‘అరవై ఐదు సంవత్సరాల రిటైర్డు వ్యక్తికి ఒక స్నేహితుడు కావాలి. అతనికి కుటుంబముంది. విద్య, ఆదర సత్కారాలు, ఆర్ట్‌, సంగీతం పట్ల అభిరుచి వుంది. స్నేహితుని ఎలాంటి బలహీనతలనైనా, తపలనైనా పట్టించుకోకుండా, అతనితో చేతులు కలపాలనుకుంటున్నాను’’.న్యూస్‌పేపర్లో ప్రకటన చదివి డా. నాయక్‌ నవ్వసాగాడు.‘‘అరవై ఐదేండ్ల వరకు అతనికి స్నేహితుడే దొరకలేదా?’’‘‘ఎంతమంది స్నేహితులతో శతృత్వం పెంచుకున్నాడో మరి?’’ రషీద్‌ పేకముక్కలు పంచుతూ అన్నాడు.‘‘అందుకనే అతనికి ఇపడు కూడా ఒక స్నేహితుడూ దొరకడు’’ అందరూ ఒక్కసారిగా నవ్వారు.‘‘ఏ స్నేహితుడు లేకుండానే అరవై ఐదు సంవత్సరాలు గడిపేశాడు. అతన నాలా ఎంత ఒంటరివాడో!’’ స్వరణ్‌సింగ్‌ తల వంచుకుని ఆలోచిస్తున్నాడు. ఇంట్లో భార్య వుంది. పిల్లలున్నారు. చుట్టుపక్కల స్నేహితులున్నారు. చేతిలో రమ్మీ కార్డులు పట్టుకుని నన్నోడించాలనుకుంటున్నారు. ఎవరివైపు చేయి చాచినా వెనకడుగు వేస్తున్నారు.స్వరణ్‌సింగ్‌ టీకప కిందపెట్టాడు. నిస్సహాయంగా చేతులు నలుపసాగాడు.ఆరోజు ఆదివారం. వారంతా రమేష్‌ ఇంట్లో కూచుని రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ ఆడటం ఒక సాకు మాత్రమే. వారం పొడుగునా అలసటనుంచి, విసుగు నుంచి ఉపశమనం పొందడానికి వారంతా ఏదోఒకచోట కూచుంటారు. బాగా నవ్వుకుంటారు. భార్యాపిల్లలకు దూరంగా, ఆఫీసుకు దూరంగా, రాజకీయాలకు దూరంగా, అక్కడ లేని స్నేహితులను, వారి లోపాల్ని చర్చించుకుని ఆనందిస్తుంటారు. బీర్‌ తాగుతారు.

‘‘స్నేహితులకి బోర్‌ కొట్టించి వుంటాడు సాలా! నీ మాదిరి’’ నాయక్‌ బీరు గ్లాసు అందుకుంటూ అన్నాడు.‘‘అయితే నువ్వు అతని స్నేహితునిగా వుండు. డాక్టరువి కదా! అతని బాధకి మందివ్వు’’ అందరూ నవ్వారు.‘‘ఇంతమంది స్నేహితులిక్కడున్నారు. వీరి ఆగడాలు, అత్యాచారాలు తక్కువగా వున్నాయని మరో హార్ట్‌ పేషంటుని తెచ్చుకోమంటారా?’’ వినాయక్‌ చెంపపెట్టును తప్పించుకుంటూ అన్నాడు నాయక్‌.‘‘ఏదో ఒక పనిమనిషో, ఒక డ్రైవరో కావాలన్నట్లు ఇచ్చాడు ప్రకటన.’’‘‘స్నేహితులు కూడా మార్కెట్‌లో అమ్మకానికున్నారనుకుంటున్నాడు కాబోలు సాలా!’’రియాజ్‌ పేకముక్కలు టేబుల్‌ మీద పెట్టి, సిగరెట్‌ నోట్లో పెట్టుకున్నాడు.‘‘నాకెవరైనా స్నేహితుడున్నాడా?’’ ఇంతియాజ్‌ సిగరెట్‌ వెలిగించి లైటర్‌ ఆర్పేశాడు.‘‘అతనికి ఒక స్నేహితుడు కావాలి. కానీ స్నేహితుడెవరో అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా అతనికి తెలియలేదు.’’‘‘నీ ముఖం చూపిద్దాం అతనికి. ఆ తర్వాత స్నేహితుడే వద్దు మొర్రో అంటాడు’’ స్వరణ్‌సింగ్‌ ఇంతియాజ్‌ పిడికిలి గుద్దు తప్పించుకుంటూ అన్నాడు.‘‘నా చుట్టూ కూచుని వున్నవారంతా, నా స్నేహితులేనా? పరస్పరం ఒకరి బలహీనతల్ని, తపల్ని వెతికే ప్రయత్నంలో వుంటాం... తర్వాత అతని మూర్ఖత్వ పట్ల అందరి పకపకలు ఒక్కసారిగా ప్రతిధ్వనిస్తాయి.’’‘‘సాలా, ఇంట్లో వారికి బోర్‌ కొట్టిస్తూ వుంటాడు కాబోలు! అమ్మాయి కాలేజీ నుంచి ఎందుకు రాలేదు? అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? భార్య ఫోన్‌లో ఎవరితో మాట్లాడింది? నువ్వెక్కడికి వెళుతున్నావు?’’