అందమైన సాయంకాలం వేళ ఆర్‌.కె. బీచ్‌లో కూర్చుని వేడివేడి మిరపకాయబజ్జీలు తింటూ సముద్రం మీద నుంచి వచ్చే కెరటాలని, దూరంగా నెమ్మదిగా సాగిపోతున్న స్టీమర్లని, అస్తమిస్తున్న సూర్యుడిని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తూ ఇష్టమైన వాళ్లతో తీయని క బుర్లు చెప్పడంలోని థ్రిల్‌ మరెందులోనూ వుండదు! ఆ బీచ్‌లో అంజలి, మాధవ్‌ గువ్వ పిట్టల్లా పక్కపక్కనే ఒకరి దగ్గరగా మరొకరు కూర్చుని ఒకరి కళ్లల్లోకి ఒకరు ఈ ప్రపంచంతో సంబంధంలేనట్లుగా చూస్తూ వుండిపోయారు.‘‘అంజూ! నిన్ను భార్యగా పొందడం అన్నది నేను చేసుకున్న వేయి జన్మల పుణ్యఫలం. అదురుతున్న అధరాలని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా?నీ నునుపైన చెక్కిళ్లు, మత్తగా వుండే ఆ కళ్లూ.... ఓహ్‌... ఏదో ఏదో అయినది నాకేదో ఏదో అయినది....’’ మంద్ర స్వరంతో పాట అందుకున్నాడు మాధవ్‌. తెల్లగా వుండే ఆమె చెక్కిళ్లు అతనిపొగడ్తలతో అరుణోదయ కాంతుల్నివెదజల్లసాగాయి. ఎర్రటి అధరాలు చిన్నగా వణకడం మొదలుపెట్టాయి. ఆమె కళ్లు అరక్షణం సిగ్గుతోవాలిపోయాయి.‘‘చాల్లెండి.. ఎవరైనా చూస్తారు...’’ ముద్దుగా కోప్పడింది అంజలి చుట్టూ చూస్తూ. మాధ వ్‌కి ఆమెని ఒక్కసారి తాకాలని, గులాబి చెక్కిళ్లని ముద్దులతో ముంచెత్తాలని కోరిక కలిగింది. కాని అది బీచ్‌ అన్న వాస్తవం కళ్ల ముందు కదలగానే బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు.్‌్‌్‌ఆమెని పొగడ్డమే పనిగా పెట్టుకున్నాడు మాధవ్‌. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అంజలిని నీడలా వెంటాడుతూ ‘‘నువ్వు లేని నేను లేను. నువ్వే నేను...నేనే నువ్వు...’’ అని చిలిపిగా పాడుతున్నపడు ఆమె అందంగా హాయిగా నవ్వేది.

ఆ నవ్వు కోటి వెన్నెల కాంతులు వెదజల్లినట్టుయ్యేది మాధవ్‌కి. ‘‘ ఆమె తోడిదేలోకం. ఆమె లేనిదే జీవితమే లేదు’’ అన్నట్టుగా ఆమె వెనకే తిరగసాగాడు మాధవ్‌.‘‘దీన్ని ఏమంటారో తెలుసా?’’ ఒకరోజు అంజలి అంటే‘‘నువ్వే చెప!’’ అన్నాడు ఆమె చేయి పట్టుకొని లాగుతూ...‘‘పిచ్చి అంటారు!’’ పాలగిన్నె కిందకు దించుతూ అంది నవ్వుతూ...‘‘పోనీ నువ్వు ఏ పేరు పెట్టినా సంతోషమే. కాని అంజలి! నిన్ను చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది. ఒక పాలరాతి శిల్పం, ఒక మెరుపు తీగలా వున్న నిన్ను చూస్తుంటే భాష కందని భావాలెన్నో నాలో వూపిరి పోసుకుంటున్నాయి తెలుసా! అసలు ఆ సృష్టికర్త నిన్ను ఇంత అందంగా, అద్భుతంగా ఎలా తయారుచేసేడా? నాకోసమేనా? నేను నమ్మలేకపోతున్నాను...’’