ఎపడొస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఈ ఎడబాటు వారం రోజులదే. కానీ అంతకుముందు జరిగిన సంఘటనలే నా ఆదుర్దాకి అసలు కారణం.సాయంత్రం ఆరవుతుండగా వచ్చి వాలాడు. నేనూహించిందే...! మాట్లాడకుండా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ‘‘అమ్మా... కాఫీ’’ అంటూ ఫ్రెష్‌ కావడానికి బాత్‌రూం వైపు నడిచాడు.ఏదో పనున్నట్లు చిన్నగా అక్కడికి వెళ్ళాను. ‘పలకరిస్తే బావుండు’. మనసు నన్ను మాట్లాడమంటోంది. అంతకుముందైతేనా విసురుగా దగ్గరికి లాక్కుని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తేవాడే! ఇపుడలా కాదులే! ఊహూ...! ఏ క్షణం నా క్షణం కాలేదు భోజనాలయ్యేవరకు. ఏదో చిన్న అలకని అత్తయ్యకీ తెలుసు. ఈరాత్రికి అది తొలగిపోతుందనుకుందో ఏమో... లేకపోతే ‘‘ఏంట్రా మాధవా... అల్లరి అటక మీద పెట్టావా...?’’ అంటూ కొడుకును పలకరించేదే! చపడు కాకుండా తలుపు పెట్టి పక్కమీద వాలాను. బుద్ధిగా నిద్రపోతున్నాడు. నేను కాస్త కదిలి మువ్వలు ఘల్లుమనేలా కాళ్ళు కదిలించాను.స్పందన రాలేదు. నేనూరుకుంటానా... జడను సవరించుకుంటున్నట్లు జరుపుతూ తన మీదికి విసిరాను. అదిరిపడి చూసి సీరియస్‌గా దిండూ, దుప్పటితో బెడ్‌ దిగాడు. చేయి పట్టి ఆపి మీదకి లాక్కుంటే... నేను తనకింకా అలుసైపోనూ...! అందుకే ఊరుకున్నాను.మళ్ళీ లేచి కూర్చున్నాడు, నేను తనలాగే పడక మార్చేసరికి.‘‘చూడు... నన్ను విసిగించకు. ఇక్కడ్నుంచి వెళ్ళు’’ కసురుకున్నాడు.మనసు చివుక్కుమంది.

 అంత కోపం అవసరమా?!లేచి వెళ్ళి బెడ్‌ మీద పడ్డాను... విసురుగా - కళ్ళలో నీళ్ళతో ఆరు నెలలు కావస్తోంది మా పెళ్ళై. పిన్ని కొడుకు పెళ్ళికని కరీంనగర్‌ వెళ్ళినపడు చూశాను. చురుకైన కళ్ళు... పెదాలను అతుక్కునుండే చిర్నవ్వు... నాకన్నా మరో అడుగు ఎత్తు. ఒతై్తౌన జుత్తు... కట్టలుగా వున్నట్లు మీసాలు...అంతవరకు చూడలేదనే నేను కొన్ని సెకనులు చూపు నిలిపాను.అమ్మో! బొమ్మలెగరేసి నవ్వుతున్నాడు. చూపు తిపకుని మూతి వంకరగా తిపతూ వెళ్ళిపోయాను.కాసేపటికి పెళ్ళి పందిట్లోకి వచ్చాడు. ‘‘ఎవరామె...’’ అన్నట్లు మా పిన్నినే అడుగుతున్నాడు. సమాధానం విన్నాక ‘‘అలాగా అత్తమ్మా...’’ అని నాకు వినిపించేంత గట్టిగా అన్నాడు.గుండె ఝల్లుమంది. వరుసకు బావన్నమాట.గుండెలో కొత్త జంట మీద అక్షింతలు వేయాల్సిన కార్యక్రమం.తనూ తీసుకున్నాడు. పెళ్ళి కానివారు అవి జల్లొద్దని అంటున్నా కూడా!అందరూ కొత్త జంట మీదికి విసిరితే... తను నామీదికి విసిరాడు. కాస్త కోపం... అంతలో చిన్న నవ్వు నా ముఖంపై.నెల తిరగకుండానే తలంబ్రాలు పోసుకు న్నాం!చాలా అల్లరోడు. పది రోజులు గడిచేసరికి నేనే ఆయన చుట్టూ తిరిగేవిధంగా మార్చుకున్నాడు. ఆ సరసాలూ... శృంగారం చెప్పకూడదుగానీ... ఎంత పరవశమో!