పురుషోత్తమరావుకు ఇల్లు ఎప్పుడూ నిశ్శ బ్దంగా వుండాలి. ఏ మాత్రం శబ్దం, అల్లరీ భరించలేడు. PIN DROP SILENCE సూది క్రింద పడినా వినిపించేటంత....ఇప్పుడు అలాంటి నిశ్శబ్దమే అంతా ఆవరించి వుంది. దీన్నే అతను కోరుకునేవాడు.కథల్లోను, నవలల్లోను, కొన్ని కొన్ని ఆర్ట్‌ చిత్రా ల్లోనూ-‘చావులాంటి నిశ్శబ్దం’ చదవటం, చూడటం అందరికీ అనుభవమే.ఇప్పుడు అలాగే వుంది.తలుపు సందులోంచి పోస్ట్‌మాన్‌ తోసేసిన ఉత్తరం శబ్దం కూడా వినిపించింది.ఉత్తరాలు ఎంత కరవైపోయాయి....ఫోన్లలో ఎంత మాట్లాడినా ఉత్తరం దారి ఉత్తరానిదే కదా.రెండో కొడుకు నవీన్‌ వ్రాస్తుంటాడు అప్పు డప్పుడు. వచ్చేనెలలో రెండు మూడు రోజులు శెలవలు కలిసివస్తున్నాయి. మరో రెండు రోజులు మేమూ శలవు పెడతాం సరదాగా గడిపి వెళ్ళండి మాతోను, పిల్లలతోను అని.పురుషోత్తమరావుకీ అనిపించింది వెళ్ళి రావాలని.ఆటో చప్పుడు వినగానే-పిల్లలు ‘‘తాతగారొచ్చారు... తాతగారొచ్చారు’’ కేరింతలు, ఆనందంతో.పిల్లల హడావిడి చూసి నవీన్‌ బయటి కొచ్చాడు లోపల్నుంచి.

‘‘ఏమిటి నాన్నా ఈ సర్‌ప్రైజ్‌... వస్తున్నట్టు తెలియజేస్తే నేనే బస్టాండుకు వచ్చేవాడ్ని కదా’’లోపల నుంచి కోడలూ పలకరిస్తూ వచ్చింది.‘‘బావున్నారా మావయ్యా... ఏమిటి చాలా నీర సంగా కనిపిస్తున్నారు’’తీసుకొచ్చిన కథల పుస్తకాలు, స్వీట్లూ కోడలికి అందించాడు.క్షణాల్లో గదిని సిద్ధం చేసి- ‘‘ప్రయాణం చేసి వచ్చారు. కాసేపు రిలాక్స్‌ అవ్వండి’’ అన్నారు కొడుకు, కోడలూ.కొడుకు, కోడలూ-ఇద్దరూ ఏ మాత్రం శ్రమ కలిగించకుండా చక్కగా చూసుకుంటున్నారు. తనను ఎంతో బాగా చూసుకునే తన భార్య కళ్యాణి గుర్తొ చ్చింది.మనవలు కూడా బుద్ధిమంతులు. అల్లరి లేదు.నాలుగు రోజులు గడిచిపోయాయి. ఇలాగే కుదుర్చుకుని ఓ సారి పెద్ద కొడుకు దగ్గరికి వైజాగ్‌ వెళ్ళి రావాలి. ఏదో అలా ఆలోచిస్తుండగా పిల్లల అల్లరి చెవినబడింది. కోడలూ ఏదో అంటోంది.కాసేపటికి నిశ్శబ్దం...ఏమిటో విషయం తెలుసుకుందామని మంచం మీదా నుంచి లేచి తలుపు దాకా వెళ్ళాడు.‘‘మీరు అల్లరి చేయకుండా బుద్ధిమంతుల్లా వుండాలి తాతయ్య ఇక్కడ వున్నన్ని రోజులూ’’‘‘మమ్మల్ని బుద్ధిమంతులు అని ఎవరూ అనకపోయినా ఫరవాలేదు మేం మాలాగే ఎప్పటి లాగే వుంటాం. వుండనీయి... అదే బావుంటుంది’’‘‘మీ తాతగారికి ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా వుండాలి.