తూ ఆమె అందాలను, శరీర కొలతలను కళ్ళతోనే కొలుస్తున్నాడు మనోహర్‌. ‘ఏయ్‌...! మిస్టర్‌, ఏంటా చూపు’ అని అతని ముఖం దగ్గర చిటికెవేస్తూ నవ్వుతూ అడిగింది మారియా. ఆమె ఏం మాట్లాడినా ఇంగ్లీషే.‘నో.. నఽథింగ్‌.. యు ఆర్‌ సో బ్యూటిపుల్‌... జస్ట్‌ లైక్‌ ఏన్‌ ఏంజిల్‌’ నవ్వుతూ అన్నాడు. ‘యూ నాటీ... అలా చూడ్డానికి నీకు సిగ్గులేదు. మీ మగవాళ్ళు అందమైన ఆడవాళ్ళను ఎంతో క్రేజీగాచూస్తూ చూపులతోనే ఎక్కడెక్కడో తడిమేస్తారు’ అంటూ, ‘మిస్టర్‌ మనోహర్‌ యుఆర్‌ ఆల్సో వెరీవెరీ హాండ్సమ్‌! సిక్స్‌ ప్యాక్‌తో, చక్కటి ఏబ్స్‌తో చాలాచాలా బాగున్నారు’ అని కితాబిచ్చింది. ‘థాంక్యూ మారియా, ఆన్నట్టు, రీజనబుల్‌ రేట్లలో ఎకామడేషన్‌ చూడమని మీ ఏజెంట్‌ చెప్పాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళదాం. అక్కడే మీకు ఓ రూమ్‌ ఏర్పాటుచేశాను’ చెప్పాడు మనోహర్‌.