ఫ్యామిలి కోర్టు.కోర్టు హాలంతా జనంతో కిక్కిరిసి పోయింది. బయట సరేసరి ఇంకా కొంత మంది జనం. టీవీ రిపోర్టర్స్‌, ప్రెస్‌ వాళ్ళతో గందరగోళంగా వుంది అక్కడి వాతావరణం.ఫ్యామిలీ కోర్టు నిత్యం ఏవో కేసులతో హడావిడిగానే వుంటుంది. కాని, ఆ రోజు మాత్రం అంతమంది జనంతో ఆ ప్రాంగణమంతా నిండుగా వుండటానికి కారణం లేకపోలేదు.లోపల జరుగుతోంది...విడాకుల కేసు.అందులో అది మాములు వ్యక్తికి సంబంధించిన కేసు కాదు. అందరికి అభిమానమైన అందాల నటుడు కార్తికేయ విడాకుల కేసు.మూడు నెలల క్రితం కార్తికేయ నుంచి విడాకులు కోరుతూ, హిందూ వివాహ చట్టం ప్రకారం క్రుయాలిటీ గ్రౌండ్స్‌ మీద పిటిషన్‌ దాఖలా చేసింది అతని భార్య గాయత్రి.ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి, మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న కార్తికేయ విడాకుల కేసు పెద్ద సంచలనంగా తయార య్యింది.్‌ ్‌ ్‌కోర్టు హాలులో ఓ ప్రక్క గాయత్రి నిలబడివుంది. ఆమె ముఖం అభావంగా శూన్యంలోకి చూస్తున్న ట్టుగా వుంది. ప్రక్కనే ఆమె తండ్రి నారాయణరావు.ఇంకో ప్రక్క కార్తికేయ. అతని ముఖం భావరహితంగా వుంది. లోపల కూర్చున్న మిగతావాళ్ళంతా మాత్రం జడ్జిగారు ఏంచెబుతారా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కేసు మొదలయిన మొదటి రోజునుంచి చాలా మంది ఆసక్తికరంగా ఫాలో అవుతున్నారు. 

అందరికీ అంతుబట్టని విషయం ఏమిటంటే? కార్తికేయ తన తరపున వాదించడానికి లాయర్ని పెట్టుకోలేదు.అందర్ని అయోమయంలో పడేసిన అంశం, కేసు విషయంలో కార్తికేయ మీద పెట్టబడిన అభియో గాలని అతను ఏ మాత్రం పెద్దగా ఖండించక పోవడం.ఇది అతని అభిమానుల్ని చాలా నిరుత్సాహ పరిచింది.జడ్జిగారు మాట్లాడారు ‘‘పూర్వాపరాలు, ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట తీర్పు ఇరవై మూడవ తారీఖుకి వాయిదా వేస్తున్నాను.’’ అని ముగించారు.వున్నట్టుండి అక్కడ కలకలం మొదలయ్యింది. లోపల వున్నవాళ్ళంతా తమ అభిమాన నటుడి కేసి ఎగబడ్డారు.ఇది చూసి అక్కడే వున్న పోలీసులు అందర్ని నెట్టి కంట్రోల్‌ చెయ్యసాగారు. ఈ లోపల కార్తికేయకి సంబంధించిన మనుషులు వచ్చి అతన్ని తొందరగా బయటకు తీసుకువెళ్ళారు.గాయత్రి తండ్రితో పాటు బయటకు వచ్చింది. వస్తూనే తిన్నగా కార్లో కూర్చుని డోర్‌ వేసుకుంది.టీవీ రిపోర్టర్స్‌, ప్రెస్‌ అంతా కార్తికేయని చుట్టేశారు. వాళ్ళకి ఏ మాత్రం అవకాశం యివ్వ కుండా అతని మనుషులు అందర్ని తోసేసి అతన్ని కారు దగ్గరకు తీసుకెళ్ళారు.అందరూ నిరాశపడ్డారు.అది గమనించి కార్లో కూర్చోబోతున్న కార్తికేయ వాళ్ళని దగ్గరకు పిలిచాడు. మీడియా వుత్సాహంగా అతని దగ్గరకు పరిగెట్టారు.కార్తికేయ వాళ్ళని చూసి ‘‘సారీ...యిపడేం మాట్లాడలేను. ఓ మారు యింటికి రండి’’ అని కారెక్కాడు.