వాడు ఇంకా ఆశతో వున్నాడు తననెవరైనా రక్షిస్తారని....తనను ఈ జైలు గోడల నుండి విముక్తి చేయటానికి ఏ దేవుడైనా దిగి వస్తాడని..వాడికి ఆశ చచ్చిపోలేదు...తాను బయట ప్రపంచంలోకి వస్తానని-వాడు విశ్వాసంతోనే వున్నాడుఏ దేవుడైనా తనగోడు వినటానికి వస్తాడని-్‌ ్‌ ్‌వాడి వయస్సు 12 సంవత్సరాలు. ఇంకా పన్నెండు దాటలేదు.వాడు నెల రోజులుగా నిజామాబాద్‌ బాల నేరస్తుల జైలులో వుంటున్నాడు.వాడికి జైలు నరకంగా వుంది... ఏమి చేయగలడు? ప్రపంచం వాడికి తెలియదు. ఇంకా బాల్యం దాటని వయస్సు.చిరిగిపోయిన చొక్కా చింపిరి జుట్టు మోకాళ్ళ వరకు లాగు, లోతులు పోయిన కళ్ళు బొక్కలు తేలిన శరీరం.వాడు ఎన్నిసార్లు ఆ జైలులో ఎన్ని కన్నీళ్లు గార్చాడో ఎంత వెక్కివెక్కి ఏడ్చాడో ఎంత దిగులుతో బ్రతికాడో, ఎంత బెంగతో నిరాశామయ చీకట్లోకి ఎన్ని రాత్రులు నిశ్శబ్ధంగా చూచాడో, ఎన్ని చీకటి రాత్రులు నిద్రలేకుండా గడిపాడో- స్వయంగా అనుభవం వున్న ‘కవి’ అయితే చక్కగా చెప్పగలడు.్‌ ్‌ ్‌వాణ్ని చూచి వాని కథ విని కొన్ని రాత్రులు నిద్రరాక, నిద్రపోక ఇదేం వ్యవస్థరా బాబు అని తిట్టుకొని, మండిపడి ఏమీ చేయలేక నిరాశతో ఓ కథ అయినా రాద్ధామని వాడి కథ వ్రాయటం. కవితాత్మ కలిగిన ‘కవి’ మాత్రం వాడి దుఃఖం వచ్చేలా వ్రాయగలడు. 

నేను కథకున్నివాడు నిజామాబాద్‌ బస్టాండులో ఓ రాత్రి- ఒకరి జేబులోని పర్సుని దొంగిలించాడని, ఆ పర్సులో ఐదువేల రూపాయలున్నాయని, బస్‌ స్టాండులో పడుకొన్న వాన్ని లేపి తన్ని- జైలులో కుక్కి లాఠీలతో కొట్టారు.ఐదువేలు వాడి దగ్గర దొరకలేదు.వాడి మీద కేసు ఫైలు చేసారు.కోర్టుకు తీసుకెళ్ళారు.న్యాయమూర్తి ముందు నిలబెట్టారు.వానికింకా పన్నెండేళ్ళు దాటలేదు.న్యాయమూర్తి జైలుకు పంపాడు. తీర్పురాలేదు దొంగజైలులో వుండాలిగా... పన్నెండేళ్ళు దాటకపోతేనేం! పాతిక ఏళ్ళు దాటితేనేం. దొంగజైలులో వుండాలిగా....వాడు ఎంతకొట్టినా, ఎన్ని తన్నినా, ఎన్ని చిత్రహింసలు చేసినా బస్‌స్టాండ్‌లో, లాకప్‌రూమ్‌లో, న్యాయమూర్తి ముందు ఒకేమాట అన్నాడు ‘నేను దొంగతనం చేయలేదు’, ‘పర్సుతీయలేదు’